Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అల్లు అర్జున్ భార్య నిజంగా గ్రేట్.. భార్యలందరూ ఇది కచ్చితంగా నేర్చుకోవాలి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతికి అల్లు అర్జున్‌ను బాధ్యులను చేస్తూ.. పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను చంచల్ గూడా జైలుకు కూడా తరలించారు. ఇలాంటి కష్ట సమయంలోనూ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి వ్యవహరించిన తీరు అత్యంత గర్వించదగినదిగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యవహరించిన తీరు, భర్త అరెస్ట్ అయినా ఆమె పాటించిన విధానాలు గొప్పవిగా చెప్పుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భర్త మాట వింటూనే
వివాహ బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి గౌరవంతో పాటు నమ్మకం అనేది కచ్చితంగా ఉండాలి. అయితే వివాహ బంధంలో భార్యలు తమ భర్తలు చెప్పే విషయాలను గౌరవిస్తూనే, భర్తను ఆపద అని అనిపించే విషయాలపై కఠినంగా వ్యవహరించాలి. వీలైతే అలాంటి విషయాలపై పోరాడాలి. ఒకవేళ భర్త తప్పు అని తేలితే కచ్చితంగా భర్తను మందలించాలి. ఎదిరించాలి.

భర్త తప్పు లేదని తెలిసినప్పుడు కచ్చితంగా సమాజాన్ని లేదా ప్రభుత్వాన్ని వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. కుటుంబాన్ని ముందుకు నెట్టుకెళ్ళాలి. సమాజంలో తన భర్త గుర్తింపు తగ్గకుండా, తమ కుటుంబ విలువలు పడిపోకుండా వ్యవహరించాలి. పిల్లలకు తమ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని, నిజాయితీగా ఉన్నదంటూ వివరించాలి. ఇలాంటివన్నీ ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అవగానే స్నేహ రెడ్డి చేశారని చెప్పుకోవచ్చు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే స్నేహరెడ్డితో మాట్లాడడం, ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్లడం, అలాగే తన కుటుంబానికి మద్దతుగా నిలబడు చెప్పడం మనకు తెలుస్తూనే ఉంది. ఆ విధంగానే స్నేహా రెడ్డి సైతం ఎలాంటి భావోద్వేగాలకు లోనవకుండా చాలా పరిపక్వతతో ఆలోచిస్తూ ఇలాంటి కష్ట సమయాల్లో కూడా తోడుగా నిలిచారు. దీనికి నిజంగా గర్వించదగిన విషయం అని చెప్పుకోవచ్చు.
ఆర్థికంగా కూడా
ఈ కాలంలో మహిళలు వంట గదికి మాత్రమే పరిమితం కావడం లేదు. భర్తతో పాటు సమానంగా డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాదిరిగా కాకుండా ఆర్ధిక కష్టాల్లో ఉన్న భర్తలకు భార్యలు తోడుగా నిలవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. భర్తల వ్యాపారంలో తమ సహాయసహకారాలు అందించడం, భర్తతో పాటు కొంత ఉద్యోగం చేస్తూ భర్తకు ఆర్థికంగా సహాయం చేయడం వంటివి చేయాలి.
అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. తన భార్య స్నేహ రెడ్డి మాత్రం వేరే వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఆ సంపాదనతో భర్తకు తోడవుతూ.. తమ ఆర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. అదే విధంగా ఇతర మహిళలు సైతం భర్త ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా తోడుగా నిలవాలి. వారికి ఆర్థికంగా సహాయపడాలి.



Click it and Unblock the Notifications