Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
భర్తంటే భార్యకు ఇష్టం లేదనడానికి తెలిపే సంకేతాలు ఇవే..!
భార్య అమితమైన ప్రేమను పొందే భర్తలు అదృష్టవంతులు. డొమెస్టిక వాయిలెన్స్ లేదా గృహ హింస వుండేది కేవలం భార్యలకు మాత్రమే కాదు భర్తలకు కూడా వుంటుంది. అందుకే భార్యా భాదిత సంఘాలు వచ్చాయ్. మొదట్లో వుండే అట్రాక్షన్ తరువాత వుండదు. ఎంత ప్రేమను చూపిస్తున్నప్పటికీ భార్య భర్త పట్ల అనాసక్తిగానే వుంటుంది. ఈ విషయాన్ని భార్యలు భర్తలకు చెప్పరు. కానీ కొన్ని లక్షణాలు ద్వారా భర్తలు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.
1. మీతో సమయం గడపడానికి అస్సలు ఇష్టముండదు. ప్రారంభంలో ప్రతీ సెకనూ మీతో గడపడానికి ప్రయత్నించేది కాని ప్రస్తుతం ఆ పరిస్థితి వుండదు. మీరు ఎదురుగా వున్నా మీ భార్య ఫోన్‌లో బిజీగా గనక వుంటే ఇక మీరంటే ఇష్టం లేదని సంకేతంగా భావించవచ్చు.
2. మీరు ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా మీ భార్య నవ్వదు. మీరు ఎంత మంచి పెద్ద జోక్ చెప్పినా దాన్ని సాధారణ విషయంగానే తీసుకుంటుంది. నవ్వడం వల్ల ఇద్దరిలో ఒక బంధం ఏర్పడ్డానికి ఆస్కారం వుంటుంది. దానికి మీ భార్య అవకాశం ఇవ్వదు.
3. లైంగిక కోరికలు తీర్చుకోవడానికి మీరు దగ్గరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని దూరం జరిపివేస్తుంది. మిమ్మల్ని కనీసం తాకడానికి, ముద్ద పెట్టడానికి కూడా ఇష్టముండదు. ఇది రిలేషన్‌షిప్‌లో చాలా ప్రమాదకరమైన దశగా భావించవచ్చు.

4. మీతో శృంగారంలో పాల్గొనడానికి అస్సలు ఆసక్తిని చూపించదు. ఎందుకని మీరు ప్రశ్నించినా దానికి సరైన సాధానం భార్య ఇవ్వదు. వివాహబంధంలో ఇది సాధారణంగా చాలా సార్లు జరిగే ప్రక్రియ అయినా సరే చేయడానికి భార్య అంగీకరించడం లేదంటే మీరంటే ఇక ఇష్టం లేనట్టే.
5. మిమ్మల్ని ఎవరితోనైనా చూస్తే మీ భార్యకు పొససివ్‌నెస్ కలగాలి. ఇప్పుడు ఆ పొససివ్‌నెస్ లేపిస్తుంది. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా భావించవచ్చు.
6. ఆఫీసు, ఇతర పనులకు ఎక్కువ సమయం కేటాయించి ఇంటికి తక్కువ సమయాన్ని మీ భార్య కేటాయిస్తుంది. మీ భార్య మాటలు మిమ్మల్ని చాలా బాధిస్తాయ్.
7. మీతో మాట్లాడటానికి కూడా మీ భార్య ఇష్టపడదు. ఎలా వున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావ్, లాంటి చిన్న ప్రశ్నలను కూడా మిమ్మల్ని అడగకపోతే ఇక మీ భార్య మీమ్మల్ని వదిలివెళ్లడానికి సిద్ధపడుతున్నట్లుగా అనుకోవచ్చు.
8. మీ భార్య మిమ్మల్ని ఎక్కువగా తప్పబడుతూ వుంటుంది. మీరు ఏ పని చేసినా దాంట్లో తప్పులు వెతకడం ప్రారంభిస్తుంది. మిమ్మల్ని తక్కువ చేసే విధంగా మాట్లాడుతుంది. మీ మొహం ముందే మిమ్మల్ని అవమానిస్తుంది.
9. తనకు ఇష్టమైన వ్యక్తి గురించి మీముండే మాట్లాడుతుంది. అది కాలేజ్ క్రష్ కావచ్చు, టీవీ యాక్టర్ లేదంటే కళ్లు ముందు ఎవరైనా తనకు ఇష్టమని అనిపిస్తే అప్పుడే మీకు చెప్పేస్తుంది.
10. భార్యతో మీరు కలిసి వుంటున్నా మీరు మీ భార్యతో భర్తగా కన్నా రూంమేటుగా అనుభూతి చెందుతారు. కలిసి వుంటున్నా ఇద్దరూ ఎప్పుడూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవడం జరగదు. పెళ్లైన మొదట్లో ఇద్దరు కలిసి ప్రేమగా చేసుకునే పనులను ఇప్పుడు చేసుకోకపోవడం రిలేషన్‌షిప్‌లో చాలా ప్రమాదకరం.
ఇన్ని సమస్యలు చూసిన తరువాత భర్త భార్యను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆమె సమయాన్ని కేటాయించాలి. ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లాలి. ఆమె కోరికలను ఇష్టాలను కనుక్కోవాలి.



Click it and Unblock the Notifications