Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.!
కుటుంబంలో భార్యాభర్తల బంధం ఎంత బలంగా ఉండాలో, అత్తాకోడళ్ల మధ్య బంధమూ అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అయితే ఈ కాలం అత్త ఆనాటి కోడలు.. ఈ కాలం కోడలు రేపటి అత్త అనేది వాస్తవమైనా అనాది కాలం నుంచి అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ అత్తకి ఇష్టమైన కోడలిగా మారాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అత్తింట్లో కోడలు సైతం కూతురిగా బతకగలదు. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం..

జీవితంలో పెళ్లి అనేది చాలా కీలక ఘట్టం. పుట్టింటి గారాబంలో పెరిగి భర్తతో ఏడడుగులు వేసి అత్తింట్లో అడుగుపెట్టిన కోడలికి ప్రతి క్షణం ఓ సవాలుగా మారుతుంది. మెట్టినింటితో కలిసిపోవడం, వారి మన్ననలు పొందడం, ముఖ్యంగా అత్తగారి దగ్గర గౌరవ, మర్యాదలతో మెలగడం చాలా అవసరం. లేదంటే ఏదో ఒక సమస్య వస్తుంది. మీ అత్తగారికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే ఈ ఐదు లక్షణాలు తప్పనిసరని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
అత్తగారితో మాట్లాడేటప్పుడు కోడలు మర్యాదపూర్వకంగా, ప్రేమగా మాట్లాడటం చాలా ముఖ్యం. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి వారితో గౌరవంగా మెలగాలి. వయసు రీత్యా అత్తామామలకు ఆరోగ్య సంబంధిత విషయాల్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
వయసు, అనుభవం రీత్యా అత్తాకోడళ్ల ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తితే.. కోపతాపాలకు పోకుండా ఓపికగా మాట్లాడుకోవాలి. తద్వారా సమస్యలు సానుకూలంగా తొలగిపోతాయి.
ఇంటి పనులు, శుభకార్యాల్లో అత్తగారికి చేదోడు వాదోడుగా ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల వారిపై భారం తగ్గడమే కాకుండా కోడలిపై అత్తకు మమకారం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశమూ పెరుగుతుంది.

ఇంటి విషయాలు, వంట పనుల్లో అత్తగారి సలహా తీసుకోవడం ఉత్తమం. కోడలిగా ఆ ఇంట్లో కొత్త కాబట్టి ఎవరి అభిరుచులు, అభిప్రాయాలు ఏంటో తెలీదు. అత్తగారి సలహా తీసుకోవడం ద్వారా వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీపై నమ్మకంతో పాటు మీకు ప్రాముఖ్యత పెరుగుతుంది.
అత్తాకోడళ్లకి మధ్య ఏవైనా చిన్నపాటి గొడవలు తలెత్తినా ఆ విషయాలను భర్తతో షేర్ చేసుకోవద్దు. ఇది వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. కోడలిగా ఇంటి బాధ్యతలను అత్తగారి సలహాతో సక్రమంగా నిర్వర్తిస్తే మంచి కోడలుగా మారవచ్చు. ఇంట్లో ఉండే కోడలు అయినా, ఉద్యోగం చేసే కోడలైనా.. ఇంటి బాధ్యతల్లో సమయపాలన చేసుకోవడం ద్వారా ఆమె మన్ననలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications