Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రిలేషన్‌షిప్‌లో వుంటే..వీటికి దూరంగా వుండండి..!
ఏపని చేసినా అది శాంతి, సంతోషం కోసమే. పెళ్లి చేసుకునేది కూడా సంతోషంగా వుండడానికే. ఎన్ని చేసినా ప్రశాంతత లేకపోతే దానికి అర్ధమే లేదు. శాంతి ఇప్పుడు చాలా ఖరీదైన ఎమోషన్‌గా మారింది. దీనికి అర్థం అది సులువుగా దొరకడం లేదు, దానికి చాలా ఎక్కువ విలువ వుందని చెబుతున్నారు. రొలేషన్‌షిప్‌లో సర్దుకుపోతూ వున్నా శాంతి లేకపోతే దానికి విలువ అస్సలు లేదు. అయితే దాంపత్యం, లవ్‌లో, రిలేషన్‌షిప్‌లో ప్రశాంతత కోసం ఏమి చేయాలి. నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
ఇతరులను అవమాన పరచడం
రిలేషన్‌షిప్‌లో పార్టనర్ పై తప్పులను తోసేసేటప్పుడు తాము ఏమి చేస్తున్నారో తమకు తాము గమనించుకోవాలి. అప్పుడు మీలో కలిగే భావనలను మీరు గమనించగలుగుతారు. ఆ సమయంలో మీరు చాలా శక్తివంతంగా అనుభూతి చెందుతారు.
అర్ధం చేసుకోవడం
రిలేషన్‌సిప్‌లో ఏదైనా గొడవ జరిగినప్పుడు నేను మాత్రమే కరెక్ట్ అనే భావన చాలా మందిలో వస్తుంది. దీనిని తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు కూడా భిన్న అభిప్రాయాలు వుంటాయన్న విషయాన్ని గమనించాలన్నారు. ఇగోను పక్కనపెట్టి ఇతరుల మెదళ్లను అర్థం చేసుకోవాలని అన్నారు.

బంధాలను తెంచుకోవడం
రిలేషన్‌షిప్‌లో గొడవల వల్ల కుదరకపోతే ఇద్దరూ విడిపోతారు. కానీ అలా విడిపోయే ముందు దానికి కారణమైన వాటి గురించి ఆలోచించాలి. ఆగ్రహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మన ఆలోచనలను కూడా మనం గమనిస్తూ వుండాలని నిపుణులు చెబుతున్నారు.
విలువ
మనం అనుకున్నట్లు మన పార్ట్‌నర్‌ను వుంచితే మనకు చాలా సంతోషంగా వుంటుంది. అప్పుడు ఎక్కడాలేని కిక్ వస్తుంది. మన సంతోషం మన పార్ట్‌నర్ ప్రవర్తనపై ఆధారపడి వుంది అంటే పార్ట్‌నర్‌కే ఎక్కువగా విలువనిస్తున్నారని అర్ధం. అలా కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకొని పార్ట్‌నర్‌ను స్వేచ్ఛగా వదిలి మీకు నచ్చిన పనిని చేస్తే మీకు విలువ పెరుగుతుంది.
అసలు వ్యక్తిత్వాన్ని దాచుకోవద్దు
మీ పార్ట్‌నర్ ముందు మీ అసలు వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాచుకోవద్దు. మీ వ్యక్తిత్వాన్ని దాచడానికి మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రోజు అది బయటపడ్డం దానివల్ల మీ పార్ట్‌నర్ చాలా బాధపడ్డం జరుగుతుంది. మీకు ఎలాంటి బలహీనతలు వున్నా వాటిని ముందు పెట్టడానికి అస్సలు సంకోచించవద్దు.
ఫోన్ వాడడం
రిలేషన్‌షిప్ కన్నా ఫోన్ ఎక్కువ ముఖ్యం కాదు. మనం చాలా ప్రదేశాల్లో చూసే వుంటాం. పిల్లలు ఫోన్‌తో ఆడుకుంటూ తల్లిదండ్రులతో మాట్లాడరు, స్నేహితులు హోటల్‌లో కూర్చొని ఫోన్‌లో మునిగిపోయి రెస్టారెంట్‌కు ఎందుకు వచ్చామనే విషయాన్ని మరిచిపోతుంటారు. ఇలాంటివి చేయకుండా. పోన్‌ను పక్కనబెట్టి పార్ట్‌నర్‌కు మొత్తం సమయాన్ని కేటాయించాలి.
జీవితం, పనిపై విరక్తితో వుండకండి
లేజీగా వుండవద్దు. జీవతం పట్ట విరక్తితో వుండవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా కొంత బాధపడ్డం సహజమే. కానీ శక్తిని మొత్తం మళ్లీ కూడదీసుకొని జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టాలి.
ఆఫీస్, ఇల్లు
ఇంట్లో వున్న సమస్యలను ఆఫీస్‌కు తీసుకొని రాకూడదు. పని తరువాత మీ పార్ట్‌నర్‌కు పూర్తి సమయాన్ని ఇవ్వండి. ఉద్యోగాన్నీ, పర్స్‌నల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వుండాలి.
ఎక్కువ సీరియస్‌గా వుండవద్దు
మీ పార్ట్‌నర్‌ను మీరెప్పుడూ నవ్విస్తూనే వుండాలి. ఎప్పుడూ సీరియస్‌గా వుండడం వల్ల సమస్యలు వస్తాయ్. దీనికి బదులుగా వీడియో గేమ్స్ ఆడ్డం, చెస్, క్యారమ్స్ లాంటివి ఆడటం, నెట్‌ఫ్లిక్స్ చూడ్డం చేయాలి.



Click it and Unblock the Notifications