Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ చెప్పరు.. సంకేతాలు ఇవే..!
మీకు సంబంధించిన చిన్న విషయాలను కూడా వారు గుర్తుపెట్టుకుంటారు. మన మెదడు మనకు అవసరమైన విషయాలను, మనకు ఇష్టమైన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. వారికి మీరు ఇష్టమైతే అప్పుడు మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఆ ప్రదేశంలోకి ఎప్పుడు వెళ్లారు, మీరు మాట్లాడే మాటలు, మీకు ఇష్టమైన డిష్. ఇలాంటివన్నింటినీ వారు గుర్తుపెట్టుకుంటారు.
1. వారు మిమ్మల్ని ఇష్టపడితే మిమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వుంటారు. తెలియకుండానే మీకు వారి నుంచి కాంప్లిమెంట్స్ అందుతుంటాయ్. మీ స్మైల్ బాగుంటుంది, మీరు చాలా తెలివైన వారు, మీరు ఎంచుకునే వస్తువులు బాగుంటాయ్, మీరు చాలా డిఫరెంట్, మీరు చాలా అందంగా వుంటారు, మీరు ఏదనుకుంటే అది సాధిస్తారు, ఇలా ఎన్నో మీకు సంబంధించిన ఎన్నో విషయాలపై కాంప్లిమెంట్స్‌ను అందిస్తారు. మీ జోక్ అంత బాగా లేకపోయినా నవ్వుతారు.
2. మీరు ఎదురైనప్పుడు వారు ఆందోళనకు గురౌవుతారు. వారి గుండెకూడా వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. కొన్ని సార్లు మాటల్లో తడబాటు వస్తుంది. కొందరిలో చెమటలు కూడా పడతాయ్. ఇలా కేవలం ఎమోషనల్‌గా దగ్గరయితేనే జరుగుతుందని శాస్త్రీయంగా పరిశోధనలో నిరూపితమైంది. మీతో ఎవరైనా తడబడి మాట్లాడుతూ వుంటే వారు మీపట్ట ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకున్నారని అర్థం చేసుకోవాలి.

3. మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఏదైనా ఒక టాపిక్‌ను ముందుకు తీసుకొని వచ్చి మీతో మాట్లాడి సమయం గడపాలని చూస్తారు. మీరు వారితో మాట్లాడడం ఆపేస్తే వారు చాలా బాధపడతారు. మీతో రెండు గంటలైనా సరే మాట్లాడుతూనే వుంటారు. ఇలా చేయడం మీ పట్ల వారికి ఆసక్తి వుందని అర్థం చేసుకోవచ్చు.
4. ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడితే వారు మిమ్మల్ని ముట్టుకోవడానికి ఇష్టపడతారు. మీతో సరదాగా మాట్లాడేటప్పుడు వారు మిమ్మల్ని ముట్టుకోవడానికి ప్రయత్నించినా మీకు వారు శారీరకంగా దగ్గరకావడానికి ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
5. మీతో మాట్లాడుతూ మీ కళ్లల్లోకి చూసి నవ్వినా వారు మిమ్మల్ని మనస్పూర్తిగా ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒకరిని చూసి సాధారణంగా నవ్వడం వేరు, కానీ మిమల్ని చూసినప్పుడు వారి పెదవులు చాల వైడ్ అయిపోయి కళ్లతో గనక నవ్వుతూ వుంటే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
6. మీకు ఏ వంటకం ఇష్టం, మీ లక్ష్యాలు ఏంట, మీకు ఏ ప్రదేశాలు అంటే ఇష్టం, ఇలా మీకు సంబంధించిన ఇష్టాల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగి గనుక ఆరా తీస్తుంటే వారికి మీరంటే ఆసక్తి వుందని అర్థం చేసుకోవాలి. మీకు ఇష్టమైన వాటిని ఏదైనా ఒకరోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తారు. ఇలా చేసిన రోజు ఇక మీరంటే ఇష్టమని వీరు నిర్ధారణకు వచ్చేయవచ్చు.
7. మీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలను గనుక మీతో మాట్లాడుతూ వుంటే అప్పుడు మీతో వారు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్నారని మీరనుకోవాలి. మీతో కలిసి భవిష్యత్తులో ఆర్థికంగా కష్టసుఖాలను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు.
8. మీ ఫ్యూచర్ ప్లాన్ల గురించి వారు అడిగి తెలుసుకుంటూ వున్నపపుడు. మీరు భవిష్యత్తులో ఏమీ చేయాలనుకుంటున్నారనే ప్రశ్నలను గనుగ వారు తరచూ వేస్తూ వుంటే మిమ్మల్ని త్వరలో పెళ్లి చేసుకోవడానికి వారు సన్నద్ధమవుతున్నట్లుగా భావించాలి.



Click it and Unblock the Notifications