Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మగవారు ఈ తప్పులు చేయడం వల్లే భార్యతో గొడవలు అవుతాయట.. విడాకులు కూడా.. అవి ఏంటంటే!
మన భారతదేశ సాంప్రదాయంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వయస్సు వచ్చాక.. ఒక మనిషికి కుటుంబ బాధ్యత అప్పగించడమే ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఒకరికి ఒకరు తోడు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బంధాన్ని సృష్టించారు. అందుకు తగ్గట్టుగానే చాలామంది తమ బంధానికి విలువ ఇస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు తీసుకుంటున్నారు. ఎంత తొందరగా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారో అంతే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. ఇందులో ఆడవారు చేసే పనులకంటే, మగవారు చేసే పనుల వల్లే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే మగవారు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వారు ఎలాంటి లక్షణాలను సరిదిద్దుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యను చులకన చేసి చూడడం..
తల్లిదండ్రులను వదిలేసి మనతో వచ్చేసిన భార్యను ఎంతో గౌరవంతో, బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందమంది మాత్రం దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భాగస్వామిని అస్సలు పట్టించుకోరు. వారి మాటలకు విలువ ఇవ్వరు. అలాగే సొంత నిర్ణయాలు తీసుకొని, వారిని బాధపెడుతూ ఉంటారు. భాగస్వామిపై శ్రద్ధ తీసుకోకుండా వారికి ఇష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటారు.
ఇలాంటి సమస్యలు మొదట్లో చిన్నవిగా, పట్టించుకోదగినవి కాదు కదా అనిపిస్తాయి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు మారుతున్న తరుణంలో అవే చాలా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. అండ్ వాటి వల్లనే విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది.
మాట వినడం..
సాధారణంగా భర్తపై భార్య చేసే మొదటి ఫిర్యాదులో భర్త తన మాట వినడం లేదనే ఫిర్యాదు మాత్రమే ఉంటుంది. అలా భర్త మాట వినకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. అది క్రమంగా పెద్ద గొడవగా మారి.. విడాకుల వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా భర్తలు తమ భార్య ఏం చెప్తుందో వినాలి. వారి సమస్యలు ఏంటి, వారి భయాందోళనలు ఏంటి అనేది తెలుసుకోవాలి. వాటికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలి.
వాటిని పరిష్కరించేందుకు కొంత సమయం తీసుకున్నా, కనీసం పరిష్కరించకపోయినా పర్వాలేదు.. కానీ ఆమె మాటను ఆమె పక్కన కూర్చొని వింటే సగం సమస్యలు తీరిపోతాయి.
పనుల్లో సహాయం చేయకపోవడం..
గతంలో ఇంటి పని మొత్తం ఆడవారు చేస్తే, మగవారు బయటికి వెళ్లి సంపాదించుకొని వచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. మగవారితో పాటు ఆడవారు కూడా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పనిలో కూడా మగవారు భాగం అవ్వాలని అనుకుంటున్నారు. అదే విధంగా మగవారు సైతం ఆడవారి ఇంటిపనుల్లో పాలు పంచుకుంటే ఆ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. అలాగే మీ సతీమణికి కొంత భారం తగ్గినట్లు అనిపిస్తుంది.
మనతో పాటు సమానంగా సంపాదిస్తున్నప్పుడు వారి పనిలో కూడా భాగం అయితే.. ఆమెకు భర్తపై గౌరవం పెరగడంతో పాటు ఇష్టం కూడా పెరుగుతుంది. పైగా ఆలుమగలు కలిసి పని చేసుకుంటుంటే ఇద్దరి మధ్య ఐక్యత రెట్టింపు అయ్యి.. ప్రేమగా జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది.
బంధువుల ముందు విలువ ఇవ్వకపోవడం..
సాధారణంగా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు భార్యను లేదా భార్య తరఫున వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలా చేయడం వివాహ బంధానికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు భార్యకు తగిన గౌరవం ఇవ్వాలని, వారి ముందు తక్కువ చేసి మాట్లాడొద్దని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications