Latest Updates
-
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
శృంగారం తర్వాత పురుషులు ఈ పనులు అస్సలే చేయొద్దు, మరేం చేయాలో తెలుసా?
ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ శృంగారం గురించి తెలిసి ఉండాలి. కొంత అవగాహన కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాంపత్యబంధానికి శృంగారం చాలా కీలకం. సెక్స్ లేని దాంపత్యం ఎక్కువ కాలం నిలవదు. అయితే చాలా మందికి సెక్స్ చేయడం గురించి తెలిసే ఉంటుంది.
కానీ శృంగారాన్ని సరిగ్గా ఆస్వాదించడం, భాగస్వామి భావాలు అర్థం చేసుకుని మెలగడం తెలిసి ఉండదు. శృంగారం అంటే కేవలం సంభోగం మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ అదొక్కటే కాదు. ముందు, ఆ తర్వాత చేయాల్సినవి చాలా ఉంటాయి. అసలు శృంగారం అయ్యాక పురుషులు ఏం చేయాలో, ఏం చేయకూడదో వాటి వల్ల భాగస్వామి ఎలా ఫీలవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారం అయ్యాక పురుషులు చేయకూడని పనులు:
శృంగారం అయిపోయాక వెంటనే నిద్రలోకి జారుకోవడం:
చాలా మంది పురుషులు చేసే తప్పు ఇది. సెక్స్ ద్వారా శరీరం అలసిపోతుంది. విశ్రాంతి కోరుకుంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. కానీ శృంగారం అలా అయిపోగానే ఇలా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కనెక్షన్ దెబ్బతింటుంది. సెక్స్ చేసిన తర్వాత కూడా భార్యను లేదా ప్రియురాలిని వాటేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, పొదిమిపట్టుకోవడం లాంటివి చేయాలి.
ఫోన్ చూడటం:
చేశామా అంటే చేసేశాం అన్నట్లుగా శృంగారం ఎప్పుడూ ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ మైమరిచిపోయి శృంగారాన్ని ఆస్వాదించాలి. లైంగిక చర్యలతో మత్తెక్కాలి. మంచి హీట్ సెషన్ తర్వాత వెంటనే పక్కకు పడుకుని ఫోన్ చూడటం లాంటివి చేయకూడదు. శృంగారానికి ముందు ఎంత కోరిక చూపిస్తున్నారో.. సెక్స్ అయ్యాక కూడా అలాగే వారితో సఖ్యత ఉండాలి.
ముట్టుకుంటే కసురుకోవడం:
కొంత మంది పురుషులు శృంగారం చేశాక ఇక భార్యకు దూరంగా జరిగి పక్కకు తిరిగి పడుకుంటారు. వాళ్లే చేయి వేసినా, కాలు వేసినా కసురుకుంటారు. పడుకోనివ్వమని గట్టిగా చెబుతుంటారు. శృంగారం అంటే సంభోగం ఒకటే కాదు. సంభోగం అయ్యాక అది అక్కడితో అయిపోదు అని గుర్తించాలి.
శృంగారం తర్వాత పురుషులు చేయాల్సిన పనులు:
మానసికంగా కనెక్ట్ కావాలి:
సెక్స్ సెషన్ అయిపోయాక ఇక అంతటితో అయిపోయిందని అనుకోవద్దు. భార్యను కౌగిలించుకోవాలి. ముద్దు పెట్టుకోవాలి. సంభోగం తర్వాత కూడా రొమాంటిక్ గానే ఉండాలి. అలాంటి మాటలు మాట్లాడాలి, అలాంటి జోకులు వేస్తుండాలి. పని అయిపోగానే పక్కకు తిరిగి పడుకోవడం మంచిది కాదు. దీని వల్ల సమస్యలు వస్తాయి.
మాట్లాడుకోవాలి:
శృంగారం తర్వాత అదే విషయం గురించి లేదా ఇతర విషయాల గురించి మాట్లాడుకోవాలి. వారి అవసరాలు, ఇష్టాలు, కోరికలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి మాటలు సెక్స్ తర్వాత కూడా అడుగుతున్నారంటే.. మీకు కేవలం సెక్స్ ఒక్కటే కాదు, తనను అన్నిరకాలుగా సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పినట్లు అవుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications