Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొగుడు పెళ్ళాం కలిసి ఆ పని చేశారంటే కొంప కొల్లేరు అయినట్లే, ఎందుకంటే?
అన్ని బంధాలలో వివాహబంధం అనేది అత్యంత ముఖ్యమైనది, అలాగే పవిత్రమైనది కూడా. వివాహం అనేది రెండు వ్యక్తులకు మధ్య సంబంధం కాదు, రెండు కుటుంబాలకు చెందిన సంబంధం. ఈ బంధంలో అనేక కష్టసుఖాలు, అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ బంధంలో భాగస్వాములు ఒకరినొకరు అండగా నిలబడాలి, తమ భవిష్యత్తును కలిసి నిర్మించాలి. అయితే చాణక్య నీతి ప్రకారం, భార్య భర్తలిద్దరూ కలిసి కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలాగే వారి మధ్య బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కోపంలో ఉన్నప్పుడు
మనిషి జీవితంలో అత్యంత నష్టం కలిగించే అంశం కోపమే. భార్యభర్తలు తరచుగా చిన్న విషయాలపై కోపాన్ని ప్రదర్శిస్తే, అది వారి బంధాన్ని నాశనం చేయవచ్చు. అందుకే కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే భార్యాభర్తలిద్దరూ కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి పని చేయకూడదు. ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఇది తమ, తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది.

గౌరవం లేకపోవడం
భార్యభర్తల మధ్య గౌరవం లేకపోతే, వారి సంబంధం సంతోషంగా ఉండదు. గౌరవం లేకపోవడం అనేది గొడవలకు కారణమవుతుంది. దీని కారణంగా వారు భవిష్యత్తులో విడిపోవడానికి అవకాశాలు ఉంటాయని చాణక్యుడు చెబుతున్నారు. భార్యభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తలిద్దరూ తమపై తమకు గౌరవం లేనప్పుడు ఎదుటి వ్యక్తుల ముందు ఎలాంటి పనులు చేయకూడదట.
సీక్రెట్స్ దాచడం:
సంబంధంలో పారదర్శకత చాలా ముఖ్యం. మీ భాగస్వామి నుంచి రహస్యాలను దాచడం అనేది అత్యంత ప్రమాదకరం. ఒకానొక సందర్భంలో అతడు లేదా ఆమె ఆ విషయాలను తెలియజేసినప్పుడు గొడవలకు దారితీయవచ్చు. దాచుకోవడం వలన మీ సంబంధంలో మరింత సమస్యలు వస్తాయి.
మితిమీరిన ఖర్చులు:
వివాహ బంధంలో ఖర్చుల నిర్వహణ అనేది చాలా ముఖ్యం. మితిమీరిన ఖర్చులు భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తాయి. అందుకే వివాహబంధంలో ఆర్థిక నిర్వహణ కూడా చాలా ముఖ్యం. భార్యభర్తలు తమ ఖర్చులను క్రమబద్ధంగా నిర్వహించకపోతే, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు, తరచుగా సంబంధం లోపాలను కలిగిస్తాయి.
అబద్ధాలు చెప్పడం:
వివాహంలో నిజాయితీ చాలా ముఖ్యం. చిన్న అబద్ధం కూడా బంధాన్ని నాశనం చేయవచ్చు. ఎప్పటికప్పుడు నిజాయితీగా ఉండటం, మీ సంబంధం పునాదిని బలంగా ఉంచుతుంది. భార్యభర్తలు, ఒకరినొకరు గౌరవిస్తూ, నిజాయితీగా ఉండటం, పారదర్శకంగా సంబంధాన్ని నిర్వహించడం, అనవసరమైన కోపం మరియు మితిమీరిన ఖర్చులను నివారించడం ద్వారా తమ సంబంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications