Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఒకప్పటిలా సెక్స్ చేయలేకపోతున్నారా? ఇలా అగ్గిరాజేసి హాట్ హాట్‌గా చెలరేగిపోండి
పెళ్లైన కొన్ని రోజుల పాటు శృంగారంలో మునిగిపోతారు నవ దంపతులు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన రొమాన్స్ ఒలకబోస్తూ శృంగారంలో మునిగిపోతారు. శోభనం, హనీమూన్ ఆ తర్వాత ఇంట్లో కూడా శృంగారభరితంగా ఉంటూ మధురామృతాన్ని తనివితీరా అనుభవిస్తారు.
అయితే మొదట్లో ఉన్న ఆ లైంగిక ఆసక్తి రోజులు గడిచే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. ఒకప్పుడు వెచ్చని కౌగిలిలో, మెత్తని ఒత్తిళ్లను అనుభవించిన వారు క్రమంగా సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోతారు. శారీరక సౌఖ్యానికి, సంతృప్తి, ఉద్వేగానికి దూరమవుతారు. రెండు తనువుల కలిసి వేడి నిట్టూర్పులు వచ్చి ఆ సమయం.. ఓ మధురమైన అనుభూతిలా మిగిలిపోతుంది.

దంపతుల మధ్య ఆకర్షణ సన్నగిల్లుతుంది. లైంగిక కోరికలు క్రమంగా తగ్గిపోతాయి. ఎప్పుడో ఒకప్పుడు శృంగారాన్ని మొక్కుబడిగా కానిచ్చేస్తారు. దాంపత్య బంధానికి శృంగారం చాలా చాలా కీలకం. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి శృంగారమే కీలకం.
దాని వల్ల శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది:
పెళ్లైన తర్వాత కొన్ని రోజుల పాటు ఒకరికి ఒకరు ప్రత్యేకంగా సమయం కేటాయించుకుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ వివిధ పనుల వల్ల బిజీ అయిపోతుంటారు. దీని వల్ల ఆరోగ్యం, శృంగార బంధం రెండూ పాడవుతాయి. పనుల ఒత్తిడి వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు దెబ్బతింటుంది. మన ఆకారాన్ని, ఆకృతిని, అందాన్ని పాడు చేస్తుంది. ఒత్తిడిని ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో, శృంగారాన్ని అలాగే ప్రభావితం చేస్తుంది. అందుకే ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అది క్రమంగా శృంగారంపై ఇష్టాన్ని పెంచుతాయి.
ఆ విషయాలు చర్చించాలి:
దంపతుల మధ్య చర్చ చాలా కీలకం. భార్యాభర్తల మధ్య ఉండే దాపరికాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏ విషయాలనైనా నిజాయితీగా, బహిరంగ సంభాషించడం సంబంధానికి మూలస్తంభం. ఇద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం గురించి, శృంగార కోరికలు, అవసరాల గురించి భాగస్వామితో తప్పకుండా చర్చించాలి. ఇద్దరూ కలిసి తమ వ్యక్తిగత విషయాలు తప్పకుండా చర్చించుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. శృంగార కోరికలు, అవసరాలు, ఫాంటసీల గురించి తెలుసుకోవాలి. కొత్త కొత్త ఆలోచనలు, భంగిమల గురించి చెప్పాలి, తెలుసుకోవాలి.
రొమాంటిక్‌గా ఉండాలి:
శారీరక స్పర్శ అనేది సాన్నిహిత్యాన్ని పెంపొందిచడానికి, సంబంధంలో ఆకర్షణను పునురద్ధించాడనికి చాలా కీలకం. అందుకే వీలైనంత రొమాంటిక్ గా ఉండేందుకు ప్రయత్నించాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు. మీ భాగస్వామి ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వెనక నుంచి వెళ్లి కౌగలించుకోవడం, ముట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, గిలిగింతలు పెట్టడం, ప్రైవేట్ పార్ట్స్ ను తాకడం లాంటివి చేస్తూ వేడి రగిలించాలి. ఇది కోరికలను పుట్టించి శృంగారానికి ఉసిగొల్పుతుంది.
సెక్స్ షెడ్యూల్:
క్రమంగా సెక్స్ కు దూరం అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పరిష్కారం కనుగొనాలి. వీలైనంత త్వరగా పరిహారం పాటించాలి. కొత్తదనం ఎప్పుడూ థ్రిల్ ను అందిస్తుంది. కాబట్టి శృంగారం కొత్తగా ఉండేలా చూసుకోవాలి. కొత్తగా సెక్స్ చేయడం, కొత్త భంగిమలు, కొత్త ప్రదేశాలు, బెడ్రూము కాకుండా హాన్, వంటగది, డైనింగ్ టేబుల్, సోఫా బాత్రూమ్ లలో సెక్స్ లాంటివి ట్రై చేయాలి. అలాగే సెక్స్ చేసుకోవాడనికి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. సెక్స్ ను షెడ్యూల్ చేసుకుంటే.. ఆ సమయంలో కోసం వెయిట్ చేస్తూ.. కోరికలతో రగిలిపోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications