Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సంసారం నాశనం కావడానికి ఇవే కారణాలు, ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకే మంచిది
పెళ్లి చేసుకుంటే సరసాలు, కోపాలు, తాపాలు సర్వసాదారం. పోట్లాడకపోతే ఆ దంపతులు అబద్ధాలు చెబుతున్నారని అర్థం, లేదంటే ఆ దంపతుల బంధం బలంగా లేదని అర్థం, కుటుంబంలో గొడవలు జరగడం మామూలే, కానీ దాన్ని మరచిపోయి, తప్పును సరిదిద్దుకుని ముందుకు సాగాలి దంపతుల మధ్య ఎక్కువ గొడవలు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటంటే ?

1. దాంపత్య జీవితం ఎలా ఉండాలంటే ?
భార్యాభర్తల మధ్య శారీరక తృప్తి ఉండాలి. అయితే పనిలో బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి తదితర కారణాల వల్ల ఇద్దరి మధ్య శారీరక సంబంధం తక్కువగా ఉంటే దాంపత్యంలో సమస్య పెరుగుతుంది. కాబట్టి శారీరక సంబంధం సక్రమంగా లేకపోయినా నిద్రపోయే ముందు రొమాంటిక్ హగ్ ఇవ్వడం, లేదంటే భార్యకు రొమాంటిక్ గా కిస్ ఇస్తే కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా దంపతులు దూరమైనా ఇద్దరూ కలిసి గడిపేందుకు ప్రయత్నించాలి.
2. జీవిత భాగస్వామితో ఇలా ఉండాలి
దంపతులు ఎక్కువగా చేసే తప్పుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం అని గుర్తించాలి. భర్త అయినా, భార్య అయినా మొదట జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నీకు ఏం కావాలో అది స్పష్టంగా కుంటిసాకులు చెప్పకుండా నీ జీవిత భాగస్వామికి చెప్పాలి. ఇలా చేస్తే నీకు ఏం కావాలో అర్థం చేసుకోవడానికి నీ జీవిత భాగస్వామికి అవకాశం ఉంటుంది. ఇలా చెయ్యకుండా నీ మనుసులో ఏముందో ఎదుటి వ్యక్తి తెలుసుకోవడం కఫ్టం, ఇలా దంపతుల మద్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది.
3. పాతపాడటం ఆపేయాలి
దంపతుల మద్య గొడవలు వచ్చిన వెంటనే భర్త కాని, లేదా భార్య కాని పాత పాడటం మొదలు పెట్టడం ఎక్కవగా జరుగుతుంటాయి. ఇంతకు ముందు నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని గతంలో జరిగిపోయి చెత్త రామాయణం మొదలుపెడతారు, ఎక్కువగా భార్యలు ఇలా పాతపాడటం మనం చాలా సందర్బాల్లో చూస్తుంటాము, పాత విషయాలు ఎక్కువ గెలకపోతే దంపతుల మధ్య గొడవలు టక్కున సర్దుమనుగుతాయని పెద్దలు అంటుంటారు. పదే పదే పాత విషయాలు గుర్తు చెయ్యడంతో చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పుడు పాత విషయాలు గుర్తు చెయ్యడం వలన అవి పెద్ద సమస్యలుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
4. నాదే పైచేయి కావాలనుకుంటే
ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నేను గెలవాలని భార్య కాని, భర్త కాని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది, గొడవలో నాదే పైచేయి కావాలని అనుకున్నా, జీవిత భాగస్వామి మీద పైచేయి సాధించి వాళ్ల నోరు మూయించాలని చూసినా గొడవ ఇంకా పెద్దది అయ్యే అవకాశం ఉంటుంది. భార్య కాని, భర్త కాని ఎక్కువా వాగుతున్న సమయంలో ఒకరు కొంత సేపు సైలెంట్ అయిపోతే గొడవకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు తగ్గకపోతే గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
5. ఇలా చేస్తే సంసారం నాశనం అవుతుంది
కొన్ని విషయాలు దాచిపెట్టాలని దంపతులు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. భర్త కాని, భార్య కాని కొన్ని విషయాలు దాచిపెట్టాలని చూస్తే లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతాయి. కొన్ని విషయాలు జీవిత భాగస్వామికి తెలీకుండా చూడాలని దంపతుల్లో ఎవరో ఒకరు ప్రయత్నిస్తుంటారు. ఇలా చేస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటే ముందుముందు ఎలాంటి సమస్యలు ఉండవు.
6. ఇద్దరూ మోనార్క్ అనుకుంటారు
ఇంట్లో తీసుకునే నిర్ణయాలు తానే తీసుకోవాలని దంపతులు మొండిపట్టుపడుతుంటారు. ఇంట్లో నా మాలే చెల్లుబాటు కావాలని, ఎదుటి వ్యక్తి నామాటే వినాలని మొండిగా వ్యవహరిస్తారు. భార్య కాని, భర్త కాని తన మాటే పైమాట కావాలని మొండిగా వ్యవహరించకపోతే వారి సంసారం సాఫీగా సాగిపోతుంది.
7. ఫ్యామిలీలో ఇదే మెయిన్
దంపతుల గొడవలకు ముఖ్యంగా ఆర్థిక విషయాలు కారణం అవుతాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు చేసే విషయంలో, డబ్బు ఆదాచేసే విషయంలో తేడాలు రావడంతో దంపతుల మధ్య గొడవలకు కారణం అవుతుంటాయి. ఇలాంటి విషయాల్లో దంపతులు పరస్పరం చర్చించుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications