Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హలో జెంట్స్! ఈ చిట్కాలతో మహిళల్లో ఉద్రేకం పెంచవచ్చు
దాంపత్యబంధంలో స్త్రీ, పురుషులు ఇద్దరిదీ కీలక పాత్ర. శృంగార విషయానికి వస్తే ఇది మరింత స్పష్టంగా ఇద్దరిదీ సమాన పాత్ర అని చెబుతుంది. చాలా మంది సెక్స్ అనగానే అది పురుషులకు సంబంధించిన అంశం అనుకుంటారు. వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తప్పుగా అనుకుంటారు. ఇలాంటి తప్పుడు అభిప్రాయం వల్లే స్త్రీల సెక్స్ జీవితాలు నిర్లక్ష్యానికి గురవుతుంటాయి.
శృంగారంలో పురుషలతో పోలిస్తే స్త్రీలకు సమానమైన కోరికలు, ఆశలు, అవసరాలు ఉంటాయని, వాళ్ల పాత్ర కూడా కీలకమని పురుషులు అర్థం చేసుకోవాలి. సెక్స్ లో స్త్రీలను సుఖపరచడం చాలా ముఖ్యమైనదని గుర్తించాలి. సంతోషం, సౌకర్యం, సంతృప్తి మాత్రమే లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఉద్రేకం, సంతృప్తి అనేది సెక్స్ లో చాలా కీలకం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అనుభూతిని అందుకోవడం కష్టం అవుతుంది.

అయినప్పటికీ.. మహిళలు తమ లిబిడోను మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మీకు, మీ భాగస్వామికి ఏది మంచి అనుభూతిని కలిగిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ టెక్నిక్ లు ఆనందాన్ని పంచుతాయో, వేటి వల్ల సుఖం ఉండదో తెలుసుకోవం కీలకం. మహిళల్లో ఉద్రేకం పెంచడానికి ఏం దోహదం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫోర్ ప్లే:
శృంగారంలో ఫోర ప్లేది అత్యంత కీలకమైన పాత్ర. కానీ దీని విలువ చాలా మందికి తెలియదు. అసలు కార్యం మొదలు పెట్టడానికి ముందు ఫోర్ ప్లే చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయన్నది రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెప్పే మాట. ఫోర్ ప్లే వల్ల ఆడ, మగ ఇద్దరిలో శృంగార కోరికలు రగులుతాయి. ఇది మహిళలను మరింత ఉద్రేకానికి గురి చేస్తుంది. ఇది సంభోగం ప్రారంభించిన తర్వాత భావప్రాప్తి పొందే అవకాశాలను పెంచుతుంది. ముద్దులు పెట్టుకోవడం, తాకడం, మసాజ్ చేయడం, ప్రైవేట్ పార్ట్స్ ను తాకడం, సెక్స్ టాయ్‌లను ఉపయోగించడం వంటివి సెక్స్ ను మరింత సుఖంగా మారుస్తుంది.
2. విభిన్న భంగిమలు:
కొత్త ఎప్పుడూ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా శృంగారం విషయానికి వస్తే థ్రిల్ చాలా బాగుంటుంది. రొటీన్ ఏమాత్రం పనికి రాదు. ఎప్పుడో ఏదో ఒకటి కొత్తగా చేస్తూ పోవడం వల్ల చాలా సుఖన్ని అనుభవించవచ్చు. వివిధ లైంగిక భంగిమలతో ప్రయోగాలు చేయడం వల్ల మహిళలను సంతోషపరచవచ్చు.
3. లూబ్రికెంట్లు:
మహిళలు మంచి సంభోగాన్ని అనుభవించడంలో లూబ్రికెంట్లు చాలా కీలకం. వాటి వల్ల ఘర్షణ తగ్గి సున్నితత్వం పెరుగుతుంది. దీని వల్ల లైంగిక కలయిక మరింత ఆనందంగా ఉంటుంది. కొన్ని సార్లు మహిళలకు ఉద్రేకం రాకపోవడం వల్ల యోని పొడిగా ఉండవచ్చు. అలాంటి సమయంలో లూబ్రికెంట్లు చాలా బాగా పని చేస్తాయి.
4. కమ్యూనికేట్ చేయాలి:
లైంగిక విషయాల్లో కమ్యూనికేషన్ చాలా కీలకం. స్త్రీ పురుషులు ఇద్దరూ తమ కోరికలను, అవసరాలను తమ భాగస్వామితో చర్చించుకోవాలి. అప్పుడే వారి వారి కోరికలకు తగ్గట్లుగా శృంగార కార్యాన్ని సాగించే అవకాశం ఉంటుంది. కోరికలు నెరవేరడం వల్ల సంతృప్తి, సంతోషం కలుగుతాయి.
5. కెగెల్ వ్యాయామాలు:
కెగెల్ వ్యాయామంవల్ల కటి కండరాలు బలోపేతం అవుతాయి. ఇవి ఉద్వేగం పొందడానికి దోహదపడతాయి. క్రమం తప్పకుండా కెగెల్స్ చేయడం వల్ల పురుషులు, మహిళల జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications