Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ఫ్రెండ్ షిప్ లో పెరుగుతున్న ఘోస్టింగ్..దీని నుండి బయటపడటం ఎలా?
ఈ మధ్య సంబంధాలన్నీ తుమ్మితే తెగిపోయేవిగా,దగ్గితే ఊడిపోయేవి అన్నట్లుగా మారిపోయాయి. ఏళ్ల తరబడి ప్రాణ స్నేహితులుగా ఉన్నవాళ్లు సడెన్ గా విడిపోతున్నారు..ఏళ్ల తరబడి కాపురం చేసిన భార్యాభర్తలు కూడా సర్దుకుపోతే సద్దుమణిగే కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు..అయితే వీరీలో ఎవరైనా ఎలాంటి కారణం చెప్పకుండా మన జీవితంలోంచి అకస్మాత్తుగా మాయమైపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ గాయం మానడం మరింత కష్టం.
సంబంధాలలో ఈ మధ్య కాలంలో ఘోస్టింగ్ అనే పదరం తరచుగా వినిపిస్తోంది. ఇది కేవలం ప్రేమబంధానికి సంబంధించిందో లేదా డేటింగ్ కు సంబంధించిందో అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇది ప్రతి బంధానికి సంబంధినదే. అసలేంటీ ఘోస్టింగ్ దీని సంకేతాలు ఏంటీ? స్నేహ బంధంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దీని నుంచి బయటపడటానికి టిప్స్ ను ఇక్కడ చూడండి.

ఘోస్టింగ్ అంటే ఇదే
ఎలాంటి కారణం చెప్పకుండా ఒక వ్యక్తి అది ఫ్రెండ్ అయినా లేదా కుటుంబ సభ్యుడైనా లేదా లవర్ అయినా మనతో సంప్రదింపులు ఆపడేయాన్నే ఘోస్టింగ్ అంటారు. మనం పంపే మెపేజ్ లు చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం, మన ఫోన్ కాల్స్ ఎత్తకపోవడం, చివరికి బ్లాక్ చేయడం వంటివి దీని సంకేతాలు. అయితే ఇది కేవలం ఆన్ లైన్ లోనే పరిమితం కాదు..బయట ఎక్కడ అయినా ఎదురుపడ్డప్పుడు చూసి చూడనట్లు తల తిప్పుకొని వెళ్లిపోవడం..ఎంత ట్రై చేసినా మాట్లాడకపోవడం వంటివి కూడా ఘోస్టింగే. ఇది సంబంధం ముగిసిపోవడం కాదు, ఒకరి వైపు నుండి బలవంతంగా తెంచుకోవడం. అందుకే ఇది ప్రియమైన వారిని కోల్పోయినంత దుఃఖాన్ని మిగులుస్తుంది.
ఎందుకు ఘోస్ట్ చేస్తారు?
కొన్నిసార్లు తీవ్రమైన విభేదాలను, ముఖాముఖి మాట్లాడే ఇబ్బందిని తప్పించుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పెళ్లి, కొత్త ఉద్యోగం, విడాకులు వంటి జీవితంలోని పెద్ద మార్పులు కూడా స్నేహితుల సంఖ్యను తగ్గించుకోవడానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఆత్మరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం కూడా కావచ్చు. మానసికంగా హింసించే, విషపూరిత సంబంధాల నుంచి బయటపడటానికి ప్రయత్నించినప్పుడు అవతలి వారి నుంచి వ్యతిరేకత ఎదురైనప్పుడు, తమను తాము కాపాడుకోవడానికి ఘోస్టింగ్ ఒక ఆయుధంగా మారుతుంది. ఇది తప్పించుకోవడం కాదు, తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న చివరి ప్రయత్నం.
ఈ బాధ ఎందుకంత తీవ్రంగా ఉంటుంది?
ఘోస్టింగ్ మనలో తీవ్రమైన వేదనను మిగులుస్తుంది. ఎందుకు వెళ్లిపోయారో తెలియని సందిగ్ధత, మన మనసును స్థిమితంగా ఉండనీయదు. మనదే తప్పేమోనని పదేపదే ఆలోచిస్తూ, మనల్ని మనం నిందించుకుంటాం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, భవిష్యత్తులో కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా భయపడేలా చేస్తుంది.

దీని నుంచి ఎలా బయటపడాలి
భావాలను అంగీకరించండి: బాధ, కోపం, దుఃఖం కలగడం సహజం. వాటిని అణచివేయకుండా, ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తపరచండి.
సపోర్ట్ తీసుకోండి: మీ అనుభవాన్ని నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మానసిక నిపుణులతో పంచుకోండి. ఇది ఒంటరితనాన్ని తగ్గించి, మీకు అండగా నిలుస్తుంది.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి: జరిగినదాన్నే తలుచుకుంటూ బాధపడటం మానేసి, మీపై మీరు దయ చూపండి. వ్యాయామం, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
మీకంటూ ఒక ముగింపు పలకండి: అవతలి వ్యక్తి నుంచి సమాధానం కోసం ఎదురుచూడటం మీ బాధను పెంచుతుంది. బదులుగా, మీ భావాలన్నింటినీ ఓ ఉత్తరంలో రాసి మీ కథకు మీరే ఒక ముగింపు ఇచ్చుకోండి. ఇది మీకు స్పష్టతను ఇచ్చి, ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications
