Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
రొమాన్స్ మధ్యలో మూడ్ ఖరాబ్ చేసే మాటలు ఇవే.. అస్సలు అనకండి
దాంపత్య జీవితంలో శృంగారం అనేది ముఖ్యమైన అంశం. భాగస్వాముల మధ్య ప్రేమను, నమ్మకాన్ని,భావోద్వేగ బంధాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సమయంలో దొరికే ఆనందం, ప్రశాంతత మరే ఇతర సమయంలోనూ దొరకదు అనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే జంటలు తమ బంధంలో ఎప్పుడూ తాజాదనం ఉండేలా చూసుకోవడానికి, కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శృంగారం లేదా సాన్నిహిత్యం సమయంలో ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో, ఆ సమయంలో జరిగే సంభాషణ కూడా అంతే ముఖ్యం.

చాలా మంది జంటలు భావోద్వేగ ప్రవాహంలో ఉండి ఆ సమయంలో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ చిన్న చిన్న మాటలే మూడ్ మొత్తాన్ని నాశనం చేయడమే కాకుండా, భాగస్వామి మనసును కూడా గాయపరుస్తాయి.శృంగార సమయంలో భాగస్వామితో మాట్లాడకూడని మాటలు ఏవో ఇక్కడ చూడండి.
తీవ్రమైన చర్చలకు ఇది సమయం కాదు
శృంగారంలో పాల్గొంటున్నప్పుడు మనసు పూర్తిగా తేలికగా, ఉల్లాసంగా ఉండాలి. చాలా మంది ఈ ఏకాంత సమయాన్ని తీవ్రమైన విషయాలు చర్చించడానికి వాడుకుంటారు. ఆఫీసు టెన్షన్లు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు లేదా కుటుంబ గొడవల గురించి మాట్లాడటానికి ఇది అస్సలు సరైన సమయం కాదు.
ఇలాంటి సీరియస్ విషయాలు చర్చించడం వల్ల రొమాంటిక్ మూడ్ చెడిపోవడమే కాకుండా అవతలి వ్యక్తి ఒత్తిడికి లోనవుతారు. వారి ఏకాగ్రత దెబ్బతిని, ఆ క్షణాలను ఆస్వాదించలేరు. కాబట్టి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాక ప్రపంచాన్ని మర్చిపోండి, కేవలం మీ ఇద్దరి గురించి మాత్రమే ఆలోచించండి.
విమర్శలు - నెగిటివ్ అభిప్రాయాలు
నిజాయితీగా ఉండటం మంచిదే కానీ అది సందర్భోచితంగా ఉండాలి. సాన్నిహిత్యం సమయంలో భాగస్వామి పనితీరును విమర్శించడం లేదా వారి ప్రవర్తనపై నెగటివ్ కామెంట్స్ చేయడం చాలా ప్రమాదకరం. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావ్? నాకు ఇది నచ్చట్లేదు అంటూ కఠినంగా మాట్లాడటం వల్ల మీ భాగస్వామి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
వారు తమను తాము తక్కువ చేసుకున్నట్లు ఫీలవుతారు. ఒకవేళ మీకు ఏదైనా మార్పు కావాలనుకుంటేదానిని సున్నితంగా, ప్రేమగా చెప్పాలి తప్ప, విమర్శించకూడదు. ఆ సమయంలో వారిని మెచ్చుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
గతం తాలూకు జ్ఞాపకాలు
ఇది మీ శృంగార జీవితాన్ని అత్యంత వేగంగా నాశనం చేసే అంశం. మీ ప్రస్తుత భాగస్వామితో ఏకాంతంగా ఉన్నప్పుడు, పొరపాటున కూడా మీ మాజీ ప్రేమికుల గురించి లేదా గత లైంగిక అనుభవాల గురించి ప్రస్తావించకండి.
నా ఎక్స్ ఇలా చేసేవారు అని పోల్చడం లేదా పాత విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల మీ భాగస్వామికి తీవ్రమైన అభద్రతా భావం కలుగుతుంది. వారి మనసులో అనుమానాలు మొదలై, మీపై ఉన్న ఆసక్తిని పూర్తిగా కోల్పోతారు. గతం గతః అని వదిలేసి, ప్రస్తుత భాగస్వామితో ఉన్న ఈ మధుర క్షణాలను మాత్రమే ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications











