Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలిపే సంకేతాలు.. మిస్ కావద్దు..!
మీ పార్ట్‌నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి కేవలం వారు చెప్పే 'ఐ లవ్ యూ' మాత్రమే సరిపోదు. వారి వ్యక్తిత్వంలో కూడా అలాగే వుండాలి. వారు నిజంగా అలాగే ఉన్నారా లేక కేవలం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా తెలుసుకునేందుకు మీ కోసం కొన్ని ప్రత్యేక లక్షణాలను అందించాము. ఈ లక్షణాలు గనుక మీ పార్ట్‌నర్‌లో ఉంటే వారు మిమ్మల్ని నిజంగానే ప్రమిస్తున్నట్లుగా భావించవచ్చు.
రిలేషన్‌షిప్‌లో నమ్మకం, విశ్వాసం రెండు రకాలుగా ఉంటుందంటున్నారు. ఒకటి నైతికంగా వారి వ్యక్తిత్వంలో ఉండే లక్షణం విశ్వాసం చూపిస్తుంది. మరో వైపు వ్యక్తిని బట్టి విశ్వాసం, నమ్మకంగా ఉండవచ్చు. పార్ట్‌నర్ వ్యక్తిత్వంపైన కూడా తోటి పార్ట్‌నర్ నమ్మకం, విశ్వాసం ఆధారపడి ఉన్నాయని మానసిక నిఫుణులు చెబుతున్నారు.
కమ్యునికేషన్
హద్దులు దాటి మీతో కమ్యునికేట్ చేయరు. గొడవలు వచ్చేలా, పరిస్థితి తీవ్రంగా మారేలా వారు మీతో కమ్యునికేట్ చయరు. హద్దులను ఏర్పరుచుకొని వాటి లోపే మాట్లాడుతుంటారు, దానిలోపే నిర్ణయాలను తీసుకుంటారు. గొడవ వచ్చినప్పుడు ఇద్దరిలో అహం ప్రమాదకరంగా మారుతుంది. మీకు ఎంత కోపం వచ్చినప్పటికీ పార్ట్‌నర్ తన అహాన్ని తగ్గించుకొని మీ దగ్గరకు వస్తున్నారంటే వారు విశ్వాసపాత్రులనే అనుకోవచ్చు.

హద్దులు రకాలు
హద్దులు దాడటం కూడా రకరకాలుగా ఉంటాయ్. కొందరు డేటింగ్‌లో ఉంటూ హద్దులు ఏర్పరుచుకొని సెక్స్‌లో పాల్గొనకుండా వుంటారు. ఇంకకరు హద్దులుదాటి రిలేషన్‌షిప్‌ను మరింత ఉన్నతంగా తీసుకొని వెళ్లాలనే ఆలోచనతో సెక్స్‌లో పాల్గొంటారు.
వాగ్దానాలు నిలబెట్టుకోవడం
రిలేషన్‌షిప్‌లో వుంటూ వారు చేసిన వాగ్దానాలను వారు నిలబెట్టుకుంటారు. రిలేషన్‌షిప్ మొదట్లో వారు చేసిన ప్రమాణాలను రిలేషన్‌షిప్ కొనసాగుతున్నంత కాలం వారు ఇచ్చిన మాటను నిలబిట్టుకుంటారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా
.
రిలేషన్‌షిప్‌లో ఎన్ని అడ్డంకులు, ఎన్ని సమస్యలు వచ్చినా వారు మీతో ఎప్పుడూ ఉన్నట్లే సంతోషంగా ఉంటారు. మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించరు, వారి ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పును చూడరు. మిమ్మల్ని మోసం కూడా చేసే అవకాశం లేదు. ఇలాంటి వ్యక్తులు చాలా విశ్వాసంగా వుంటారు.
నిజాయితీ
నిజాయితీగా ఉండేవారు మీతో గొడవ వచ్చినప్పటికీ మీతో కలిసి ఉండడానికి సిద్ధపడతారు. ఎన్ని ఘర్షణలు వచ్చినా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు.
నమ్మకం
మీ పార్ట్‌నర్ మీతో నిజాయితీగా మాత్రమే కాదు, నమ్మకంగా ఉండాలనుకుంటారు. కేవలం మీ శరీరాన్ని మాత్రమే ఇష్టపడకుండా మీ మనసును ఇష్టపడతారు. శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా మీ మానసిక ఆనందానికి, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తారు.
తెరిచిన పుస్తకం
మీ పార్ట్‌నర్ జీవితం మీ ముందు తెరిచిన పుస్తకంలా వుంటుంది. మీ నుంచి ఎలాంటి విషయాలను వారు దాచరు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో కలిసి ఉన్నారు, ఏమి చేస్తున్నారనే అన్ని విషయాలను మీతో పంచుకుంటారు. ఈ విషయంలో మీతో ఘర్షణకు దిగరు.
మానసికంగా ఆరోగ్యం
మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మీకు వారు చాలా దోహదపడతారు. మీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటూ వుంటారు. మీ రిలేషన్‌షిప్ మిరంత అందంగా, బలంగా మారేందుకు వారు కృషి చేస్తారు.
పార్ట్‌నర్ విశ్వాసంగా ఉండడానికి ఇతర పార్ట్‌నర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు. కొన్ని సందర్భాల్లో పార్ట్‌నర్ విశ్వాసంగా వుండలేకపోవడానికి కారణం కూడా పార్ట్‌నరే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.



Click it and Unblock the Notifications