Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ భార్యతో ఈ పనులు తప్పకుండా చేయండి.. చేయకపోతే గ్యాంరెంటీగా మీ బతుకు బస్టాండే బాసూ!
భార్య భర్తల బంధం ఎంతో అపురూపమైనది. భావోద్వేగాలకు నిలయమైన ఈ బంధానికి అన్ని బంధాలలో గొప్ప బంధంగా పేరుంది. ఇంతటి గొప్ప బంధాన్ని అనుభవించడంలో భార్య భర్తలు విఫలమవుతున్నారు. ఒకరిపై ప్రేమను ఇంకొకరిపై చూపలేకపోతున్నారు. తమ ఆఫీస్ పనులతో పాటు ఇంటి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. దీంతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, సాన్నిహిత్యం కూడా తగ్గిపోతుంటుంది. ఈ విషయాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇది విడాకుల వరకు కూడా దారి తీయొచ్చు.
అందుకే భాగస్వామితో బలమైన బంధాన్ని కొనసాగించాలంటే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. ప్రేమ చిగురించి చిన్న చిన్న మనస్పర్థలు కూడా దూరమైపోతాయి. ఇంతకీ భార్య భర్తలు చేయాల్సిన పనులు ఏంటంటే?

ఉదయాన్నే లేచి కబుర్లు చెప్పుకోవడం..
కార్పొరేట్ జీవితానికి అలవాటు పడి రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే ఆలస్యంగా లేవడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల భార్య, భర్తలిద్దరికీ ఒకరితో ఒకరికి మాట్లాడుకునే సమయం దొరకడం లేదు. దీని కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే భార్య భర్తలిద్దరూ ఉదయాన్నే లేచి కాఫీ లేదా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి. మీ ఆలోచనలు, లోపాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి.
అలాగే ఇద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పని భారం తగ్గడంతో పాటు ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అలాగే మానసికంగా దగ్గరవుతారు. గొడవలు చికాకులు కూడా దూరమవుతాయి.
ప్రేమను వ్యక్తపరచండి..
సాధారణంగా భార్య భర్తలకు ఒకరిపై ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పటికీ పని భారం కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారు. అలా చేయడం వల్ల దూరం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ప్రేమ బలపడదు. అందుకే అప్పుడప్పుడు మీ భార్యను, లేదా భర్తను ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం వంటివి చేస్తూ.. ప్రేమను వ్యక్తీకరించండి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ మీ భాగస్వామికి తెలుస్తుంది.
కృతజ్ఞతలు చెప్పుకోండి..
భార్య, భర్తల మధ్య బంధం బలంగా ఉండాలన్నా, బలపడాలన్నా చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలా మంచిది. భార్య చేసిన వంట బాగున్నా, భర్త ఏదైనా పనిలో సహాయం చేసినా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఆ బంధం బలపడుతుంది. తమ పనిని మెచ్చుకుంటున్నారని గౌరవం పెరగడంతో పాటు ఇష్టం కూడా పెరుగుతుంది.
కలిసి తినడం..
పని ఒత్తిడి, పిల్లల అల్లరి కారణంగా భార్య భర్తలు కలిసి తినలేకపోతున్నారు. ఇలా ఉంటే కచ్చితంగా భార్య భర్తల మధ్య దూరం అనేది పెరుగుతుంది. ఉదయం సమయం దొరకకపోయినా రాత్రి వేళ అయినా భార్య, భర్తలిద్దరూ కలిసి భోజనం చేయాలి. వీలైతే ఒకరిని ఒకరు తినిపించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరూ మంచి సమయాన్ని గడిపినట్లు అవడంతో పాటు, బంధం కూడా బలపడుతుంది. అలాగే ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నట్లు అవుతుంది.
ఫోన్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి..
ఈ టెక్నాలజీ ప్రపంచంలో అయితే ఫోన్ లేకపోతే ల్యాప్‌టాప్ అన్న చందంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దీని కారణంగా భార్య, భర్తల మధ్య దూరం పెరగడంతో పాటు ప్రేమ కూడా తగ్గిపోతుంది. అందుకే మీకు దొరికే కొంత సమయంలోనైనా ఫోన్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి. మీ భాగస్వామితో అమూల్యమైన సమస్యలన్నీ గడపండి. వారితో ఆటలు ఆడండి, పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా మీ వివాహబంధం బలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications