Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పెళ్లికి ముందు శృంగారం గురించి మాట్లాడుకోండి, ఎందుకో తెలుసా?
చాలా మంది దంపతులు శృంగార సమస్యలు ఎదుర్కొంటారు. ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతారు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవడం, ఒకరి ఇష్టాలను మరొకరు ఇష్టపడకపోవడం, భంగిమల విషయంలో వేర్వేరు కోరికలు, ఒకరికి ఎక్కువ కోరికలు ఉండటం మరొకరికి తక్కువ ఉండటం.. ఇలా చాలానే శృంగారం సమస్యలు రావొచ్చు.
సెక్స్‌ను చూసే ధోరణిలో తేడాలు, పూర్తిగా భిన్నమైన కోరికలు లాంటి వాటితో సమస్యలు రావొచ్చు. అందుకే పెళ్లికి ముందే కాబోయే జీవిత భాగస్వామితో శృంగారపరమైన విషయాల గురించి మాట్లాడుకోవాలని సూచిస్తారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. పెళ్లి కాకముందే శృంగారం గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వారి ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి:
శృంగారంలో ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకుని నడుచుకోవాలి. దీని వల్ల ఇద్దరూ ఆనందంగా సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. ఒకరికి ఇష్టమైనవి మరొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి ఏది ఇష్టమో ఏది ఇష్టంలేదో తెలుసుకోవాలంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
మీ గురించి చెప్పాలి:
సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తులు అనుభవించాల్సిన ఆనందం. ఒక్కరే తమ ఇష్టమొచ్చినట్లుగా శృంగారం చేస్తూ పోతే దాంట్లో అసలైన సంతృప్తి మిస్ అవుతుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించినా, ప్రయోగాలు చేయాలనిపించినా ముందుగా భాగస్వామికి చెప్పి ఒప్పించి తర్వాతే ప్రొసీడ్ కావాలి. కోరికలు, అవసరాలు, సౌకర్యాల గురించి ఇద్దరూ పారదర్శకంగా మాట్లాడుకోవాలి.
ఇతర విషయాలు:
ఇద్దరికీ ఇష్టమైతే శృంగారానికి మించి ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. గత అనుభవాలు, వాటి నుండి అలవర్చుకున్న విషయాలు చర్చించడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇతర ఇబ్బందికర విషయాల గురించి సున్నితంగా మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో దాని వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
కంప్యాషన్:
జంటల మధ్య తప్పనిసరిగా కమ్యూనికేషన్ ఉండాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే అవమానం, అపార్థం లాంటి సమస్యలు తలెత్తవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications