Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెద్ద గొడవలు అక్కర్లేదు.. ఈ చిన్న తప్పులు చాలు బంధం తెగడానికి!
కాలం గడిచేకొద్దీ బంధాలు మారడం సహజం. ఒకప్పుడు మన ఫోన్ చాట్ లిస్ట్ లో టాప్ లో పదే పదే కనబడే పేరు..కాలక్రమేణా వందలాది పేర్ల గుంపులో ఎక్కడో అట్టడుకు వెళ్లిపోతుంది లేదా అసలు ఉండదు. ఒకప్పుడు రోజువారీ సంభాషణ ఎవరితో మొదలయ్యేదో చివరికి వారి నంబర్ మన ఫోన్ లోనే లేకుండా పోతుంది.
వాస్తవానికి అన్ని బంధాలు పెద్ద పెద్ద గొడవల వల్లే విడిపోవు. తెరవెనుక జరిగే అపార్థాలు, అశాంతి మాత్రమే కారణాలు కావు. ప్రేమ బంధాన్ని మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని ప్రవర్తనలు చిత్తు చేస్తాయి. ఆ సైలెంట్ కిల్లర్స్ ఏంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ చూడండి.

ప్రతి చిన్న విషయానికి విమర్శించడం
ప్రియమైన వారు తప్పు చేస్తే చెప్పడం మన బాధ్యత. కానీ దానికి ఒక సమయం, సందర్భం, పద్ధతి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి భూతద్దం పెట్టి తప్పులు వెతకడం, ఎత్తి చూపడం చేస్తే అవతలి వ్యక్తి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నేను దేనికీ పనికిరాను అనే భావన వారిలో మొదలై, ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది.
మౌనమే ప్రమాదం
గొడవ పడటం ఇష్టం లేక చాలామంది తమ భావాలను మనసులోనే దాచుకుంటారు. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, ఇది చాలా ప్రమాదకరం. సమస్యను పరిష్కరించకుండా వదిలేస్తే అది మనసులో గూడుకట్టుకుని ఏదో ఒకరోజు బంధాన్ని శాశ్వతంగా తెంచేస్తుంది.
కృతజ్ఞత లేకపోవడం
ఏ బంధానికైనా గుర్తింపు, ప్రశంసలు ఆక్సిజన్ లాంటివి. మీ భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను విస్మరించడం, లేదా ఏం జరిగినా వారు నాతోనే ఉంటారులే అనే అతి ధీమా పనికిరాదు. ఈ ప్రవర్తన కాలక్రమేణా బంధంలో పగుళ్లకు దారితీస్తుంది.
అతిగా ఆధారపడటం
ఒకరిపై ఒకరు ఆధారపడటం ప్రేమలో భాగమే. కానీ ఆర్థికంగా, మానసికంగా, ప్రతి చిన్న విషయానికి భాగస్వామిపైనే పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. ఇది అవతలి వారికి ఒక బరువులా అనిపిస్తుంది. అన్ని బాధ్యతలు నావేనా? అనే అసహనం మొదలైతే విడిపోవడం ఖాయం.
మార్పును స్వీకరించలేకపోవడం
కాలంతో పాటు మనుషులు, వారి అలవాట్లు మారుతుంటాయి. ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని మీరు అప్ డేట్ చేసుకోకపోవడం లేదా మీ భాగస్వామిలో వచ్చిన సానుకూల మార్పులను, ఎదుగుదలను స్వీకరించలేకపోవడం ప్రమాదకరం. కలిసి ఎదగడమే నిజమైన బంధం.
క్షమించే గుణం లేకపోవడం
సంఘర్షణ లేని బంధం ఉండదు. కానీ గొడవ జరిగినప్పుడు దాన్ని పరిష్కరించుకుని ముందుకు సాగాలి. పాత విషయాలను తవ్వుతూ, వంకర మాటలు మాట్లాడుతూ, పంతాలకు పోతే బంధం చెడిపోతుంది. క్షమించడం, మర్చిపోవడం అనే సూత్రం పాటించాలి.
తప్పును ఒప్పుకోకపోవడం
చివరగా, చాలా ముఖ్యమైనది బాధ్యత తీసుకోవడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ భాగస్వామిని నిందించడం, మీ తప్పులకు బాధ్యత వహించకపోవడం విడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. సారీ, ఇది నా తప్పు అని చెప్పడం వల్ల బంధం బలపడుతుందే తప్ప చిన్నబోదు.
ప్రేమను పుట్టించడం సులభం, కానీ నిలబెట్టుకోవడం కష్టం.



Click it and Unblock the Notifications