Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ లక్షణాలు కనిపిస్తే.. పార్ట్‌నర్‌కు కొంత సమయం వరకు వదిలేయాలి..!
రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్ మిమ్మల్ని పరిగణలోకి తీసుకోనప్పుడు వారిని కొంత సమయం పాటు ఆలాగే వదిలివేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పార్ట్‌నర్‌లో కొన్ని లక్షణాలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయ్, మీకు తక్కువ విలువనిచ్చినట్టుగా అనిపిస్తాయ్, మీపైన ప్రేమలేనట్టు కూడా ఆ లక్షణాలు సంకేతాలను పంపుతాయ్. అలాంటి సందర్భంగా పార్ట్‌నర్‌తో కొద్ది సమయం వరకు దూరంగా వుండడం మంచిది. పార్ట్‌నర్‌లో ఆ లక్షణాలు ఎలా వుంటాయో మీకు అందిస్తున్నాం.
ప్రేమ చాలా గొప్పది. ప్రేమించడం, ప్రేమించబడ్డం చాలా గొప్ప విషయం. పార్ట్‌నర్‌లో కలిసి ఇప్పటి వరకు ఎన్నో పనులను చేసి వుంటారు. వారితో కలిసి అవిశ్రాంతంగా నడిచి వుంటారు. అయితే వారికి కొంత సమయం ఇవ్వడం మంచిది. వారికి వున్న హాబీలు, వారికి వున్న ఇష్టాలను పరిగణలోకి తీసుకోవాలి.
మీకు స్పందించడానికి చాలా సమయం తీసుకుంటారు
లేటుగా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ఎవ్వరికీ ఇష్టముండదు. పార్ట్‌నర్ నుంచి అలాంటి లేటు మెసేజిలు వస్తే కొంతవరకు అర్ధం చేసుకోవాలి. వారికి అనుకూలతను బట్టి వారు రిప్లై ఇస్తున్నప్పుడు వారిని అలాగే వదిలివేయాలి. ఎక్కువ చింతించవద్దు. వారికి కొంత సమయం అవసరం అని మనం భావించాలి.

ఫోన్ కాల్స్‌కు సరిగ్గా రెస్పాండ్ కానప్పుడు
రోజంతా పని పూర్తి చేసుకున్న తరువాత కొందరు లవర్స్ చాలా సమయం వరకు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారు. మీ పార్ట్‌నర్ ఇక అది ఎంత మాత్రం చేయలేనప్పుడు వారికి కొంత సమయం అవసరం వుంటుందని గ్రహించాలి. ఫోన్ కాల్స్‌కు బదులుగా వారు వేరే పనుల్లో బిజీ వున్నట్లుగా భావించి వారిని వారి సమయానికి వదిలివేయాలని నిపుణులు చెెబుతున్నారు.
వారి ప్లాన్స్‌లో మిమ్మల్ని భాగం చేసుకోరు
మీ పార్ట్‌నర్ మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకొని వుండవచ్చు. వారి ఫ్రెండ్స్‌తో ఏదైనా పిక్‌నిక్‌కు వెళ్లవచ్చు. అలాంటి సందర్భంలో వారితో గొడవ పడకుండా వారి స్నేహితులతో గడపడానికి వారికి సమయం అవసరమని భావించి వారిని వదిలివేయాలి.
మీతో చాలా విషయాలను దాచే ప్రయత్నం చేస్తారు
మీతో సంప్రదించకుండానే వారు చాలా పనులు చేయడానికి సిద్ధపడతారు. అలాంటి సందర్భంలో వారికి కొంత సమయం కావాలని గ్రహించాలి. ఇది ఒక సంకేతంగా కూడా అర్ధం చేసుకోవాలి.
మీతో గతంలో లాగా టచ్‌లో వుండరు
మీతో మాట్లాడ్డమే కాదు ఇక మీతో టచ్‌లో కూడా లేరని మీరు భావించినప్పుడు వారికి మీ నుంచి కొంత స్పేస్ అవసరమని నిర్ణయానికి రావాలి. ఈ విషయంలో వారికి క్షమించాలి. ఇది తెలిసిన తరువాత వారికి వీలు కలిగినప్పుడే మీతో మాట్లాడమని వారికి చెప్పాలి. మీరు వారి భావాలని గౌరవించినప్పుడు మీరు వారు మిమ్మల్ని గౌరవిస్తారు.
ప్రేమ అనేది చాలా అందమైన అనుభూతి. జీవితంలో పార్ట్‌నర్ సహకారం వుంటే ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేము. కానీ కొంత స్పేస్ కూడా అవసరమని భావించాలి. వారికి స్పేస్ కావాలనుకున్నప్పుడు వారి భావాలను, భావోద్వేగాలను గౌరవించాల్సిన అవసరం చాలా వుంది. కొన్ని సార్లు దూరం కూడా మనుషులను మరింత దగ్గరికి చేస్తుందన్న సత్యాన్ని గ్రహించాలి.
గమనిక : పైన ఇవ్వబడిన సమాచారమంతా ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించమని చెబుతున్నాము.



Click it and Unblock the Notifications