Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లి చేసుకోగానే అయిపోదు, కలిసి నిలబడాలంటే ఇలా చేయాల్సిందే
ఒక సంబంధం విజయవంతం కావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. అన్నింటికి కంటే ముందు ఇద్దరు భాగస్వాముల మధ్య అండర్‌స్టాండింగ్, సాన్నిహిత్యం ఉండాలి. సంబంధంలో అడుగు పెట్టిన తర్వాత కొన్ని అంశాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలి. కింద ప
ఒక సంబంధం విజయవంతం కావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. అన్నింటికి కంటే ముందు ఇద్దరు భాగస్వాముల మధ్య అండర్‌స్టాండింగ్, సాన్నిహిత్యం ఉండాలి. సంబంధంలో అడుగు పెట్టిన తర్వాత కొన్ని అంశాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలి. కింద పేర్కొన్న ఈ చిట్కాలతో మీ సంబంధం విజయతీరాలకు చేర్చవచ్చు.

1. నమ్మకాన్ని పెంపొందించుకోవాలి
నమ్మకం ప్రేమకు పునాది. ఇది కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ వస్తుంది. నమ్మకాన్ని సాధించడానికి ఓపిక అవసరం. నిజం ఏమిటంటే, నమ్మకం మిమ్మల్ని ఓపెన్‌గా చేస్తుంది. మీ కలలు, సాఫల్యం, భయాలు, చింతలు మొదలైనవాటిని పంచుకోవడంలో వెనుకాడకుండా చేస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, స్థిరమైన విజయవంతమైన సంబంధాన్ని నిర్మించడంలో నమ్మకం అదే పని చేస్తుంది.

2. చెప్పేది వినండి
ఎదుటివారు చెప్పేది వినకపోవడం వల్ల చాలా సంబంధాలు నాశనం అవుతాయి. చెప్పడం కాదు వినడం కూడా ఒక కళ. దానిని అలవర్చుకోవాలి. మరొకరి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుకు దానిని సరిగ్గా వినాలి. దాంపత్య బంధంలో ఎదుటివారికి గౌరవం ఇస్తున్నారనడానికి నిదర్శనం వారు చెప్పేది వినడం.

3. ఇద్దరూ కలిసి ఒక హాబీని
సంబంధం మరింత బలపడాలన్నా, సాన్నిహిత్యం పెరగాలన్నా భాగస్వాములు ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇద్దరు కలిసి ఏదో ఒక హాబీని ఏర్పరచుకోవడం. ఇల హాబీలు ఏర్పరచుకోవడం వల్ల ఇద్దరూ కలిసి ఒకే పని చేస్తున్నప్పుడు అభిప్రాయాలు పంచుకోవచ్చు. అభిప్రాయాలు పంచుకున్నప్పుడే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

4. ప్రేమ
ఏ బంధంలో అయినా ఉండాల్సింది ప్రేమ. ప్రేమ ఉంటే చాలు మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ప్రేమించడం ముఖ్యం కాదు. అది ఎవరైనా చేస్తారు, చేయగలరు. కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించడం ముఖ్యం. మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉండాలి.

5. మద్దతు ముఖ్యం గురూజీ
మంచి, చెడు సమయాల్లో జీవిత భాగస్వామికి ఎప్పుడూ మద్దతుగా ఉండాలి. ఎలాంటి సమయాల్లో అయినా భాగస్వామి ఎప్పుడూ అండగా నిలబడతారని, మద్దతు ఇస్తారని ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడాలి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, రోజులు గడుస్తున్నకొద్దీ, బంధం బలోపేతం అవుతున్న కొద్దీ చేయాల్సిన పని ఇది.

6. క్షమాపణ చెప్పాలి
భాగస్వాముల హృదయాలను గెలుచుకోవాలంటే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం. ఇది ఈగోను పక్కనబెట్టి చెప్పాల్సి ఉంటుంది. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. ప్రతి బంధంలో చిన్న చిన్న కలహాలు, తగాదాలు, ఘర్షణ సాధారణం. అయితే తప్పు ఎవరిదో గుర్తించి క్షమాపణ చెప్పేందుకు వెనకాడకూడదు. క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య దూరం పోయి సాన్నిహిత్యం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications