Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పెళ్లి చూపుల్లో అమ్యాయిని ఈ ప్రశ్నలు తప్పకుండా అడగాలి..! నిపుణుల హెచ్చరిక..!
పెళ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగే పండగ వేడుక. కొందరు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటారు. కానీ హిందూ శాస్త్రంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత వున్నది. పాశ్చాత్య సంస్కృతి వల్ల పెళ్లికి ప్రస్తుతం విలువ లేకుండా పోతోంది. దీనికి చాలా కారణాలు వున్నాయ్. వివాహం తరువాత భార్యా భర్తల మధ్య గొడవలు విపరీతంగా పెరిగి వాళ్లిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తోంది. కాబట్టి పెళ్లికి ముందే మారిటల్ కౌన్సిలింగ్ లేదంటే పెద్దల, ప్రముఖ నిపుణుల సలహా తీసుకోవాలని అంటున్నారు. వివాహానికి ముందు పెళ్లి చూపులు జరుగుతాయ్. ఆ పెళ్లి చూపుల్లో కాబోయే భార్యను భర్త తప్పకుండా అడగాల్సిన కొన్ని ప్రశ్నలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రశ్నలేంటో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాము.
ముందుగా ఎటువంటి భార్య కావాలో పెళ్లి చేసుకునే వ్యక్తికి ఒక క్లారిటీ వుండాలి. డ్రెస్సింగ్ చాలా హుందాగా వుండేలా జాగ్రత్తపడాలి. పెళ్లికి స్నేహితులను తీసుకొని వెళ్లవద్దు. పెళ్లి చూపుల్లో ఏ ప్రశ్నలడిగినా నిజాయితీగా నవ్వుతూ సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానాలను వారు తరువాత ఎంక్వైరీ చేస్తారన్న విషయాన్ని కనుక్కోవాలి.

కాబోయే భార్యను మాత్రమే కాకుండా అత్తామామను కూడా గమనించాలి. కాబోయే పెళ్లి కూతురు అందం ముఖ్యమే కానీ అదే ప్రధానం కాదన్న విషయాన్ని గమనించాలి. పెళ్లి చూపుల్లో అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ప్రశ్నలు వేయడం వల్ల వారి మనస్తత్వాన్ని అర్థమవుతుంది.
అమ్మాయి ఇష్టాయిష్టాల, నచ్చిన, నచ్చని ఆహారం ఏంటని అడిగి తెలుసుకోవాలి. వారి డ్రెస్సింగ్ స్లైల్ ఎలా వుంటుందో కనుక్కోవాలి. ఉమ్మడి కుటుంబంలో వుండడం ఇష్టమా లేదా అడిగి తెలుసుకోవాలి. ఆర్థికానికి సంబంధించిన విషయాలను కూడా కనుక్కోవాలి.
ఎవరినైనా ప్రేమించారా ? ఈ పెళ్లి వారికి ఇష్టమేనా ? పెళ్లిపైన ఎవరి ఒత్తిడి అయినా వుందా అడిగి తెలుసుకోవాలి. మీరు మీ భార్యను భవిష్యత్తులో ఉద్యోగం చేయించే ఇష్టం వుందా లేదా అనే దానిపై వారికి పూర్తిగా స్పష్టత వచ్చేలా చెప్పాలి.

మీకు కాబోయే భార్యకు శారీరక మానసిక ఇబ్బందులు ఏవైనా వున్నాయా అడిగి తెలుసుకోవాలి. ఇవి భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి కాంప్లికేషన్స్ కిందకి వస్తాయ్ కాబట్టి అడిగి తెలుసుకోవాలి. ఏవైనా మానసిక ఇబ్బందులు వుంటే కూడా ఉన్నది వున్నట్టుగా చెప్పాలి.
మీ భవిష్యత్తు గోల్స్ గురించి వారికి తెలియజేయాలి. భవిష్యత్తులో మీకు వున్న వృత్తి మానేసి ఏవైనా చేయాలనుకుంటే వాటి గురించి కూడా ముందే వారికి తెలియజేయాలి. మీకు అమ్మాయి గనుక నచ్చితే, అమ్మాయి నచ్చిందని క్లీయర్‌గా ఆ విషయాన్ని వారికి చెప్పాలి.
పెళ్లి జీవితానికి సంబంధించింది కాబట్టి పెళ్లి చూపుల్లో మీ మనసు మాటను వినాలి. మీకు చెప్పినట్లుగానే అమ్మాయి భవిష్యత్తులో కూడా అలాగే వుంటుందా అడిగి కనుక్కోవాలి. ఒక్కసారి పెళ్లైతే ఇక భరించాల్సిందే. ఒక్కసారి కమిట్ అయితే తరువాత ఎన్ని సమస్యలు వచ్చినా తప్పుకోవడానికి వీలు పడదు. మీరు అనుకున్నట్లుగా మీకు కాబోయే భార్య కూడా వుండకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఆచి తూచి అడుగువేయాలి. పెళ్లికి ముందు పెద్దలను మాత్రమే కాదు అనుభవఘ్నులైన వారిని, సైకాలజిస్టులను, నిపుణుల సలహాలను తీసుకోవడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications