Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
పెళ్లిలో వధూవరులు అగ్ని కుండం చుట్టూ..7 సార్లు ప్రదక్షిణ చేయడానికి కారణం ఏంటో తెలుసా?
మనదేశంలో పెళ్లి వేడుక అనగానే వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో, బంధుమిత్రుల కోలాహం, మంగళవాయిద్యాలతో సందడితో అంతా సంబరంలా ఉంటుంది. డబ్బు లేని వాళ్లు అయినా సరే జీవితంలో ఒకసారే చేసుకునే పండుగ కదా ఇది అుకుంటూ అప్పు చేసి అయినా తమ పిల్లల పెళ్లి జరిపిస్తుంటారు. అయితే పెళ్లి సమయంలో ప్రాంతాన్ని ఆచార, సంప్రదాయాలు మారిపోతుంటాయి. అయితే ఏ ప్రాంతంలో అయినా హిందూ పెళ్లిలో సప్తపది ఆచారం తప్పక ఉంటుంది.పెళ్లికి ఈ ఆచారం ఆత్మ లాంటిదని పండితులు చెబుతారు.
ప్రజ్వలించే హోమాగ్ని సాక్షిగా వధూవరులు కలిసి నడిచే ఏడడుగులు వారి భవిష్యత్తు దాంపత్య జీవితానికి పునాదిరాళ్ళు. ఇది కేవలం ఒక తంతు కాదు, రెండు జీవితాలను, రెండు కుటుంబాలను కలిపే ఒక అద్భుతమైన ప్రమాణం. ఈ ఏడడుగులలో ప్రతి అడుగు వెనుక ఒక గూఢమైన అర్థం, ఒక పవిత్రమైన వాగ్దానం దాగి ఉన్నాయి. ఒక్కో అడుగుకు ఉన్న అర్థం ఏంటో ఇక్కడ చూడండి.

మొదటి అడుగు..సంపద,శ్రేయస్సు కోసం
వధూవరులు కలిసి వేసే ఈ తొలి అడుగు తమ ఇంటిని సిరిసంపదలతో, సుఖసంతోషాలతో నింపుతామని చేసే వాగ్దానం. ఈ ఇంటికి వచ్చే లక్ష్మీదేవివి నువ్వు అని వరుడు వధువును ఆహ్వానిస్తే, మీ బాధ్యతలలో పాలుపంచుకుంటూ ఇంటిని సుభిక్షంగా ఉంచుతాను అని వధువు ప్రమాణం చేస్తుంది. ఇది కేవలం ఆర్థికపరమైన సంపద మాత్రమే కాదు ఆహారం, ఆనందం, శ్రేయస్సుతో కూడిన పరిపూర్ణ జీవితానికి నాంది.
రెండవ అడుగు..బలం, ధైర్యం కోసం
జీవితమనే ప్రయాంలో కష్టాలు ఉంటాయి,సుఖాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఎటువంటి ఆటుపోటనైనా కలిసి ఎదుర్కొంటామని, ఒకరికొకరు కొండంత అండగా నిలుస్తామని ఈ రెండవ అడుగులో ప్రమాణం చేస్తారు. భర్త భార్యకు రక్షణ కవచంలా నిలిస్తే.. భార్య భర్తకు మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తుంది. ఈ అడుగు వారి బంధానికి బలాన్ని చేకూరుస్తుంది.
మూడవ అడుగు..విశ్వాసం, నిబద్ధత కోసం
ఏ బంధం అయినా విశ్వాసం అనే పునాది మీద నిలబడుతుంది. మూడవ అడుగులో వధూవరులు జీవితాంతం ఒకరికొకరు నమ్మకంగా, నిజాయితీగా ఉంటామని, పరస్పర గౌరవంతో తమ బంధాన్ని పవిత్రంగా కాపాడుకుంటామని ప్రతిజ్ణ చేస్తారు. ఈ నిబద్ధత వారి దాంపత్య జీవితాన్ని దృఢంగా నిలబెడుతుంది.
నాల్గవ అడుగు..ప్రేమ, గౌరవం కోసం
ఈ నాల్గవ అడుగు అన్యోన్యతకు, ప్రేమానురాగాలకు ప్రతీక. ఒకరినొకరు ప్రేమించడమే కాకుండా ఇరు కుటుంబాల పెద్దలను, సభ్యులను గౌరవిస్తామని, అందరినీ సమానంగా చూసుకుంటామని వాగ్దానం చేస్తారు. ఈ అడుగు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది.

ఐదవ అడుగు..సంతానం, బాధ్యత కోసం
తమ వంశాన్ని వృద్ధి చేస్తూ, ఉత్తమమైన సంతానాన్ని పొందాలని ఈ ఐదవ అడుగులో భగవంతుని ప్రార్థిస్తారు. పుట్టబోయే పిల్లలకు మంచి విలువలు, సంస్కారం నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరిస్తామని ప్రమాణం చేస్తారు.
ఆరవ అడుగు..ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం
జీవిత ప్రయాణాన్ని ఆనందంగా సాగించడానికి ఆయురారోగ్యాలు ఎంతో ముఖ్యం. ఆరవ అడుగులో ఇద్దరూ ఒకరికొకరు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ప్రార్థించుకుంటారు. జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్యపరంగా ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేసుకుంటారు.
ఏడవ అడుగు..స్నేహం, శాశ్వత బంధం కోసం
చివరిదైన ఈ ఏడవ అడుగుతో వారి బంధం పరిపూర్ణమవుతుంది. భార్యాభర్తలుగానే కాకుండా జీవితాంతం ప్రాణ స్నేహితులుగా కలిసి ఉంటామని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఈ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకుంటామని చేసే ప్రమాణమే ఈ ఏడవ అడుగు. ఇది వారి బంధాన్ని విడదీయరానిదిగా చేస్తుంది.



Click it and Unblock the Notifications