Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భార్యలు చేసే ఈ 5 పనులు భర్తలకు అస్సలు నచ్చవు.. అందుకే వేరే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు!
భార్యాభర్తల మధ్య సంబంధం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సంబంధంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. అవి కొన్ని కొన్ని సందర్భాల్లో విడాకులకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు భార్యలు చేసే కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పుల వల్ల భర్తలకు కోపం వస్తుంది. దాని కారణంగా వారి మధ్య దూరం పెరిగి, బంధం విచ్చిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఆ తప్పులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భార్యలో అనుమానం
ఎప్పుడు సంబంధంలో అనుమానం వస్తుందో.. అది ఆ సంబంధం విచ్చిన్నానికి సూచకం అని చప్పుకోవచ్చు. భార్య తన భర్తను అనుమానించడం వల్ల వారి మధ్య సమస్యలు పెరుగుతాయి. సంబంధాన్ని బలహీనపరుస్తుంది. అనుమానంతో భార్య, భర్త మధ్య తిరిగి విశ్వాసం ఏర్పడటం కష్టం. అందుకే అనుమానపడకుండా భాగస్వామితో మాట్లాడడం, విషయాలను క్లియర్ చేయడం చాలా ముఖ్యం.

గౌరవం లేకపోవడం
ఏ రిలేషన్‌షిప్‌లోనైనా గౌరవం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామిని గౌరవించకపోతే, ఆ బంధం విచ్చిన్నం అవుతుంది. కొందరు భార్యలు.. తమ భర్తలను బయట కూడా అవమానించడానికి వెనుకాడరు. అలా చేయడం, భర్త గౌరవాన్ని తగ్గించడం అవుతుంది. దీని కారణంగా భర్తలో మీపై కోపం ఏర్పడుతుంది. క్రమంగా భార్య భర్తల సంబంధం దెబ్బ తింటుంది.
ప్రతిసారీ వాదించడం
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఇది రోజువారీ రీతిగా మారితే, ఇబ్బంది తలెత్తుతుంది. కొంతమంది భార్యలు ప్రతిసారీ వాదిస్తూ ఉంటారు. దీంతో భర్తలు సైతం భార్యలను చూడటానికి కూడా ఇష్టపడరు. ఈ అలవాట్లు, సంబంధంలో ప్రేమ, గౌరవం అనే భావాలను అంతమొందిస్తాయి.
ప్రాముఖ్యత ఇవ్వకపోవడం:
భార్యాభర్తలు తమ తమ మాటలకు ప్రాముఖ్యత ఇవ్వడం అవసరం. అంటే, మీరు మీ భాగస్వామి మాటలను పట్టించుకోవడం, వాటి మాటలు వినడం వంటివి. కొందరు భార్యలు, భర్త మాటలను పట్టించుకోకుండా, వారిని కంట్రోల్ చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ అలవాట్లన్నీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడటానికి కారణం కావచ్చు.
అవగాహన లేకపోవడం
అవగాహన అనేది సంబంధంలో అత్యంత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, సంబంధం సాగడం కష్టం. కానీ, దీనికో అభ్యాసం అవసరం. చాలామంది భార్యలు, భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. దీంతో భర్త తన భావాలను బయటపెట్టకుండా ఉండిపోతారు. ఇది సంబంధంలో మనస్పర్థలు తలెత్తేందుకు కారణమవుతుంది.



Click it and Unblock the Notifications