Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ఈ రాశుల వారు మంచి శృంగార భాగస్వామి కాగలరు.. ఆ రాశులేవో తెలుసుకోండి
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సంబంధానికి లైంగిక అనుకూలత ఒక ముఖ్యమైన అంశం. శృంగార అనుకూలత విషయానికి వస్తే చాలా మంది వ్యక్తులు తమ లైంగిక జీవితానికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. లైంగికంగా అనుకూలమైన భాగస్వామిని కనుక్కోవడం అంత సులభమైన ప్రక్రియేం కాదు. ఇది ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే తెలుసుకునే విషయం కాదు. అలా అని పెళ్లికి ముందు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే అవకాశం అందరికీ ఉండదు. మరి లైంగిక అనుకూలత సరిపోయే భాగస్వామిని కనుక్కోవడం ఎలా?

మీ రాశి చెప్పేస్తుంది. రాశిచక్ర గుర్తులు ఒక వ్యక్తి యొక్క స్వభావం గురించి చెప్పగలదు. ఒక రాశి వారు ఎలాంటి వారు అని ఒక అంచనాకు ఎలా రావొచ్చో.. పడగ్గదిలో ఎలా వ్యవహరిస్తారో అని వారి స్వభావం బట్టి చెప్పవచ్చు. కొన్ని రాశుల వారు మంచి శృంగార భాగస్వామి అవుతారని జ్యోతిష్యం చెబుతోంది. వారితో లైంగిక జీవితంలో చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంటుందని చెబుతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందామా..
సింహ రాశి:
సింహ రాశి వారు పడగ్గదిలో కూడా సింహంలా ఉంటారు. సింహ రాశి వారు హాట్, ఉద్వేగభరితమైన ప్రేమికులకు పర్యాయపదంలా ఉంటారు. పడగ్గదిలో లీడ్ తీసుకుంటూ సంతృప్తి పరచడానికి కృషి చేస్తారు. ప్రత్యేకమైన అనుభూతి కలిగించడానికి ప్రయత్నిస్తారు. పడగ్గదిలో వారి నైపుణ్యం భాగస్వామిని సుఖపెడుతుంది, సంతృప్తిపరుస్తుంది. అలాగే సింహ రాశి వారు గొప్ప ప్రేమికులుగా కూడా ఉంటారు. భాగస్వామి అవసరాలకు, సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
తులారాశి:
శృంగారం విషయానికి వస్తే తులారాశి వారు చాలా నైపుణ్యంతో వ్యవహరిస్తారు. భాగస్వామికి ఏం కావాలో అది ఇస్తారు. వారికి ఏం కావాలో ఇది తీసుకుంటారు. మొత్తంగా శృంగారం ఇద్దరూ సుఖాన్ని పొందేలా వ్యవహరిస్తారు. సెక్స్ ఫాంటసీలను కూడా నిజం చేయడానికి తులారాశి వారు అన్ని విధాల ప్రయత్నిస్తారు. వీరితో శృంగారం మరో స్థాయిలో ఉంటుంది. కొత్తదనంతో సుఖపెట్టడంలో తులారాశి వారు సిద్ధహస్తులు. కొంటె పనులు చేయడంలో ముందుంటారు. ఏం చేసినా చివరికి సంతృప్తి పరుస్తారు.
వృశ్చికరాశి:
శృంగారంలో ఏ పని ఎప్పుడు చేయాలో, ఎప్పుడు వేటితో పని కానియ్యాలో సరిగ్గా తెలిసిన వారు వృశ్చిక రాశి వారు. వృశ్చికం అంటే శక్తికి ఆధిపత్యంగా చూస్తారు. వీరు పడగ్గదిలో తమ సామర్థ్యంతో ఆకట్టుకుంటారు. ప్రయోగాలు చేయడానికి వెనకడారు. వారి స్టామినాతో మంచి సుఖాన్ని అందిస్తారు. వీరి సామర్థ్యంతో అధికంగా ఆకట్టుకుంటారు.
కన్యరాశి:
కన్య రాశి వారు నిదానమైన, ఇంద్రియాలకు సంబంధించిన ఉద్వేగభరితమైన శృంగారాన్ని బాగా ఇష్టపడతారు. కన్యరాశి వారు శృంగారంలో తొందరపడరు. నిదానంగా మొదలుపెడతారు. ప్రతి అంశాన్ని స్ఫూరిస్తూ సాగుతారు. చివరి వరకూ వచ్చి వారి అసలు సామర్థ్యాన్ని చూపిస్తారు. భాగస్వామికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. శృంగారంలో వీరు ప్రధానంగా కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామిని సుఖపెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీలైనంత ఎక్కువగా సంతృప్తిని ఇవ్వడానికి తమ స్టామినాను వాడతారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక్కసారి మొదలు పెడితే వారిలోని రతి క్రీడాకారులను బయటకు తీసుకువస్తారు. చాలా సామర్థ్యాన్ని కనబరుస్తారు. శృంగారం మొదటి నుంచి ఆఖరి వరకు ఒకే రకమైన ఉత్సాహంతో ఉంటారు. సంభోగాన్ని బాగా ఇష్టపడతారు. ధనుస్సు రాశి వారితో శృంగారం మంచి అనుభవాన్ని, అంతకుమించిన సంతృప్తిని అందిస్తుంది.



Click it and Unblock the Notifications