Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భార్యా భర్తలు ఇవి పాటిస్తే.. ప్రతి రోజూ సంతోషంగా గడిచిపోతుంది..!
పెళ్లంటే ఒక ప్యాకేజ్. పెళ్లిలో వచ్చేది కేవలం భార్యా భర్త మాత్రమే కాదు. వారి కుటుంబాలు కూడా వస్తాయ్. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని తప్పక అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే వారే మగవారి కుటుంబంలోకి వెళ్తారు కాబట్టి. ఎన్ని సమస్యలు వచ్చినా భరించే శక్తి సామర్ధ్యాన్ని కలిగి వుండాలి. నేనెందుకు భరించాలి లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. పెళ్లంటే ఒక బాధ్యత అన్న విషయాన్ని మరవవద్దు. పెళ్లి లేకపోతే విచ్చల విఢిగా బ్రతికేయవచ్చు. కాబట్టి పెళ్లి తరువాత ఈ విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇద్దరూ వేరే సంస్కృతుల నుంచి వచ్చామన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వాళ్ల ఆచార వ్యవహారాలు వేరుగా వుంటాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా విషయాలపై ఇద్దరికీ చాలా భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. ఒకరు డబ్బును అప్పటికప్పుడే ఖర్చు పెడతారు, మరొకరు డబ్బును భవిష్యతు కోసం దాచాలనుకుంటారు. ఒకరు వేడిగా తింటారు, మరొకరు చల్లారిన తరువాతే తింటారు. కొంత మంది రెండు పూటలా స్నానం చేస్తారు. ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో వుండాలంటే వీటన్నింటినీ అంగీకరించి సర్దుకుపోవాలి.
మీ పార్ట్‌నర్‌కు మీరు ఎలాంటి ఎమోషన్‌ను ఇస్తున్నారో చెక్ చేసుకోవాలి. మాడుపు మొహం వేసుకొని సంబంధాలు మరించ చెడిపోతాయ్ కానీ మంచి మార్పు రాదు. మన బాధ వారిపై చూపిస్తే వారికి వున్న బలాన్ని కూడా పోగొట్టిన వారమౌతాము. వారు మనకు ఏమి ఇస్తున్నారనే కాకకుండా మనము వారికేమిస్తున్నారనే విషయాన్ని కూడా చూడాలి. రిలేషన్‌షిప్‌లో ఎదుటి వ్యక్తిని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి.

మనకున్న అలవాట్లను అతిగా వారిపైన రుద్దవద్దు. ఇద్దరి మధ్యలో కమ్యునికేషన్ చాలా ముఖ్యం. ఏమీ మాట్లాడకుండా వారిని అర్ధం చేసుకోవాలనే ఆలోచన సరికాదు. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవకు సంబంధించి మాత్రమే మాట్లాడుకోవాలి. అలా కాకుండా వారి క్యారెక్టర్, బిహేవియర్, ప్రవర్తనను జడ్జ్ చేయడం వల్ల గొడవ మరింత పెద్దగా అవుతుంది. గొడవ జరిగినప్పుడు పార్ట్‌నర్‌ను వేరే వాళ్లతో పోల్చడం కూడా సరికాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిలో ప్రేమ గౌరవం చాలా ముఖ్యమైన విషయాలు. అప్పుడప్పుడూ పార్ట్‌నర్‌ను ఎంకరేజ్ చేస్తూ వుండాలి. మోటివేట్ చేస్తూ వుండాలి. ఇది పార్ట్‌నర్ తప్పకుండా చేయాల్సిన పని. ఇది ఇద్దరి మధ్యలో పాజిటివ్ ఫీలింగ్సను కూడా క్రియేట్ చేస్తుంది. గొడవలో ఒకవేళ మీ తప్పు వుంటే క్షమాపణ చెప్పడానికి వెనకాడవద్దు.
రిలేషన్‌షిప్ బాగుండాలంటే ఎఫర్ట్ పెట్టాలి. పెళ్లి అనేది చాలా లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌గా చూడాలి. రిలేషన్‌షిప్ బాగుండడానికి రోజు కొంత కష్టపడాలి. వారి వంతు ఏదో ఒక పనిచేయాలి. గొడవలు రాకుండా చేసుకోవాలి. తప్పు వుంటే క్షమించాలి, క్షమాపణ చెప్పాలి. ఇద్దరూ కలిసి వాకింగ్‌కు వెళ్లడం, సినిమాకు వెళ్లడం, షాపింగ్‌కు వెళ్లడం లాంటి పనులు చేయాలి. భవిష్యత్తు గురించి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి. సమయం కుదిరినప్పుడు ఓటింగ్, ట్రిప్స్‌కు వెళ్లాలి.
పార్ట్‌నర్‌కు అర్ధం చేసుకునే మనస్తత్వం వుండాలి. ఓపిక కూడా చాలా ముఖ్యం. చిన్న గొడవలు వస్తే విడిపోవడానికి, సంబంధాలను తెంచుకోవడానికి ఇది తాత్కాలిక బంధం కాదని పార్ట్‌నర్స్ గ్రహించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పైవాటినన్నింటినీ ఫాలో అయినప్పుడు ఆ పార్ట్‌నర్స్ సుఖంగా సంతోషంగా వుండగలుగుతారు.



Click it and Unblock the Notifications