Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
భార్యతో ఈ విషయాలు అస్సలే చెప్పకూడదు.. చెప్తే మీ పని అయిపోనట్లే.. ఏ విషయాలంటే?
ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే కచ్చితంగా నిజాయితీగా ఉండాలి. ఎంత నిజాయితీగా ఉంటే అంత బలంగా, అంత నమ్మకంగా ఉంటుంది. అయితే భార్య, భర్తలు కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. దీని కారణంగా మీ బంధంలో కచ్చితంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి విషయాలను పంచుకుంటే సంబంధంలో గొడవలు వస్తాయి? ఎలాంటి విషయాలను పంచుకోవద్దు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గతంలోని బంధాలు..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఒక రేలషన్‌షిప్ ఉంటుంది. పెళ్లి తరువాత మరొక వ్యక్తితో తమ జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. అయితే మీ భర్తతో లేదా భార్యతో మీ గతంలోని బంధాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోకూడదు. మీ భాగస్వామిపై ఎంత నమ్మకం ఉన్నా.. ఇలాంటి విషయాలు పంచుకోకపోవడమే మీ బంధానికి చాలా మంచిది. అలాగే మీ బంధంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది.

తప్పులను ఎత్తి చూపకూడదు..
తప్పులు అనేవి సర్వ సాధారణం. మనిషి అనే ప్రతి ఒక్కడూ తప్పులు చేస్తుంటాడు. అయితే వివాహ బంధంలో భర్త చేసే కొన్ని తప్పులను వారికి చెప్పకపోవడమే మంచిదని పలువురు రేలషన్‌షిప్స్ మేనేజర్స్ చెప్పుకొస్తున్నారు. ఆ తప్పును ఒకసారి అర్ధమయ్యే విధంగా చెప్తే పర్వాలేదని, కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే కచ్చితంగా మీ బంధంలో సమస్యలు మొదలవుతాయని పేర్కొంటున్నారు. ఇది మీ బంధాన్ని విచ్చిన్నం చేసే అవకాశం ఉందంటున్నారు.
కుటుంబాలను తిట్టడం..
భర్త ముందు భార్య, లేదా భార్య ముందు భర్త వారి కుటుంబాన్ని తిట్టకూడదు. వారి కుటుంబానికి చెందిన నచ్చని విషయాలను సూటిగా చెప్తే పర్వాలేదు కానీ, పదే పదే వారి కుటుంబాన్ని తిట్టడం, విమర్శించడం అస్సలు మంచిది కాదు. ఇది దంపతుల మధ్య గొడవకు దారి తీయడంతో పాటు సంబంధంలో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
డబ్బు గురించి..
వివాహబంధం అంటే కచ్చితంగా ఆర్ధిక సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో మీ భర్త సంపాదన గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా తక్కువగా చేసి మాట్లాడడం వల్ల భర్తకు మీపైన చికాకు, కోపం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీ బంధానికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే వివాహ బంధం విడాకుల వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది.
మొత్తానికి..
ప్రపంచంలోని ఏ వివాహబంధం పర్ఫెక్ట్‌గా ఉండదు. వివాహ బంధం అంటేనే ఆటుపోట్లు, సమస్యలు, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ బంధాన్ని సరిగ్గా ఈదాలంటే భర్త, భార్య ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఒకరి అవసరాన్ని మరొకరు అర్ధం చేసుకొని ముందుకు సాగాలి. గొడవలు అయ్యే సమయంలో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆ గొడవలు పెద్దదిగా కాకుండా చూడాలి. అప్పుడే వివాహబంధం నిండు నూరేళ్లు కొనసాగుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, నిపుణుల సలహాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. బోల్డ్ స్కై తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications