Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఇలా చేస్తే మీ భార్య క్షణాల్లో మీకు ఆకర్శితులవుతుంది..!
భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధం అన్నింటికంటే ఉత్తమమైనది, ప్రత్యేకమైనది. వీరి అనుబంధానికి ముఖ్యంగా కావలసింది ప్రేమ నమ్మకం. వీటి పైనే ఇద్దరి బంధం ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక కుటుంబం బాగుండాలంటే అందులో భార్యాభర్తల పాత్ర చాలా కీలకమని భావించాలి. ఇద్దరు బాగుంటేనే మొత్తం కుటుంబం బాగుంటుంది. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కొంటారు.
వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత బంధాల్లో ఉండే విభిన్న కోణాలను స్వయంగా చూసి తెలుసుకుంటారు. దీంతో వారి బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. భార్యను సంతోషంగా ఉంచడం భర్త బాధ్యత. ఈ బాధ్యత నుంచి ఎట్టి పరిస్థితుల్లో పక్కకు తప్పుకోవద్దు.

ప్రేమ చూపండి
భార్యపై అమితమైన ప్రేమను చూపించాలి. నిత్యం ఆమెను సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి. తరచుగా, వీలు కలిగినప్పుడల్లా భార్యను కౌగిలించుకోవాలి. మాటల్లో ప్రేమను చూపించాలి. ఆమె కోసం ప్రత్యేకంగా టీ కాఫీ లాంటివి చేయాలి. వంట వండాలి. ఇంటి పనుల్లో భార్యకు సహకారంగా ఉండాలి. ఇది చేయడం వల్ల మీ భార్యను సంతోష పెట్టడమే కాకుండా ఆకట్టుకుంటారు.
వారి మాటలు వినండి
మీ భార్య ఏమి చెబుతుందో శ్రద్ధగా వినండి. ఆమె మాటలను ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భార్య మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తలదూర్చవద్దు. ఆమెను పూర్తిగా తన భావాలను వ్యక్తం చేయనీయండి. ఆమె మాటలు మీకు కొన్ని నచ్చకపోయినా వాటిని పట్టించుకోవద్దు. కొన్ని మాటలను విని విననట్టు వదిలివేయాలి.
పొగడాలి
సమయం దొరికినప్పుడల్లా మీ భార్యను ఏదో రకంగా పొగుడుతూ ఉండండి. ఆమె అందాన్నీ, తెలివితేటలను ప్రశంసిస్తూ ఉండండి. నీకోసం చేసే చిన్న పనులను కూడా బాగా చేసావని పొగడాలి. ఏ పని చేసినా కృతజ్ఞతా భావంతో ఉండాలి.

సమయం కేటాయించాలి
వైవాహిక జీవితంలో భార్యకు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఆమెతో కలిసి ఉదయం లేవగానే వాకింగ్ కు వెళ్ళండి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత కూడా వారికి సమయం కేటాయించాలి. వారితో కొన్ని నిమిశాల పాటు మాట్లాడాలి. కొందరు తినగానే పడుకోవడం చేస్తారు. ఇలా చేయవద్దు. ఇద్దరూ కలిసి నైట్ టైంలో దగ్గరలో ఏదైనా ఐస్‌క్రిం పార్లర్, బేకరీ లాంటి ప్రదేశాలకు వెళ్లండి.
సర్‌ప్రైజ్ చేయాలి
భార్యను సర్‌ప్రైజ్ చేస్తే చాలా సంతోషడుతుంది. చిన్ని చిన్ని విషయాల్లో కూడా సర్‌ప్రైజ్ చేయవచ్చు. మీ భార్యకు ఇష్టమైన వస్తువులను కొని ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వండి. చిన్న వంటకం చేసి కూడా సర్‌ప్రైజ్ డిష్ అని ఆమె ముందు పెట్టవచ్చు. ఇలా చేస్తే మీ భార్య చాలా మీకు ఆకట్టుకుంటుంది.
ఇంటి పనుల్లో సహాయం చేయండి
మీ భార్యకు ఇంటి పనుల్లో సహకారంగా వుండాలి. ఆమె వంట చేస్తున్నప్పుడు కూరగాయలు కట్ చేయడం. పాత్రలు కడుగుతుంటే, కడిగిన వాటిని జాగ్రత్తగా వంటింట్లో అమర్చడం లాంటి పనుల్లో సహాయంగా వుండాలి.
తప్పులను క్షమించండి
భార్య చేసే తప్పులను ఎప్పటికప్పుడు క్షమించాలి. చిన్న పొరపాట్లు వారు చేసినా వారిని క్షమించాలి. వారిని నిందించవద్దు. వారు చేసిన తప్పు ఏంటో వారికిి తెలిసేలా చెప్పి, రెండవసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడండి.



Click it and Unblock the Notifications
