Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రిలేషన్‌షిప్ అలర్ట్.. రిలేషన్‌షిప్‌లో ఈ లక్షణాలు చాలా డేంజర్..!
కొంత మందికి రిలేషన్‌షిప్‌లో ఉండడం నచ్చకపోయినప్పటికీ అలాగే కొనసాగుతూ వుంటారు. దీనికి చాలా కారణాలున్నాయ్. పార్ట్‌నర్‌ను వదిలివెళ్లడానికి కేవలం ఒక సరైన సమయం కోసం మత్రమే వారు ఎదురు చూస్తూ వుంటారు. అనుకున్న సమయం వచ్చిందంటే ఇక గుడ్‌బాయ్ చెప్పి వెళ్లిపోతారు. ఆ బ్రేకప్‌ను చాలా మంది పార్ట్‌నర్స్ తట్టుకోవడం చాలా కష్టం. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలిసి నడవాలని ప్రమాణం చేసిన తరువాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అటు ఇద్దరికీ కోలుకోలేని బాధను కలిగిస్తుంది. పార్ట్‌నర్ మనల్ని వదిలి వెళ్లుపోతున్నాడు లేదా వెళ్లిపోతోందని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలను మనం గుర్తించవచ్చు. ఆ సంకేతాలను మేము మీతో ఈ ఆర్టికల్ ద్వారా పంచుకోబోతున్నాం.
శృంగార రసం
నిజమైన ప్రేమికులు, అసలైన దంపతులు ఎన్నైళ్లైనా వారి మధ్య రొమాన్స్ ఎప్పుడూ నూతనంగానే వుంటుంది. దాన్ని ఎప్పుడూ వారు ఎంజాయ్ చేస్తూనే వుంటారు. తరచూ శృంగారంలో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపుతారు. పార్ట్‌నర్ గనక మీరో రొమాన్స్ కూ దూరంగా వుంటున్నట్లు ఏ మాత్రం సంకేతాలు వచ్చినా కూడా మీతో విడిపోవడానికి సిద్ధపడుతున్నట్లేనని అనుకోవచ్చు. శృంగారం చేయడానికి అసలే ఒప్పుకోకపోతే పార్ట్‌నర్ త్వరలో గుడ్‌బై చెప్పడానికి సిద్ధమైతున్నట్టేనని అనుకోవచ్చు.
ఫోన్‌లో స్పందన
ఫోన్ కాల్ చేసినా, టెక్స్ట్ మెసేజ్ చేసినా సమాధానం వెనువెంటనే ఇవ్వగలగాలి, ఎందుకంటే పార్ట్‌నర్ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి. భార్యైనా, భర్తైనా టెక్స్ట్ మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో తప్ప ఇలాంటి సమస్య రాకూడదు. కాల్స్‌లో, టెక్స్ట్ మెసేజిలలో ఎప్పుడూ చిరాకుగానే, కోపంగానే మాట్లాడుతున్నా విడిపోతున్న సంకేతంలా భావించవచ్చు. ఫోన్‌లో ప్రేమగా మాట్లాడుకొని చాలా నెలలు, సంవత్సరాలు గడిచిందన్న భావన గనక వస్తే ఇక పార్ట్‌నర్ త్వరలోనే వదిలి వెళ్తున్నట్టని అనుకోవచ్చు.

ప్రతీ దాంట్లో తప్పు పట్టడం
ఏ సంఘటన జరిగినా, ఏ పని చేసినా ప్రతీ విషయంలో పార్ట్‌నర్‌ను తప్పుబడతారు. చిన్న చిన్న విజయాల్లో కూడా మిమ్మల్ని ప్రోత్సహించకుండా తప్ప బడుతున్నారంటే మీతో విడిపోవడానికి మనస్పూర్తిగా నిశ్చయించుకుంటున్నారని అనుకోవచ్చు.
సింగల్ లైఫ్
పెళ్లి తరువాత కూడా పార్ట్‌నర్ తరచూ సింగిల్ లైఫ్ బాగుంటుందని తరచూ అనడం. రిలేషన్‌షిప్ వల్ల స్వేచ్ఛి వుండదు, ఒకరికి ఒకరిపై గౌరవం వుండదు అని వివాహ బంధం గురించి గనుక ఎక్కువగా మాట్లాడుతున్నట్లయితే వారి మాటలే మీతో అసంతృప్తిగా ఉండడానికి సంకేతాలుగా భావించవచ్చు.
ఫోన్ ప్రైవసీ
ఫోన్‌కి లాక్ పెట్టుకోవడం. ఫోన్‌లో బ్రజింగ్ హిస్టరీని తొలగించడం, కొన్ని అప్లికేషన్లకు పర్స్‌నల్ లాక్స్ పెట్టుకోవడం. మీకు ఫోన్ ఇవ్వకుండా వుండడం లాంటి చర్యలు మీతో బంధం కొనసాగించడానికి ఆసక్తి లేదని సూచిస్తోంది.
భవిష్యత్తు ప్లాన్స్ లేకపోవడం
జీవితాంతం కలిసి ఉండాలనేకునే పార్ట్‌నర్ ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేసుకుంటారు. ఆదాయం, ఖర్చులు, ఉద్యోగం, వీకెండ్ పార్టీలు, టూర్స్, బిజినెస్ మొదలుపెట్టడం లాంటి భవిష్యత్తు ప్లాన్స్ గనక ఏమీ లేకపోతే త్వరలోనే ఆ పార్ట్‌నర్ వీడి వెళ్లిపోతున్నట్టుగా అనుకోవచ్చు.
ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛను కోరుకోవడం
ఒక కమిట్‌మెంట్‌లో వున్న పార్ట్‌నర్స్ ఒకరు సంపాదించినా సరే ఇద్దరూ కలిసి ఖర్చులూ, బడ్జెట్ ప్లాన్స్ చేసుకుంటారు. సంపాదనలో, ఖర్చులో, డబ్బు విషయంలో నాదీ నీది అనే భావన గనక వచ్చిందంటే ఇక మీతో పార్ట్‌నర్ విడిపోవడానికి అన్ని రకాలుగా సిద్ధమైనట్టేనని నిర్ధారణకు రావచ్చు.



Click it and Unblock the Notifications