Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య భర్తలకు ఈ విషయాల వల్లే గొడవలు ఎక్కువగా వస్తాయట!
భార్య, భర్తల బంధానికి మాత్రమే కాదు, ఏ బంధానికైనా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే గొడవలు వస్తుంటాయి. అయితే వివాహబంధంలో ఈ గొడవలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. ఆ గొడవలు కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రతరమై విడాకుల వరకు దారి తీస్తాయి. అందుకే భార్య, భర్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. ఏ ఏ సందర్భాల్లో గొడవలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముఖ్యమైన విషయాలను పట్టించుకోకపోవడం
వివాహ బంధంలో కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోకపోవడం అనేది ఎదుటి వ్యక్తిని చాలా నిరాశకు గురి చేస్తుంది. దీంతో వారు చాలా బాధ పడతారు. తమ మనసుకు తీసుకుంటారు. అందుకే మీ భార్య లేదా భర్త ఏదైనా ముఖ్యం విషయం గురించి చెప్పినప్పుడు దాని గురించి పట్టించుకోవడం మాత్రం మర్చిపోకూడదు. వాటిని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ఎక్కువగా ఊహించుకోవడం
వివాహ బంధంలో ఊహలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఏమీ అనకపోయినా మనం ఎదో ఒకటి ఊహించేసుకుంటాం. చిన్న చిన్న విషయాలను సైతం పెద్దగా ఊహించుకోవడం వల్ల గొడవలు మొదలవుతాయి. ఈ ఊహ సందర్భంగా ఆ గొడవలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏది పడితే అది ఊహించేసుకోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నిజమైతేనే దానిని నమ్మాలి. ఊహ ప్రపంచంలో మెదులుతూ గొడవలను తెచ్చుకోవద్దు.
హద్దులు దాటకూడదు
ప్రతి ఒక్కరికీ హద్దులు ఉంటాయి. ఏ బంధంలోనైనా ఎవరి హద్దులను వారు గౌరవించుకోవాలి. అనుమతి లేకుండా వారి విషయాల్లోకి ఎంటర్ అవ్వకూడదు. అలాగే హద్దులు దాటి వారిని విమర్శించడం, వారిపై కోప్పడడం వంటివి చేయకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారితో మాట్లాడాలి. అంతేకాని వారిని విమర్శించడం వారిపై ఎక్కువగా రియాక్ట్ అవడం వంటివి చేయకూడదు.
సైలెంట్‌గా ఉండడం
ఏదైనా విషయంలో భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు దానిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని సైలెంట్‌గా ఉంటే వారికి ఏమీ అర్ధం కాదు. పైగా ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి ఏవేవో ఊహించుకునే ప్రమాదం ఉంది. అందుకే సమస్యను వివరించి దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. సంబంధంలో ముందుకు వెళ్ళాలి.
ఇతరులను పొగడడం
భార్య భర్తలు తరచుగా తమ గురించి కాకుండా ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతరులను పొగుడుతూ వారికి ఇది ఉంది, వారికి అది ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తిని పొగుడుతూ తమకు తాము తక్కువ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా గొడవలు వస్తాయి. తమను తక్కువ చేసి ఇతరులను పొగడడం ఎవరికీ నచ్చదు. అందుకే ఇలాంటివి చేస్తున్నట్లైతే ఇప్పుడే మానేయండి.



Click it and Unblock the Notifications