Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సెక్స్‌లో ఈ పనులు అంటే స్త్రీలకు ఏమాత్రం ఇష్టముండదు, అవేంటో తెలుసా?
శృంగారం అనుభవించాలని చాలా మంది కోరుకుంటారు. సెక్స్ లో అద్వితీయమైన అనుభూతి కావాలనుకుంటారు. శృంగారంలో పురుషులకు, స్త్రీలు సమానంగా పాల్గొనాలి. ప్రతి విషయాన్ని ఇద్దరూ కలిసి ఆస్వాదించినప్పుడు సెక్స్ లోని మధురమైన అనుభూతి తెలుస్తుంది. పడగ్గదిలో స్త్రీలను సంతృప్తి పరచడం, సుఖపెట్టడం అంత సులభమేమీ కాదు. మహిళలను ఉద్రేక పరిచి, సంతృప్తి పెట్టాలంటే చెమటోడ్చాల్సిందే. అలాగే వారికి ఇష్టమైన వాటిని, కోరికలను, అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి. వారికి ఇష్టమైన పనులు చేయడంతో పాటు ఇష్టంలేని వాటిని దూరం పెట్టాలి. అయితే శృంగారంలో స్త్రీలకు నచ్చని ఆ అంశాలేంటో తెలుసుకోవడం ముఖ్యం.

ఆ ఒక్కటి తప్పకుండా ఉండాల్సిందే:
ఫోర్ ప్లే అనేది లైంగిక ఉద్రిక్తతను పెంచడానికి, సాన్నిహిత్యాన్ని పెంచి ఉద్రేకాన్ని కలగజేయడానికి ఫోర్ ప్లే ఉండాల్సిందే. అసలు కార్యం మొదలుపెట్టడానికి ముందు ఈ కొసరు కార్యం ఉంటేనే శృంగారంలోని అనుభూతి తెలుస్తుంది. సంభోగం ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా ఫోర్ ప్లే ఉండాలి. దీని వల్ల స్త్రీలలో కోరికలు రగులుతాయి. యోనిలో తడి మొదలై సంభోగం సాఫీగా, ఆనందంగా సాగుతుంది. ఒకవేళ ఫోర్ ప్లే మొత్తానికి లేకపోవడం, లేదంటో కొత్త మొత్తంలో ఉండటం అనేది స్త్రీలకు ఏమాత్రం నచ్చని విషయం.
అవాస్తవంగా ఉండే కోరికలు:
చాలా మంది పురుషులు పోర్న్ చూసి నిజమైన శృంగారంలో కూడా అలాగే ఉంటుందని, అలా ఉండాలని కోరుకుంటారు. కానీ పోర్న్ వీడియోలకు నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. అందులో చేసినట్లు మహిళలు ప్రవర్తించాలని, అలాంటి శృంగార భంగిమలు కావాలని, అలాంటి చర్యలు చేయాలని పురుషులు కోరుకోవడం స్త్రీలకు ఏమాత్రం నచ్చదు. కోరికలు ఉండాలి కానీ వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
పరధ్యానంగా ఉండటం:
శృంగారం అంటే శారీరకంగా, మానసికంగా ఆస్వాదించాల్సిన అద్భుతమైన కార్యం. రెండు శరీరాలు పెనవేసుకుపోయి మానసికంగా కూడా దగ్గరైపోవడమే శృంగారం. మెత్తని ఒత్తిళ్లతో మైమరిచిపోయి స్వర్గపు అంచుల వరకు వెళ్లి రావడం. అయితే పరధ్యానంగా సెక్స్ చేయడం, లేదా ఎవరినో ఊహించుకుంటా భార్యతో శృంగారం చేయడం మహిళలకు ఏమాత్రం నచ్చదు. అలాగ సెక్స్ సమయంలో ఇతర స్త్రీల పేర్లను పలవరించడం కూడా మహిళలు సహించలేరు.
పరిశుభ్రత పాటించకపోవడం:
పడగ్గదిలో స్త్రీ, పురుషులు ఇద్దరు చాలా సౌకర్యంగా ఉంటేనే శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. సౌకర్యంగా ఉండటానికి పరిశుభ్రత చాలా కీలకం. చెమట వాసన, జననేంద్రియాల వద్ద వెంట్రుకలతో కూడిన అపరిశుభ్రత, నోటి దుర్వాసన లాంటి అపరిశుభ్రత వల్ల ఏమాత్రం సౌకర్యంగా ఉండదు. ఇది స్త్రీలకు ఏమాత్రం నచ్చదు.
ఆత్మవిశ్వాసం లేకపోవడం:
శృంగార సమయంలో పురుషులు ఆత్మవిశ్వాసంతో పని తీరు కనబరచాలని స్త్రీలు కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం లేని పురుషుల పనితీరును మహిళలు ఏమాత్రం ఇష్టపడరు. నమ్మకంతో కూడిన లైంగిక చర్య, ఆత్మవిశ్వాసంతో కూడిన శృంగారాన్నే స్త్రీలు బాగా ఇష్టపడతారు.
కమ్యూనికేషన్ లేకపోవడం:
సంబంధంలో కమ్యూనికేషన్ చాలా కీలకం. శృంగారంలో కూడా ఇద్దరు భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మాటల రూపంలోనో, చేతల రూపంలోనో లేక సంకేతాల రూపంలోనో భాగస్వామితో కమ్యూనికేట్ చేయాలి. మన అవసరాలు, కోరికలు, ఆశలు, ఫాంటసీల గురించి చెప్పగలగాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications