Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టారా..? అయితే ఈ విషయాలను మరిచిపోవద్దు..!
రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టిన తరువాత గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే లాంటి పాట ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడూ కలగని ఆనంతో రిలేషన్‌షిప్‌లో వున్నప్పుడు కలుగుతుంది. అప్పుడు అంతా కొత్త కొత్తగా వున్నది, స్వర్గం ఇక్కడే అన్నది' పాట లాగా వుంటుంది. ఎంత కొత్తగా, వింతగా, ఆనందంగా, తియ్యని మత్తుగా వున్నా ఇద్దరూ అప్రమత్తంగా వుండటం చాలా ముఖ్యం.
బంధంలో వున్నప్పుడు ముందుజాగ్రత్తపడితేనే తరువాత సమస్య పెద్దగా అవకుండా జాగ్రత్తపడతారు. లేదంటే బంధం పూర్తిగా బ్రేక్ అవుతుంది. కొత్తగా రిలేషన్‌షిప్‌లో వున్నవారు ఆచీతూచీ అడుగువెయ్యాలి. భార్యా భర్తలుగా ఇద్దరూ రిలేషన్‌షిప్‌ను ప్రారంభించినా లేదా ప్రేమికులుగా ఇద్దరూ ప్రయాణం స్టార్ట్ చేసినా కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు.

రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టినప్పుడు మీ ఆలోచనలను, ఎమోషన్స్‌ను వేరు వేరుగా బ్యాలెన్స్ చేయాలి. మీకు కలిగే భావోద్వేగాలను కూడా గమనిస్తూ వుండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు. గతంలో మీరు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. ఎప్పుడు ఏమి చేస్తున్నారో కూడా గమనించాలి. మీ రిలేషన్‌షిప్ ఏ దారిలో వెళ్తుంది, ఆరోగ్యకరంగా వుందా, లేదా భవిష్యత్తులో పెద్ద సమస్యలను తెచ్చిపెడుతాందా అని ఆలోచించుకువాలి.
బంధంలో ఇద్దరూ అడుగుపెట్టినప్పుడు ఒకరి గరించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పార్ట్‌నర్ ఫ్రెండ్ సర్కిల్‌ను బట్టి మీ పార్ట్‌నర్ వ్యక్తిత్వాన్ని మీరు అంచనా వేయవచ్చు. పార్ట్‌నర్‌ను స్నేహితులకు పరిచయం చేయడం చేస్తుండాలి. మీమధ్యలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి స్నేహితులు సాయపడతారు.
భార్యా భర్తలు, ప్రేమికులు, పార్ట్‌నర్స్ మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే ఈ గొడవలు ఎక్కువ కాలం వుండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరిగి, అన్నే ఎక్కువ సార్లు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నా రిలేషన్‌షిప్ బలహీనంగా వున్నట్టే. అసలు గొడవలే రాకుండా వుండడం ఉత్తమం.

రిలేషన్‌షిప్ ప్రారంభంలో తమకు సంబంధించిన అన్ని విషయాలను పార్ట్‌నర్‌కు చెప్పేస్తుంటారు. ఎలాంటి రహస్యాలను కూడా తమ దగ్గర పెట్టుకోరు. మొదట్లో బాగానే వున్నా రోజులు గడుస్తున్న కొద్దీ రిలేషన్‌షిప్‌లో సమస్యలు క్రమంగా పెరిగి పెద్ద తలనొప్పిగా మారుతుంటాయ్. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బంధువులు, శ్రేయోభిలాషులను ఆశ్రయించి కొంత సహాయాన్ని తీసుకోవాలి.
రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే ఈ మధ్య అదొక పెద్ద ఛాలెంజ్‌గా మారిపోయింది. ఇప్పుడు చాలా సంబంధాల్లో కొన్ని రోజుల్లోనే తీవ్రమైన గొడవలు వస్తున్నాయ్. దీనిని హ్యాండిల్ చేయడం కొన్ని సార్లు అసంభవం అనిపిస్తుంది. రిలేషన్‌షిప్ బలంగా మారడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు గొడవలు మరింత పెద్దగా కాకుండా జాగ్రత్తపడాలి. కొంచం ఓపికపడితే రిలేషన్‌షిప్‌లో వున్న గొడవలన్నీ సర్దుకుపోతాయ్.
మీ పార్ట్‌నర్‌ను ఇతరులతో పోల్చుకోవడం ఆపివేయాలి. ఇది ఇద్దరిలో తీవ్రమైన గొడవలకు దారి తీస్తుంది. ఎందుకంటే గతంలో వున్న ప్రేమ, గతంలో వున్న రిలేషన్‌షిప్ ఎప్పుడూ చేదుగా, గాయాలతోనే వుంటుంది. అలాంటి వాటిని మళ్లీ కొత్త రిలేషన్‌షిప్‌లో గుర్తు చేయడం, వారిని ప్రస్తుత పార్ట్‌నర్‌తో పోల్చడం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications