Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్యాభర్తలు చేసే ఈ తప్పులు విడాకులకు దారి తీస్తాయి, జాగ్రత్తగా ఉండండి
భార్యాభర్తల అన్నాక గొడవలు జరుగుతుంటాయి. దంపతుల మధ్య కలహాలు చాలా సాధారణం. అయితే వాటి నుంచి ఎంత త్వరగా బయటపడ్డాం, వాటిని ఎలా పరిష్కరించుకున్నామనే అంశాలపై ఆ దాంపత్య బంధం ఆధారపడి ఉంటుంది. అలాగే బంధంలో రాజీ పడటం కూడా చాలా కీలకం. ఎప్పుడో ఓ సందర్భంలో రాజీ పడితేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది.
దంపతులు చేసే కొన్ని తప్పుల వల్ల ఆ బంధానికి బీటలు వారతాయి. చిన్న చిన్న కలహాలు కూడా ఒక్కోసారి పెద్దగా మారతాయి. దంపతులు చేసే కొన్ని తప్పులు విడాకులకు కూడా దారితీయవచ్చు. ఆ తప్పులేమిటో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కమ్యూనికేషన్ లేకపోవడం:
దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా చాలా కీలకం. మీ భావాలను, అభిప్రాయాలను, ఆలోచనలను, కోరికలను, అవసరాలను భాగస్వామితో తప్పకుండా పంచుకోవాలి. అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే నూటికి 95 సమస్యలు పరిష్కారమవుతాయి.
దంపతుల మధ్య ఏదైనా కలహం వచ్చినా, గొడవ జరిగినా కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ సమస్య పరిష్కారం మార్గం ఏంటో వెతకాలి. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి.
2. ఒకరినొకరు అపార్థం చేసుకోవడం:
భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోకుంటే, వారి మనసులో ఏముందో కనిపెట్టే ప్రయత్నం చేయకపోతే, వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోలేకపోతే సమస్యలు మొదలవుతాయి. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో తెలియకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేము. దీని వల్ల సంబంధం క్షీణిస్తుంది. విడాకులకు దారి తీస్తుంది.
3. ఆర్థిక సమస్యలు:
ఎవరికి మాత్రం కోరికలు ఉండవు.. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. మనిషి కోరికలు అంతే ఉండదు. ఒక దాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. చాలా ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. చాలీచాలని ఆదాయం వల్ల చాలా కోరికలు నెరవేరకుండా పోతాయి. దీని వల్ల అసహనం వస్తుంది. అది కలహాలకు, గొడవలకు దారి తీస్తాయి. అవి విడాకులు తీసుకునే వరకూ వెళ్తుంది.
4. సమయం ఇవ్వకపోవడం:
భర్త ఉద్యోగం, వ్యాపారంతో బిజీగా ఉన్నా, భార్య ఇంటి పనులతో రోజంతా గడిపేస్తున్నా.. పిల్లల బాధ్యతలు నెరవేరుస్తుంటే ఒకరికొకరు సమయం ఇచ్చుకోలేరు. దీని వల్లచ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. సాన్నిహిత్యం లేని దాంపత్యం ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు.
5. తరచూ వాదులాటలు:
భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అయితే ప్రతీసారి గొడవను పెద్దగా చేస్తే అది పరిష్కారం కాకపోగా మరింతగా పెద్దదవుతుంది. తరచూ వాదనకు దిగితే ఎదుటివారు తీవ్రంగా విసిగిపోతారు. భాగస్వామి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా చేసే వాదనల వల్ల సాన్నిహిత్యం దెబ్బతింటుంది.
6. అసభ్యంగా ప్రవర్తించడం:
కొంత మంది భర్తలు భార్యలకు ఏమాత్రం విలువ ఇవ్వరు. బయటకు వెళ్లినప్పుడు మరింతగా రెచ్చిపోతుంటారు. ఏమాత్రం విలువ ఇవ్వకుండా, చేసిన ప్రతి పనిలో తప్పులు వెతికి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతుంటారు. తరచూ గర్వం ప్రదర్శిస్తూ ఎదుటివారిని చులకన చేసి చూస్తుంటారు. ఇది సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications