Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
వయసు మీద పడుతోందా.. ఈ డ్రింక్స్ తాగారంటే పడక గదిలో గుర్రాలైపోతారు!
వయస్సు మీద పడుతున్న కొద్దీ సత్తువ కోల్పోతారు. ఆకలి కూడా తగ్గుతుంది. ఈ ఆకలి కేవలం ఆహారానికే పరిమితం కాకుండా శృంగారానికి కూడా వర్తిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ శృంగార కాంక్ష తగ్గుతూ వస్తుంది. శారీరక చురుకుదనంతో పాటు మీ భాగస్వామి పట్ల కోరికలు కూడా తగ్గిపోతుంటాయి.
భాగస్వామితో గతంలో కలిసినట్లుగా శారీరకంగా కలవలేరు. ఉత్సాహంతో పాటు కోరిక కూడా చాలా వరకు తగ్గుతుంది. కానీ మీ కోరికలను పెంచడంతో పాటు నిత్యం యవ్వనంగా ఉంచేలా చేసే కొన్ని పరిష్కరాలు కూడా ఉన్నాయి. మీరు వీటిని ఫాలో అయితే శృంగార కాంక్షను పెంచుకోవడంతో పాటు పడక గదిలో స్టామినాను పెంచుకోవచ్చు. మరింత చురుగ్గా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.

వయస్సు పెరుగుతున్న కొద్దీ యోని పొడిబారడం, కీళ్ల నొప్పులు, సెక్స్ పట్ల కోరికలు తగ్గడం వంటి లైంగిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ సెక్స్ డ్రైవ్ ను తిరిగి పొందొచ్చు. గతంలో ఎంత ఉత్సాహంగా సెక్స్ లో పాల్గొన్నారో అలాగే ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ డ్రైవ్ మరియు సెక్స్ స్టామినాను పెంచుకోవడానికి డైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు మీ లైంగిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడానికి.. కోరికలను ఎప్పుడూ అలాగే ఉంచుకోవడానికి లిబిడో-బూస్టింగ్ డ్రింక్స్ ను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ:
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుత పానీయం మాత్రమే కాదు. మీ లైంగిక కోరికను పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచ్చిన్ అనే రిచ్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటి వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి దోహదపడుతుంది.
2. బ్లాక్ కాఫీ:
కాఫీ.. ఇది ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనాన్ని కల్గిస్తుంది. అలాగే మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. కెఫిన్ తో నిండిన కాఫీ స్త్రీలు, పురుషుల్లో సెక్స్ డ్రైవ్ కు చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. హ్యూస్టన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్... 2015లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ప్రతీ రోజూ కాఫీ తాగే పురుషుల్లో అంగస్తంభన సమస్య తక్కువగా ఉంటుందని గుర్తించింది.
3. రెడ్ వైన్:
వైన్.. తాగడం వల్ల సెక్స్ కోరికలు తగ్గుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ రెడ్ వైన్ తాగడం వల్ల లైంగిక శక్తి విపరీతంగా పెరుగుతుందట. ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం వైన్.. స్త్రీలు, పురుషుల్లో లైగింక ప్రేరణను పెంచుతుందని పేర్కొంది. రెండు గ్లాసుల రైడ్ వైన్ తాగడం వల్ల మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుందట. రెడ్ వైన్ టెస్టోస్టిరాన్ ను పెంచుతుంది. అలా అని అతిగా తాగితే కూడా ప్రమాదమే.
4. బనానా షేక్:
ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన అరటి షేక్ ను అందరూ ఇష్టపడుతుంటారు. ఇది మీ కలయిక సమయంలో బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సెక్స్ డ్రైవ్ ను పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
అరటి పండులో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల్లో లిబిడో మరియు టెస్టో స్టిరాన్ ను పెంచుతుంది. తక్కువ లిబిడో ఉన్న వారు రోజువారి ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల అధ్భుతమైన ఫలితాలు ఉంటాయి.
5. దానిమ్మ రసం:
స్త్రీ, పురుషుల్లో లైంగిక హార్మోన్లను పెంచడంలో దానిమ్మ రసం చాలా ఉపయోగపడుతుంది. యూఎస్ లోని బెవర్లీ హిల్స్ క్లినిక్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్మల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసర్చ్ లో.. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుందని గమనించారు. అందుకే దానిమ్మ రసం తాగమని సూచిస్తున్నారు.
పైన చెప్పిన ఐదు పానీయాలను తాగడం వల్ల లైంగిక శక్తితో పాటు కోరికలూ పెరుగుతాయి. అలాగే సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం.. ఈ పానీయాలను మీ ఆహారంలో చేర్చేసుకొని హాయిగా గడపండి.



Click it and Unblock the Notifications