Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
గొడవ సమయంలో ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం..?
భార్యా భర్తల మద్య గొడవలు రావడం సహజం. జీవితంలో ఇద్దరూ కలిసి నడుస్తున్నప్పుడు గొడవ పడుతుండడం చాలా సాధారణ విషయం. కానీ గొడవలు అక్కడి తోనే ఆగిపోకుండా అవి మరింత పెరిగి ఇద్దరి మధ్య మరింత దూరాన్ని తీసుకొచ్చే ప్రమాదం వుంది. కోపం, గొడవలు కూడా తరువాత ఇద్దరినీ మరింత దగ్గరకి చేసేలా ఉండాలి. కానీ అవే గొడవల్లు ఇద్దరినీ విడదీసేలా మారవద్దు. సమస్యను పరిష్కరించడానికి ఇద్దరూ ప్రయత్నించాలి. వాదనలు పెరిగి అవి బంధాన్ని మరింత బలహీనంగా మార్చివేస్తాయ్. గొడవ జరిగినప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
తొందరపాటు వద్దు
గొడవలు జరిగిన సమయంలో వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ఇద్దరూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకరిపై ఒకరు వాదనలు చేసుకోవద్దు. సరైన సమయం కోసం చూసి అప్పుడు పార్ట్‌నర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. కోపంలో ఉన్నప్పుడు సరైన విషయాలు కూడా మనకు తప్పుగా కనిపిస్తాయ్. కాబట్టి కోపం తగ్గేవరకు కొంత ఓపిక పట్టడం భార్యా భర్తలిద్దరికీ మంచిది.
కాంప్రమైజ్
భార్యా భర్తలిద్దరూ ఒకరిని ఒకరు గొడవల్లో కూడా అర్థం చేసుకోగలగాలి. కోపంలో ఎంత అరుచుకున్నా, ఎన్ని మాటలన్నా తరువాత ఇద్దరూ కలిసిపోవాలి. గొడవలో తమ తప్పు ఉంది అని అనిపిస్తే.. ఆలోచించకుండా నాది తప్పు వుండు అని అంగీకరించాలి. పార్ట్‌నర్‌ది తప్పు వుంటే పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుపోవాలి.
వాదనలను పొడగించవద్దు
భార్యా భర్తల మధ్య గొడవ మొదలు కావడానికి చిన్న కారణం ఒకటి వుంటుంది. వారిద్దరి మధ్య గొడవ పదే పదే అదే కారణాన్ని పెద్దగా చూపి గొడవను మరింత తీవ్రంగా అయ్యేలా చేసుకోవద్దు. ఇది గొడవను మరింత పెద్దగా చేస్తుందే కాని గొడవను తగ్గించదు.

గతంలోని గొడవలను తీసుకురావద్దు
ఇద్దరి మధ్య గతంలో ఎన్నో గొడవలు జరిగి వుంటాయ. వాటిని తవ్వి గొడవ జరిగిన ప్రతీ సారి బయటకు తీసుకొని రావద్దు. జరిగిన విషయాలను మళ్లీ తీసుకురావడం వల్ల గొడవలు పెరుగుతాయే గానీ తగ్గవన్న వాస్తవాన్ని గ్రహించాలి.
అరవడం ఆపివేయాలి
గొడవలు జరుగుతున్నప్పుడు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోవడం చేయవద్దు. ఇలా అరవడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారిపోతుంది. ప్రశాంతమైన గొంతుతో సమస్యను పరిష్కిరంచేందుకు ప్రయత్నించాలి.
గొడవల మధ్యలో
ఇద్దరి మద్యలో గొడవ జరిగినప్పుడు మద్యలోకి ఇతర వ్యక్తులను తీసుకొని రావద్దు. భార్యా భర్తలు ఇద్దరు తామంతట తాము సమస్యను పరిష్కరించుకోవాలి. ఇద్దిరి మధ్య వచ్చిన సమస్యను సాధ్యమైనంత వరకు ఇద్దరు కలిసి మాత్రమే పరిష్కరించుకోవాలి.
డెడ్‌లైన్లు, హెచ్చరించడం వద్దు
గొడవల్లో కొందరు ఆలోచించకుండా తొందరపాటులో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటారు. కొంతమంది అల్టిమేటంను అప్పటికప్పుడే జారీ చేస్తారు. ఇక నువ్వు నాకంటే ఇష్టమే లేదు. ఇక నేను నీతో ఉండడానికి నాకు వీలు పడదు. ఇద్దరమూ విడిపోదాం. ఇక నాతో మాట్లాడవద్దు, ఇక నన్ను కలవవద్దు లాంటి డెడ్‌లైన్ వార్నింగ్‌లను పార్ట్‌నర్స్ ఇచ్చుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.
తగ్గాలి
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన మగాడు అని పవన్ కళ్యాన్ సినిమాలో డైలాగ్ మనకు తెలిసిందే. ఇదే డైలాగ్‌ను భార్యా భర్తలు గొడవ జరిగినప్పుడు ఆచరణలో పెట్టాలి. గొడవలో తమది తప్పు లేకున్నా కొంత తప్పు వుందని తగ్గాలి. గొడవను ఆపివేయడానికి ఎంత తగ్గినా అది ఇద్దరి రిలేషన్‌షిప్‌కు చాలా మంచిది.



Click it and Unblock the Notifications