Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Best time for romance: ఉదయాన్నే శృంగారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
శృంగారం అనే పేరు వింటేనే కొందరిలో ఎక్కడా లేని ఊపు, ఉత్సాహం వస్తాయి. శృంగారం వల్ల శారీరక సుఖంతో పాటు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే శృంగారానికి సరైన సమయం ఏది? ఎన్నో జంటలను వేధించే ప్రశ్న ఇది. రాత్రిపూట చీకట్లో శృంగారంలో పాల్గొంటేనే బాగుంటుంది అని చాలా జంటలు భావిస్తాయి. ఉదయం పూట ఆఫీసులు, పనులకు హడావుడిగా వెళ్తారు..దీంతో రాత్రి పూట భాగస్వామితో ఏకాంతంలో చీకటినీడల్లో శృంగారంలో పాల్గొనేందుకు ప్రాధానత్య ఇస్తారు. అయితే ఇందులో చాలామంది ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేక బాధపడుతుంటారు.
ఆధునిక వైద్య శాస్త్రం మాత్రం ఉదయం పూట శృంగారానికే తన ఓటు వేస్తోంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం పొద్దున్నే నూతనోత్తేజంతో చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా,లైంగిక ప్రేరేపణను కలిగించే హార్మోన్లు ఈ సమయంలో గరిష్ఠ స్థాయిలో ఉంటాయట. అందుకే, పరిపూర్ణమైన ఆనందాన్ని తృప్తిని పొందాలంటే ఉదయం వేళే సరైనదని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఉదయం శృంగారం కేవలం శారీరక సుఖానికి మాత్రమే పరిమితం కాదు. అది మీ బంధాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బలోపేతం చేసే ఒక అద్భుతమైన మార్గం. ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.

అద్భుతమైన లైంగిక సంతృప్తి
రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరం, రాత్రిపూట శృంగారానికి పూర్తిగా సహకరించకపోవచ్చు. కానీ ఉదయం వేళ శరీరం శక్తితో నిండి ఉంటుంది. ముఖ్యంగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉదయాన్నే అత్యధికంగా ఉంటాయి. ఇది తీవ్రమైన లైంగిక కోరికలను రేకెత్తించి, అంగస్తంభన సమస్యలను కూడా దూరం చేస్తుంది. దీనివల్ల ఇద్దరికీ పరిపూర్ణమైన లైంగిక సంతృప్తి లభించే అవకాశాలు పెరుగుతాయి.
వ్యాయామానికి చక్కటి ప్రత్యామ్నాయం
ఉదయాన్నే లేచి జిమ్‌లో చెమటలు చిందించడం అంటే చాలామందికి బద్ధకం. అలాంటి వారికి ఉదయం శృంగారం ఒక చక్కటి, ఆనందకరమైన ప్రత్యామ్నాయం. శృంగారం ద్వారా గణనీయమైన కేలరీలు ఖర్చవుతాయి.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. విభిన్న భంగిమలను ప్రయత్నించడం వల్ల శరీరానికి మంచి స్ట్రెచింగ్ లభించి, కండరాలు ఫ్లెక్సిబుల్ గా మారతాయి.
రోజంతా ఉత్సాహం
ఉదయం పూట ప్రేమతో కూడిన శారీరక కలయిక మీ బంధానికి కొత్త ఊపిరినిస్తుంది. శృంగారం సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్), డోపమైన్ (ఆనంద హార్మోన్) వంటివి విడుదలవుతాయి. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంచుతాయి. ఎంతటి పని ఒత్తిడి ఎదురైనా, దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే శక్తినిస్తాయి.

సహజమైన రోగనిరోధక కవచం
ఉదయాన్నే చేసే శృంగారం మీ శరీరానికి ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సమయంలో ఇమ్యునోగ్లోబులిన్-ఏ అనే యాంటీబాడీ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థలో ఒక సైనికుడిలా పనిచేసి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. తరచుగా అనారోగ్యం బారిన పడేవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
జ్ఞాపకశక్తికి పదును
ఉదయం పూట శృంగారం మీ మెదడుకు ఒక మంచి ఎక్సర్ సైజు మాదిరి ఉంటుంది. ఈ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మెదడును చురుగ్గా, అలర్ట్ గా మారుస్తాయి. దీనివల్ల రోజంతా చేసే పనులపై ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే పొద్దున ఈ ప్రేమపూర్వక వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి.



Click it and Unblock the Notifications