Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మోడ్రన్ అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయిలే ఇష్టం.. అబ్బాయిలో ఈ లక్షణాలు ఉంటేనే ప్రేమిస్తున్నారు!
ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈ ప్రేమ అనే బంధం మార్చేస్తుంది. ప్రేమలో ఉండే భాగస్వామ్యులిద్దరూ అర్థం చేసుకొని ఒకరికొకరు జీవించగలిగితే ఆ బంధం అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని మనస్పర్థల కారణంగా గొడవలు పడితే ఆ బంధం అక్కడే ఆగిపోతుంది. అందుకే అమ్మాయి అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు చూసి ఇష్టపడుతుంది, అబ్బాయి అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూసి ఇష్టపడతాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజాయితీ
ఏ బంధంలోనైనా నిజాయితీ అనేది చాలా ముఖ్యం. బంధం బలంగా ఉండాలంటే ఈ నిజాయితీనే పునాదిగా ఉంటుంది. ప్రేమికులు, లేదా భార్య భర్తల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా ఇద్దరి మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకే చాలా మంది అమ్మాయిలూ నిజాయితీగా ఉండే అబ్బాయిలను ఇష్టపడుతుంటారు. వారి వైపే ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. నిజాయితీగా ఉంటేనే తమను బాగా చూసుకోగలుగుతారని నమ్ముతుంటారు. అందుకే నిజాయితీగా ఉండడం నేర్చుకోండి.

ప్రశంసించడం
ప్రేమలో మన మాటల కంటే మన వైఖరి, ప్రవర్తన అనేది బిగ్గరగా మాట్లాడుతుంటాయి. ప్రేమలో మన ప్రవర్తన మీద ఆధారపడి ఆ బంధం ఎంత బలంగా ఉండబోతుంది, ఏ విధంగా ఆ బంధం ముందుకు సాగబోతోంది అనేది నిర్ణయించబడుతుంది. ఈ బంధంలో ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం కూడా ఒక ఉత్తమమైన చర్య. సరైన సమయంలో సరైన రీతిలో ప్రశంసలు దక్కితే మానసిక ఆరోగ్యం దక్కుతుంది. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఒకరిపై ఇంకొకరిపై ప్రేమ రెండింతలు అవుతుంది. అందుకే ప్రశంసించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.
గౌరవం
మంచి ప్రేమ బంధానికి కేవలం ప్రేమ ఉంటేనే సరిపోదు. ఒకరిపై ఇంకొకరికి గౌరవం కూడా ఉంటుంది. ప్రేమను అర్ధం చేసుకోవడం మాత్రమే కాదు.. గౌరవించడం కూడా చాలా ముఖ్యం. ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలు, లక్ష్యాలు ఇలా ప్రతి ఒక్కటినీ గౌరవించాలి. అమ్మాయిలు తమ మాటలకు విలువ ఇచ్చే వారినే కాకుండా తమ ఇష్టాఇష్టాలను గౌరవించే వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
పరిపక్వత
ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక మిస్టేక్ ఉంటుంది. అయితే తప్పును కూడా మంచి వ్యక్తిత్వంతో అర్ధం చేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. తప్పును కూడా ఒప్పుకొని పరిపక్వతతో అర్ధం చేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు కోరుకుంటారు. అందుకే మీరు కూడా తప్పులను కూడా మంచి మనసుతో అంగీకరించాలి. వారి తప్పులను కూడా పరిపక్వతతో అర్ధం చేసుకోవాలి.
ప్రేమగా ఉండాలి
నిజమైన ప్రేమ బహుమతులు, ఆస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు చూసి పుట్టదు. తమను ప్రేమించే వ్యక్తిలోని గుణాలను చూసి పుడుతుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలోకి డబ్బును చూసి కాకుండా వారు అబ్బాయిలు తమ కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు, తమ కోసం శ్రద్ధ తీసుకుంటున్నారా లేదా? సమస్యల్లో ఉన్నప్పుడు తమకు తోడుగా నిలబడతారా లేదా అనేది చూసి ప్రేమిస్తున్నారు. అందుకే మీ భాగస్వామితో ప్రేమగా ఉండడం నేర్చుకోండి.



Click it and Unblock the Notifications