Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అరేంజ్డ్ మ్యారేజ్‌లో సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలా?
ప్రేమ వివాహంలో ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు కలిసి ప్రేమ ఊసులు ఆడుకోవడం వల్ల వారి మనస్తత్వం, వ్యక్తిత్వం గురించి అవగాహన ఉంటుంది. కానీ ఈ వెసులుబాటు అరేంజ్డ్ మ్యారేజ్ లో ఉండదు. పూర్తిగా కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఒక వ్యక్తిపై ప్రేమ, నమ్మకం, సౌకర్యం ఏర్పడటానికి కొన్ని రోజుల సమయం కావాల్సి ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లో అది ఉండదు.
పెద్దలు పెళ్లి కుదర్చడం భారత దేశంతో పాటు చాలా దేశాల్లో పాటించే సాంస్కృతిక ప్రమాణం. భారత్‌లో ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజులే జరుగుతుంటాయి. ఒక వ్యక్తిని చూసి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం అసాధ్యం. వ్యక్తిని చూసీ చూడగానే జీవితాంతం కలిగి ఉండే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం అంటే మాటలు కాదు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఒకరు మీకు సరైన వారో కాదో.. వారితో జీవితం పంచుకోవడం సాధ్యమవుతుందో లేదో తెలుసుకోవడానికి రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని చిట్కాలు సూచించారు. వాటి ద్వారా సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి:
అన్నింటికి కంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ విలువ, లక్ష్యాలు, ఇష్టాయిష్టాలు, ఆచారాలు, సౌకర్యాలు ఇలా చాలా అంశాలపై స్పష్టమైన వైఖరితో ఉండాలి. మీ గురించి మీకు స్పష్టంగా తెలిస్తే మీకేం కావాలో తెలుస్తుంది.
2. కమ్యూనికేషన్:
పెద్దలు కుదిర్చే పెళ్లి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. ఆ సమయంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ చాలా కీలకం. ఎదుటివారి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మంచి కమ్యూనికేషన్ వల్ల ఎదుటివారికి ఇబ్బంది పెట్టకుండానే చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
3. పర్సనాలిటీ కాకుండా క్యారెక్టర్ చూడాలి:
శారీరక ఆకర్షణ తప్పకుండా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా దంపతుల మధ్యలో శారీరక ఆకర్షణ చూడాల్సిందే. అయితే అదే ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి. మంచి వ్యక్తిత్వం ఉన్న వారితోనే జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు. నిజాయితీ, గౌరవం, దయ వంటివి ఉన్న వారితో జీవితం సుఖంగా, ఆనందంగా ఉంటుంది.
4. భాగస్వామి ఆసక్తులు, విలువలు:
బంధాన్ని బలోపేతం చేయడానికి, మరింత సంతృప్తికరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి భాగస్వామి ఆసక్తులు, అభిరుచులు తెలుసుకోవాలి. సంబంధం మొదట్లోనే కాబోయే భాగస్వామితో విలువ గురించి చర్చించడం వల్ల భవిష్యత్తులో విభేదాలు, అపార్థాలు లేకుండా చూసుకోవచ్చు. మత విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలు, సాంస్కృతిక నేపథ్యం గురించి తెలుసుకోవాలి.
5. జీవిత లక్ష్యాలు:
లక్ష్యాలు, ఆశయాల గురించి ముందుగానే చర్చించడం ద్వారా కాబోయే జీవిత భాగస్వామిని మానసికంగా సిద్ధం చేయవచ్చు. లక్ష్యాల గురించి చెప్పుకోవడం ద్వారా లక్ష్య సాధనలో వారి నుండి సహాయం పొందే వీలు ఉంటుంది.
6. సమయాన్ని వెచ్చించాలి:
ఏ నిర్ణయం కూడా తొందరపడి తీసుకోవద్దు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఓపికగా ఉండాలి. తరచూ కలవడం, మాట్లాడుకోవడం ద్వారా కాబోయే వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
