Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Revange: లవర్ వదిలేసి పోతే..రివేంజ్ తీర్చుకోవడం ఎలా?
మన లైఫ్ లోకి చాలామంది వస్తుంటారు,పోతుంటారు. అయితే వీరిలో కొందరితో మాత్రం జీవితాంతం కలిసి ఉండాలని,వారితో గడపాలని మనసు ఆరాటపడుతుంది. మనం ఎంతో ఇష్టంగా ఆహ్వానించి, మన ప్రపంచంగా భావించుకున్న భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి.. వారి స్వార్థం కోసం మనల్ని కాదని వెళ్లిపోతే లేదా మనతో ఉంటూనే మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఆ విషయం తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. గుండె ముక్కలైపోతుంది. ఆ సమయంలో వచ్చే కోపం, ఆవేదన మనల్ని ప్రతీకారం వైపు నడిపిస్తాయి. చాలా నేరాలకు ఇదే కారణం.
నన్ను వదిలేసి వెళ్లిన వాళ్లకు బుద్ధి చెప్పాలి?నన్ను మోసం చేసిన వాళ్లను ఏం చేయాలి? నా విలువ తెలిసేలా చేయాలి అనే కసి పుట్టడం సహజం. అయితే ఈ ప్రతీకారం అనేది ఎలా ఉండాలి? వాళ్లతో గొడవపడటమా? లేక వారిని ఏదో ఒకటి చేయడమా? ప్రముఖ సైకాలజిస్ట్, థెరపిస్ట్ వర్ష ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పిన ఓ అద్భుతమైన విషయం మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.

మీరు హానెస్ట్ గా ఉన్నప్పుడు మీ భాగస్వామి లేదా లవర్ మిమ్మల్ని వారి స్వర్థం కోసం మిమ్మల్ని వదిలేసి పోతే రివేంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. అయితే రివేంజ్ తీర్చుకునేముందు ఓ ముఖ్య విషయం గుర్తుంచుకోవాలని వర్ష చెప్పారు. ఓ చిన్న కథను ఉదహరిస్తూ..ఏనుగు సహజంగానే తనను తాను క్లీన్ గా ఉంచుకుంటుంది, అదే సమయంలో పంది సహజంగానే ఎప్పుడూ అపరిశుభ్రంగానే ఉంటుంది. ఒక రోజు అడవిలో ఏనుగు గంభీరంగా తన పని తాను చేసుకోడానికి పోతున్నప్పుడు దారిలో పండి ఎదురుపడుతుంది. దీంతో ఏనుగు ఒక పక్కకి వెళ్లి దాక్కుంటది..దీంతో పంది తన దారిన అది పోతుంది. అదే ఏనుగు తన గొప్పతనాన్ని చూపించుకోవాలని అని పంది దగ్గర బిహేవ్ చేస్తే పంది మీద ఉండే బురద ఏనుగు మీద పడతది..దీంతో ఏనుగు మళ్లీ వెళ్లి స్నానం చేసుకోవాలి. ఏనుగు లక్ష్యం దెబ్బతింటుంది, ఏనుగు వెళ్లే డైరక్షన్ కూడా నాశనమైపోతుంది. కాబట్టి ఏనుగు అలా చేయకుండా పందిని దాని బురద అదే పూసుకోని అనుకుంటూ తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతుంది.
మనుషులు కూడా ఏనుగు లాగా ఆలోచించాలని వర్ష తెలిపారు. మీ లైఫ్ నుంచి మీ పార్టనర్ లేదా వెళ్లిపోవాలనుకుంటే వారికి దారి ఇవ్వాలని, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు నీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నా లేదా మోసం చేస్తున్నా వారికి కూడా దారి ఇస్తే వాళ్లు వెళ్లిపోతారని వర్ష చెప్పారు. ఎప్పుడైనా నీ రివేంజ్ అనేది నీ విజయం, లక్ష్యంలో చూపించాలి కానీ కూర్చొని గొడవపడాలి, వాళ్లని ఏదో ఒకటి చేయాలి అని మాత్రం ట్రై చేయకూడదని వర్ష సూచించాలి.



Click it and Unblock the Notifications