Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
డేటింగ్ యాప్‌లో ఎక్కువగా ఆ వయసు వాళ్ళే ఉన్నారట, ట్రై చేస్తే వారినే ట్రై చేయాలి!
కాలం మారుతున్న కొద్దీ ప్రేమించుకునే విధానం కూడా మారుతుంది. ఇటీవల కాలంలో ప్రేమకు కొత్త కొత్త అర్థాలు వస్తున్నాయి. డేటింగ్ అని, సిచ్య్వేషన్‌షిప్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు. ఇందులో ముఖ్యమైనది డేటింగ్. ఇది ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకునే ప్రక్రియ. ఈ ప్రాసెస్ ద్వారా ఒకరిపై ఇంకొకరిపై అనుకూలత ఉందా లేదా, భవిష్యత్తులో గట్టి సంబంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. సాధారణంగా, డేటింగ్‌లో భాగమైన ఇద్దరు వ్యక్తులు కలసి సమయం గడుపుతారు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. అయితే ఈ డేటింగ్‌లో ఎవరు ఎక్కువగా పాల్గొంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డేటింగ్‌లో ఎవరు ఎక్కువగా ఉంటున్నారంటే?
డేటింగ్ చేసే ప్రక్రియలో వ్యక్తులు తమ గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. తమ బలాలు మరియు బలహీనతలను గుర్తించవచ్చు. అలాగే తమ ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది వారి వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇతరులతో సానుభూతితో మాట్లాడటం, శ్రద్ధగా వినడం, సామాజిక నైపుణ్యాలను పెంచుకోవడం వంటి విషయాల్లో ఇది సహాయం చేస్తుంది.

సంబంధాలు మన జీవితంలో సంతోషం, సంతృప్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. ఇంకా, ఇది భవిష్యత్తులో స్థిరమైన సంబంధం ఏర్పడే అవకాశాలను పెంచేలా సహాయపడుతుంది. మన వ్యక్తిగత ఆసక్తులను పరిగణనలోకి తీసుకుని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇది ప్రోత్సహిస్తుంది.
అయితే, తాజాగా కొన్ని డేటింగ్ యాప్‌లపై చేసిన సర్వేలో, మిడిల్ ఏజ్ పురుషులు 45 నుంచి 55 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇందులో, కొందరు వ్యక్తులు ఒకరికంటే ఎక్కువ మందితో డేటింగ్ చేస్తూ, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, కొంతమంది బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ మోసం చేస్తున్నారని తేలింది. అందువల్ల, డేటింగ్ యాప్‌లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications