Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ లైఫ్ పార్ట్‌నర్‌కు సారీ చెప్పాలా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు
దంపతుల మధ్య గొడవలు సహజం. దాంపత్య బంధంలో ఎప్పడో ఒకప్పుడు, ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. కలహాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ గొడవలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. అయితే ఒక్కోసారి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పు చేయవచ్చు.

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ అడగాల్సిందే. అయితే లైఫ్ పార్ట్‌నర్‌ను క్షమాపణ అడిగేటప్పుడు ఏదో అలా సారీ అని చెప్పేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు క్షమాపణ ఎలా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వరాన్ని సరి చేసుకోవాలి:
క్షమాపణ చెప్పే ముందు స్వరాన్ని తగ్గించి, మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. గంభీరంగా, కటువుగా క్షమాపణ చెబితే అది స్వీకరించే వారి మనసును కరిగించలేదు. అందుకే స్వరాన్ని తగ్గించి క్షమాపణ అడగాలి.
చెప్పేది శ్రద్ధగా వినాలి:
భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు ఏదైనా చెబుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా ఉంటే ఎదుటివారు హర్ట్ అవుతారు. కాబట్టి వారు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్నట్లు వారికి అనిపించేలా చేయాలి.
క్షమాపణల మెసేజ్ ను తయారు చేసుకోవాలి:
సారీ.. ఏదైనా గొడవ అయిన తర్వాత మీరు తప్పు చేసినట్లు మీకు అనిపించినా, అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని రియలైజ్ అయినా.. జస్ట్ అలా సారీ అనే ఒక్క పదం చెబితే సరిపోదు. సారీ అనడంతో పాటు మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టాలి. ఆ తప్పును ఎలా రియలైజ్ అయ్యానో చెప్పి సారీ చెబితే.. ఆ సారీకి విలువ పెరుగుతుంది.
సూటిగా, సుత్తి లేకుండా:
సారీ.. చెబుతున్నప్పుడు అందుకు దారి తీసిన కారణాలు కూడా చెప్పాలి. అది కూడా సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలి. మీరేం చేశారు, చేసిన తర్వాత ఎలా తప్పు అని గ్రహించారు, ఆ తప్పు నుంచి ఎలా పాశ్చాత్తాపం పొందారో సూటిగా చెప్పేసి సారీ అడగాలి.
క్షమాపణలు చర్చకు దారి తీయకూడదు:
క్షమాపణలు చెబుతున్నప్పుడు అక్కడి వరకే పరిమితం కావాలి. మళ్లీ అదే అంశంపై మరోసారి చర్చకు దారి తీయకూడదు. ఇది అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. సారీ చెప్పాలనుకున్నప్పుడు సారీ చెప్పేసి అలా చేయడం తప్పని, ఆ తప్పును తర్యాత రియలైజ్ అయ్యానని చెప్పి సారీ అడగాలి. అంతే కానీ మరోసారి గతం తవ్వుతూ చర్చ మొదలు పెట్టకూడదు.



Click it and Unblock the Notifications