Latest Updates
-
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!
బెడ్ రూమ్ లో బట్టలిప్పేసి పడుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలియాల్సిందే!
బెడ్రూమ్ అంటే జంటలకు ఓ స్వర్గధామం. వారి సుఖాలు, కష్టాలు అన్నీ పంచుకునేది ఇక్కడే. ఇక్కడ ఏ విషయంలో దాపరికం లేకుండా ఉండాలని జంటలు కోరుకుంటారు. పడకగదిలో దంపతుల మధ్య దుస్తుల విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. ముఖ్యంగా లైంగిక చర్యలో నగ్నత్వం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే కొందరు భర్తలు అలవాటుగా, ప్రతిరోజూ రాత్రిపూట ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నిద్రపోతుంటారు. ఇదే చాలా ఇళ్లలో భార్యలకు ఒక సున్నితమైన సమస్యగా, చెప్పలేని ఇబ్బందిగా మారుతోంది. భర్త అలవాటు వల్ల అదే మంచంపై పడుకునే భార్య తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది.
ఆరోగ్యమా? అసౌకర్యమా?
ఈ అలవాటున్న పురుషులు బట్టలు వేసుకుంటే నిద్ర పట్టదని, చాలా ఉక్కపోతగా ఉంటుందని వాదిస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బట్టల్లేకుండా నగ్నంగా నిద్రపోవడం ఆరోగ్యానికి పూర్తిగా చెడ్డదేమీ కాదు. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మేలు చేస్తుందని, చర్మానికి గాలి స్వేచ్ఛగా తగలడం మంచిదని చెబుతారు. అయితే ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్న పరిస్థితులను, సందర్భాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం.

ప్రతి విషయానికీ స్థానం, సమయం, సందర్భం అనేవి ఉంటాయి. ఉదయాన్నే పనిమనిషి వచ్చే సమయానికి కూడా భర్త అదే స్థితిలో మంచంపై ఉంటే భార్య పడే ఇబ్బంది వర్ణనాతీతం. అంతేకాకుండా పిల్లలు ఉన్న ఇళ్లలో వారు హఠాత్తుగా గదిలోకి వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇది భార్యను మానసికంగా కలవరపెడుతుంది. అందుకే ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పరిష్కార మార్గాలు ఇవే
ముందుగా భర్తతో ఈ విషయం గురించి ప్రేమగా, సున్నితంగా మాట్లాడాలి. తన అలవాటు వల్ల మీరు పడుతున్న ఇబ్బందిని వివరించాలి. కనీసం పల్చని లోదుస్తులు లేదా లుంగీ లాంటివి ధరించి నిద్రపోవడానికి ఒప్పించాలి.
ఒకవేళ అలవాటును మార్చుకోవడం అసాధ్యం అనిపిస్తే, ఆ అలవాటును కేవలం పడకగదికి మాత్రమే పరిమితం చేయాలి. గదికి లోపలి నుంచి గడియ పెట్టుకోవడం తప్పనిసరి. ఆ గదిలోకి పిల్లలు గానీ, ఇతరులు గానీ ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి. గది దాటి బయటకు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా దుస్తులు ధరించేలా చూసుకోవాలి. పరస్పర గౌరవంతో ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
