Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ లవర్ లేదా భాగస్వామికి మీపై బోర్ కొట్టిందని తెలిపే సంకేతాలు ఇవే
ఏ బంధం అయినా మొదట్లో అద్భుతంగానే ఉంటుంది. ప్రేమ, వివాహ బంధం అయితే మనసులోని మాటలను పంచుకోవడానికి గంటలు కూడా సరిపోవు. ప్రతి చిన్న విషయానికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒకరినొకరు చూసుకున్న ప్రతిసారీ ఏదో తెలియని కరెంట్ ప్రవహించినట్లు అనిపిస్తుంది. కానీ, కాలం గడిచే కొద్దీ కొన్ని బంధాలలో ఈ ప్రకాశం నెమ్మదిగా మసకబారడం మొదలవుతుంది. మాటలు తగ్గిపోతాయి, ఆకర్షణ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఒకరు బంధాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతుండటం, మరొకరు నెమ్మదిగా దూరం జరగడం ప్రారంభించడం మనం తరచుగా చూస్తుంటాం.
మీ బంధంలో కూడా ఏదో తేడాగా అనిపిస్తోందా? మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పు గమనించారా? అది వారిలో మీపై ఆసక్తి తగ్గిందనడానికి సూచన కావచ్చు. వారు విసుగు చెందినా, ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ప్రవర్తన ద్వారా బయటపెడుతుండవచ్చు. భాగస్వామి మీతో విసుగు చెందారని తెలిపే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇక్కడ చూడండి.

మాటల్లో ఆసక్తి శూన్యం
ఒకప్పుడు మీ కబుర్ల కోసం చెవులు రిక్కించి వినేవారు.. మీరు చెప్పే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా ఆలకించేవారు ఇప్పుడు మీరు ఏదైనా చెప్పబోతే వారి దృష్టి ఫోన్ పైనో, టీవీపైనో ఉంటుంది. మీ మాటలను మధ్యలోనే ఆపేయడం లేదా అవునా, సరే వంటి ఆసక్తిలేని సమాధానాలు ఇవ్వడం చేస్తుంటే మీ సంభాషణపై వారికి ఆసక్తి పోయిందని అర్థం. ఇది బంధంలో ఏర్పడుతున్న మానసిక దూరానికి మొదటి సంకేతం.
స్పర్శలో పెరిగిన దూరం
ప్రేమలో స్పర్శ ఒక శక్తివంతమైన భాష. ఒకప్పుడు మీ చేయి పట్టుకోవడానికి, మిమ్మల్ని కౌగిలించుకోవడానికి అవకాశాలు వెతికిన మీ భాగస్వామి, ఇప్పుడు మిమ్మల్ని తాకడానికి కూడా సంకోచిస్తున్నారా? బహిరంగ ప్రదేశాల్లో మీ చేయి పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ భౌతిక దూరం, మానసికంగా వారు మీకు దూరమవుతున్నారనడానికి బలమైన నిదర్శనం. ఆ వెచ్చని స్పర్శ ఇప్పుడు వారికి భారం అనిపిస్తోందని ఇది సూచిస్తుంది.
ఫోన్ కాల్స్, మెసేజ్ లలో నిర్లక్ష్యం
గతంలో వారి నుండి వచ్చే ప్రతి మెసేజ్ మీ ముఖంలో చిరునవ్వును పూయించేది. ఇప్పుడు గంటలు గడిచినా మీ సందేశాలకు సమాధానం రావడం లేదా? కాల్ చేస్తే బిజీగా ఉన్నానంటూ సంభాషణను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది మీరు వారి ప్రాధాన్యతల జాబితాలో వెనక్కి వెళ్లారని చెప్పే చేదు నిజం.

కలిసి గడిపే సమయానికి సాకులు
మిమ్మల్ని కలవడం కోసం ఒకప్పుడు ఎంతో ఆరాటపడిన వారే, ఇప్పుడు కలిసి సమయం గడపడానికి రకరకాల సాకులు చెబుతున్నారా? స్నేహితులతో పార్టీలు, ఆఫీసు పనులు అంటూ మిమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నారా? ఇష్టమైన వారితో సమయం గడపాలని ఎవరైనా కోరుకుంటారు. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటే వారు మీ సాంగత్యాన్ని కోరుకోవడం లేదని, విసుగు చెందారని అర్థం చేసుకోవాలి.
ప్రతి చిన్న విషయానికీ చిరాకు, ఎగతాళి
ఒకప్పుడు మీరు చేసిన చిన్న పొరపాట్లను కూడా నవ్వుతూ స్వీకరించిన వారే, ఇప్పుడు అవే విషయాలకు చిరాకు పడుతున్నారా? మీ అభిప్రాయాలను, అలవాట్లను ఎగతాళి చేస్తున్నారా? ఇది సంబంధంలో వారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది. వారిలోని అసహనాన్ని, కోపాన్ని ఈ రూపంలో బయటపెడుతూ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గమనించాలి.
ఈ సంకేతాలను గమనించడం బాధాకరమే కానీ వాస్తవాన్ని అంగీకరించడం బంధం భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. ఇది సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి మొదటి అడుగు అవుతుంది.



Click it and Unblock the Notifications