Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పటికీ సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా!
ప్రేమ బంధాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పోల్చుతుంటారు. అయితే ప్రేమ అనేది ఒక మొక్క అని అనుకుంటే దానికి కేవలం నీరు పోస్తే సరిపోదు..రోజూ ప్రేమ అనే సూర్యరశ్మి,నమ్మకం అనే పోషకాలకు,ఒకరికొరు ఇచ్చే సమయం అనే గాలి కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఆ బంధం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది. జీవిత ప్రయాణంలో సంబంధాలు మనకు తోడునీడగా ఉంటాయి. ముఖ్యంగా మనసైన వారితో మనకున్న అనుబంధం చాలా విలువైనది. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న పొరపాట్లు ఈ సున్నితమైన బంధంలో దూరం పెంచుతాయి. మీ లవ్ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా,హ్యాపీగా మార్చుకోడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
ఆటుపోట్లు సహజం
అలలు లేని సముద్రంలా గొడవలు లేని బంధం ఉండదు. లవ్ జర్నీలో ముళ్ల దారులు,ఎత్తుపల్లాలు ఎదురవడం సహజం. కొన్నిసార్లు గొడవలు,అలకలు ఉంటాయి కానీ ఒకరి చేయి ఒకరు వీడకుండా కలిసి నిలబడటంలోనే,కష్టసమయంలో ఒకరికకరు అండగా నిలవడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంటదని మన పెద్దలు,నిపుణులు తరచుగా చెబుతుంటారు.

ఖరీదైన గిఫ్ట్..మీ టైం
ప్రస్తుతం అందరి జీవితాలు ఏదో ఒక కారణం చేత బిజీగా మారిపోయాయన్నది సత్యం. పనిలో మునిగిపోయి మన ప్రియమైనవారిని మర్చిపోతుంటాం. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..సంపాదించే డబ్బు కన్నా,భాగస్వామికి ఇచ్చే సమయమే అత్యంత విలువైనది. కలిసి కాఫీ తాగడం, చేయి పట్టుకొని కొద్దిసేపు నడవడం, నచ్చిన సినిమా కలిసి చూడటం వంటి చిన్న చిన్న క్షణాలే మీ ప్రేమ బంధంలో మధురమైన జ్ణాపకాలు నింపుతాయి. భాగస్వామికి టైం ఇవ్వడం అంటే వారికి మీ లైఫ్ లో ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడమే.
బంధానికి ఆక్సిజన్..సంభాషణ
మాటలు ఆగిపోయిన చోట మౌనం పెంచే అగాధాలు స్టార్ట్ అవుతాయి. ఏ బంధానికైనా సంభాషణే ప్రాణవాయువు. మీ మనసులోని భావాలను, భయాలను, సంతోషాలను మీ భాగస్వామితో షేర్ చేసుకోండి. మాట్లాడటం వల్ల అపార్థాలు తొలగిపోతాయి, సాన్నిహిత్యం పెరుగుతుంది. కేవలం సమస్యల గురించే కాకుండా ఒకరినొకరు ప్రశంసించుకోవడం, చిన్న చిన్న సరదాలు పంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మనసు విప్పి మాట్లాడటమే హృదయాలను కలిపే వారధి.
ప్రేమ భాషను చదవాలి
ప్రతి ఒక్కరూ ప్రేమను పంచే విధానం, స్వీకరించే విధానం వేర్వేరుగా ఉంటాయి. కొందరికి ఓ చిన్న బహుమతి కొండంత సంతోషాన్నిస్తే..మరికొందరికి నీవున్నావు అనే భరోసా ఇచ్చే మాటలు చాలు. ఇంకొందరికి మీ శ్రద్ధ, సేవ చేయడం ప్రేమకు చిహ్నంగా కనిపిస్తుంది. మీ భాగస్వామి ప్రేమ భాష ఏమిటో తెలుసుకోండి. వారు దేనిని ఎక్కువగా ఇష్టపడతారో గమనించి ఆ విధంగా మీ ప్రేమను వ్యక్తపరిస్తే మీ ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని రెట్టింపవుతుంది.
గెలవడం కాదు,గెలిపించడం
చిన్న చిన్న విషయాలకే గొడవల వల్ల బంధం బలహీనపడుతుంది. ప్రతి వాదనలోనూ నేనే గెలవాలి అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు ఓడిపోవడం కూడా బంధాన్ని గెలిపిస్తుంది. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శాంతి, సామరస్యం ఉన్నచోటే ప్రేమ వర్ధిల్లుతుంది. ప్రేమను కాపాడుకోవడానికి అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, మనసు పెట్టి చెప్పేది వినడం, చిన్న విషయాలలో శ్రద్ధ చూపించడం వంటివి సరిపోతాయ్.



Click it and Unblock the Notifications