Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రొమాన్స్ చేసే ముందు కచ్చితంగా ఈ పనులు చేయాలి.. అప్పుడే అది సాధ్యం అవుతుంది? ఆ పనులు ఏంటంటే?
దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలన్నా, వారి మధ్య ప్రేమ ఇంకా బలపడాలన్నా రొమాన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం శరీరకంగానే కాదు మానసికంగానూ బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిపనికి ముందు ప్రిపరేషన్ లాగానే.. కార్యానికి ముందు కూడా రొమాన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే ఇంకా కొంతం సమయం ఎంజాయ్ చేయడంతో పాటు ఇద్దరికీ సంతృప్తికరంగా ఉంటుంది. అయితే ఈ రొమాన్స్ చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శుభ్రంగా ఉండడం..
సాధారణంగా దంపతులు సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే ఈ కార్యక్రమానికి పూనుకుంటారు. అయితే రోజంతా అలిసిపోయిన శరీరం, చెమటలతో నిండియున్న బాడీతో కాకుండా శుభ్రంగా స్నానం చేసి ఉంటే ఇంకా మంచిది. దీనివల్ల మీ భాగస్వామి మీకు ఇంకా దగ్గరవుతారు. అలాగే రొమాన్స్‌ను ఆ దంపతులిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు.

నోటి దుర్వాసన లేకుండా ఉండడం..
చాలా మంది పట్టించుకోని విషయం ఏంటంటే నోటి దుర్వాసన విషయం. రొమాన్స్‌లో ఇది చాలా ముఖ్యమైనది. మీ నోటి నుంచి దుర్వాసన వస్తున్నట్లైతే మీరు మీ భాగస్వామి దగ్గరికి వెళ్ళలేరు. అలాగే మీ భాగస్వామి మీతో దగ్గరా మూవ్ అయ్యేందుకు కూడా అనుకూలించరు. అందుకే ముందుగానే నోటి దుర్వాసన సమస్యలను దూరం చేసుకోండి. ఉల్లిపాయ వంటివి తిన్నప్పుడు అది ఇంకాస్త ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగానే తగిన తగిన ఉపాయంతో వెళ్తే మంచిది.
రూమ్ చాలా ముఖ్యం..
భార్య భర్తలు ఉండే గది చాలా శుభ్రంగా, అందంగా ఉండడం చాలా ముఖ్యం. అలా ఉంటేనే భార్య భర్తలకు ఒక చక్కటి అనుభూతి మిగులుతుంది. పడక గదిలో మంచి రంగులు ఉండడంతో పాటు బెడ్ షీట్ నీటిగా ఉండాలి. అలాగే రూమ్‌లో మంచి సువాసన వచ్చేందుకు మంచి వాసన వచ్చే రూమ్ ఫ్రెషనర్‌ను వాడాలి. ఆ గదిలో పూలు ఉంటే ఇంకా మంచిది. దీంతో దానికదే మూడ్ చేంజ్ అవడంతో పాటు దంపతులు ఇద్దరూ ఎంచక్కా తమ పనిని ఆస్వాదించగలుగుతారు.
ఎదుటివారికి ఇష్టం లేకపోతే?..
శృంగారం అనేది ఇద్దరు అనుకోని, ఇద్దరికీ ఇష్టమైతేనే చేయాలి. ఒకరికి ఇష్టం లేకపోయినా దానిని అనుభవించలేము. అందుకే మీ భాగస్వామితో మీరు శృంగారంలో పాల్గొననుకుంటే తప్పనిసరిగా వారి అనుమతితోనే పాల్గొనాలి. అలా కాదని వారితో బలవంతపు శృగారం చేయడం అంత మంచిది కాదు. వారికి కాస్త సమయం ఇచ్చి.. వారికి ఇష్టమైనప్పుడు చేస్తే దంపతులిద్దరూ మంచిగా ఆస్వాదించవచ్చు.
చివరిగా ఇది ఒకటి..
శృంగారం చేయాలంటే ఇవన్నీ చేయాలా? ఎప్పుడు చేయాలి అని బద్దకంగా ఉంటే మాత్రం అస్సలు పని అవ్వదు. ఎందుకంటే వీటన్నిటినీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చేస్తేనే శృంగారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు. శృగారమనేది ఇద్దరూ ఇలా ఎంజాయ్ చేస్తూ, రొమాన్స్ చేస్తూ చేస్తేనే బాగుటుంది. మీ భాగస్వామికి కూడా ఆనందంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన కొన్ని సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. దీనిని విశ్వసించడం పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications