Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
ఈ 5 రాశుల వాళ్లు తమ భాగస్వామిని పడగ్గదిలో చాలా సుఖపెడతారు.. అందులో మీరున్నారేమో చూస్కోండి!
శృంగారం జీవితం బాగుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా.. రాత్రి పడక సుఖం పొందారంటే వాటన్నిటినీ ఇట్టే మర్చిపోతారు. చాలా మంది తమ భాగస్వామి ఈ విషయంలో చాలా ఆసక్తితో ఉండాలని, బాగా సుఖపెట్టాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. తమకొచ్చే భర్త అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా సుఖపెట్టాలంటూ కలలు కంటుంటారు. అలాగే అబ్బాయిలు కూడా తమకు భార్యలుగా వచ్చే అమ్మాయిలు తమకు నచ్చినట్లుగా చేస్తూ ఫుల్లు సుఖాన్ని ఇవ్వాలనుకుంటారు.
అలాంటి వాళ్లు ఈ ఐదు రాశుల వాళ్లను పెళ్లి చేసుకుంటే చాలు.. అదేంటీ అనుకుంటున్నారా.. అదేం లేదండి. ఈ ఐదు రాశుల వాళ్లు తమ భాగస్వామిని సుఖ పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. పడక సుఖాన్ని ఇవ్వడంలో వాళ్లను మించిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఐదు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. వృశ్చికం:
వృశ్చిక రాశి వారు తరచుగా తీవ్రమైన కోరికలు ఉన్న రాశి వారుగా కనిపిస్తారు. వారికి నచ్చిన వాటిని ఎంచుకోవడం, వాటి గురించి లోతుగా అవగాహన కల్గి ఉండడం వంటి లక్షలణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. సహజంగానే ఇతరులను ఆకర్షించడం, వారు ఇష్టపడిన వారిని సుఖపెట్టడం వీరికి బాగా అలవాటు. ముఖ్యంగా భాగస్వామి మనస్సును అర్థం చేసుకొని మెదలడం, ప్రేమ కురిపించడం, పడక సుఖాన్ని ఇవ్వడంలో వీరెప్పుడూ ముందే ఉంటారు.
2.వృషభం:
వృషభ రాశి వాళ్లు సహజంగానే అందంగా ఉంటారు. ఇతరులను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుటారు. ముఖ్యంగా వీరి ఫొటోలు, ఆకారనికి ఎప్పుడూ ప్రశంసలు వస్తూనే ఉంటాయి. వీరు తమ అందం గురించి పూర్తి అవగాహన కల్గి ఉంటారు. వీరిని నచ్చిన వారిని ఎంచుకోవడం కోసం చాలా ఓపిక వహిస్తారు. అలాగే వీరు కుటుంబ సభ్యులను, దంపతులను ఎప్పుడూ హ్యాపీగా చూసుకుంటారు. వారికి ఎలాంటి కష్టం, అసౌకర్యం రాకుండా చూసుకుంటారు. ఇలా తమ భాగస్వామిపై ప్రేమను కురిపిస్తూ.. సంతోషంగా చూసుకుంటూ సుఖపెడతారు.
3. తులారాశి:
తులారాశి వాళ్లు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. వీరే కాకుండా వీరి పక్కన ఉన్న వాళ్లని కూడా ఎప్పుడూ నవ్విస్తారు. ఎలాంటి కష్టాన్ని అయినా సరే మర్చిపోయేలా చేస్తారు. వీరికి వీరి జీవితం గురించి లోతైన అవగాహన ఉంటుంది. వీరు కొత్త కొత్త విషయాలు, ఆలోచనలను ప్రయత్నించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. ప్రతీ క్షణాన్ని ఒక అద్భుతమైన మెమోరీగా మార్చుకోవడంలో వీరిని మించిన వారు ఉండరు. అలాగే భాగస్వామితో కలిసుండే ప్రతీ క్షణాలను జీవితాంతం గుర్తుండేలా చేసుకుంటారు.
4. సింహరాశి:
సింహరాశి వారు ఎక్కువ శక్తిని కల్గి ఉంటారు. పడక గది విషయంలో ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తారు. వారి సహజమైన ఆవశ్యకత వారి ఉత్సాహమే భాగస్వామిని విపరీతంగా ఆకర్షిస్తుంది. కేవలం ఈ విషయంలోనే కాదండోయ్ కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవడంలో కూడా వీళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు.
5. మిథున రాశి:
మిథున రాశి వాల్లు లైంగిక జీవితంలో ఆసక్తి కల్గి ఉంటారు. అలాగే భాగస్వామి ఆలోచనలను అర్థం చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. వీరు పడక గది విషయంలో ఆసక్తి చూపించినప్పటికీ.. వీరి కోరికలను మాత్రం బహిర్గతం చేయరు. నేరుగా పని చేసుకుంటూ వెళ్లిపోతారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా వారికి అనుగుణంగా మార్చుకుంటూ జీవితంలో సంతోషంగా ముందుకెళ్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications