Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
ఈ సెక్స్ అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయి.. దూరంగా ఉండటం మంచిది
దాంపత్య బంధంలో సెక్స్ చాలా కీలకం. శృంగారం సక్రమంగా ఉంటే మిగతావన్నీ సరిగ్గా నడుస్తాయంటారు పెద్దలు. దంపతుల మధ్య ఉండే ప్రేమకు శృంగారాన్ని కొలబద్దగా చూస్తారు. శృంగారం అనే మధురమైన అనుభూతిని ఆస్వాదించాలే కానీ మాటల్లో చెప్పలేం. దంపతుల మధ్య సెక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పెళ్లైన కొత్తలో శృంగారం చాలా బాగుంటుంది.
రోజులు గడిచే కొద్దీ సెక్స్ పై ఆసక్తి పోతుంది.. అలాగే ఇతర పనులు వల్ల శృంగారం చేసుకునే సంఖ్య తగ్గుతుంది. దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. కొన్ని తెలియక చేసే పొరపాట్లు, అలవాట్ల వల్ల శృంగార జీవితం నాశనం అవుతుందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఆఫీసు పని చేయడం:
ఇంట్లో ఆఫీసు పని చేయడం అనేది సెక్స్ జీవితాన్ని నాశనం చేయడంలో మొదటిది. ఇది శృంగార జీవితాన్ని, దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని మాత్రమే కాదు.. బంధం బీటలు వారేలా చేస్తుంది. బెడ్ పై కూర్చొని ల్యాప్ టాప్ పై లో తలదూర్చి టిక్కు.. టిక్కు.. అనుకుంటూ కూర్చోవడాన్ని చూస్తేనే సగం మూడ్ పోతుంది. రొమాంటిక్ గా దగ్గరికి వచ్చిన భాగస్వామికి కాసేపు ఆగు, ఇదొక్కటి ఐదు నిమిషాల్లో పని అయిపోతుందని చెప్పడంతో ఉన్న మూడ్ అంతా పోతుంది. అందుకే దంపతులు తమ ఆఫీసు పనిని ఇంటికి తీసుకురాకూడదు. ఈ విషయాన్ని ముడి వేయండి.
పెంపుడు జంతువులు:
పెంపుడు జంతువులు అంటే వాటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే చూస్తాం. అలాగే వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. అయితే పెంపుడు జంతువులు మనుషుల్లో ఊరకే ఉండవు. నిరంతరం మంచం మీద దూకుతూ ఆడుకుంటూ ఉంటాయి. మీకో, మీ భాగస్వామికో మూడ్ వచ్చినప్పుడు బెడ్రూములోకి వస్తే.. మీ పెంపుడు జంతువు బెడ్ పై ఎగురుతూ అల్లరి చేస్తుంటే మూడ్ పోతుంది. మీరు సెక్స్ యొక్క పూర్తి మూడ్‌లో ఉన్నప్పుడు మీ పెట్ చేసే అల్లరితో మూడూ, ఉత్సాహం పోతుంది.
బెడ్‌పై బ్రేక్‌ఫాస్ట్ చేసిన ప్లేటు:
కొందరికి బెడ్ పై కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కేవలం శృంగార కోణంలోనే కాకుండా ఆరోగ్యం కోణంలోనే విడిచి పెట్టాలి. ఎందుకంటే మంచి మూడ్ లో బెడ్రూములోకి అడుగు పెట్టినప్పుడు.. మల్లె పూలు ఉండాల్సిన బెడ్ పై తినేసిన ప్లేట్లు, అంట్లు ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. మూడ్ పోకుండా ఎలా ఉంటుంది. మంచం శుభ్రంగా, నీట్ గా ఉండాలి. వీలైతే రొమాంటిక్ గా ఉండేలా అలంకరించుకోవాలి.
అదే పనిగా ఫోన్ చూస్తుంటే:
ఫోన్లు.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయాయి. ఉదయం లేవగానే ఫోన్ చూస్తూనే లేస్తున్నారు. రోజంతా ఎవరు లేకపోయినా, ఏది లేకపోయినా ఓకే కానీ.. ఫోన్ లేకపోతే శ్వాస కూడా ఆడటం లేదు చాలా మందికి. రాత్రంతా ఫోన్ చూస్తూ చూస్తూ ఎప్పటికో గానీ నిద్రలోకి జారుకోవడం లేదు. రొమాంటిక్ గా ఉండాల్సిన బెడ్ రూములో కూడా ఫోన్ పట్టుకుని కూర్చుంటే మూడ్ ఎక్కడి నుండి వస్తుంది.
సన్నిహితంగా లేకపోవడం:
సాన్నిహిత్యానికి ఇవ్వాల్సిన సమయంలో, మీరిద్దరూ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెచ్చిస్తుంటే మూడ్ పోతుంది. సెక్స్ ప్లాన్ చేసుకునే ముందు గొడవను పరిష్కరించుకోండి.
మద్యం తాగడం:
సెక్స్ అంటే మత్తు.. దానికి మించిన మత్తు మరొకటి లేదు. ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదించాల్సిన సమయంలో శారీరకంగా, మానసికంగా పూర్తిగా శృంగారంపై లఘ్నం చేయాలి. కానీ మద్యం సేవించి ఆ మత్తులో సెక్స్ చేస్తే.. అందులోని మజా ఎలా తెలుస్తుంది. అలాగే ఆ మందు వాసన మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు కూడా. దీని వల్ల మూడ్ కూడా పోతుంది.



Click it and Unblock the Notifications