Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వివాహేతర సంబంధాల్లో టాప్ 5 నగరాలు ఇవే..కామంతో కటకటలాడిపోతున్నారు!
ఒకప్పుడు ప్రేమలు వేరు ఇప్పుడు ప్రేమలు వేరు. అప్పట్లో ఒకప్పుడు మన వీధుల్లో, మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే నిజమైన ప్రేమలు చిగురించేవి. పక్కింటి అబ్బాయో, ఎదురింటి అమ్మాయో మనసు దోచేస్తే ఆ చూపుల కలయికే ఓ మధురానుభూతి. ఆ తర్వాత కాలేజీ రోజుల్లోనో, స్నేహితుల ద్వారానే మన జీవిత భాగస్వాములను కలుసుకునేవాళ్ళం. ఇంటి డాబాలెక్కి, కిటికీల్లోంచి దొంగచూపులు చూస్తూ మనసులోని వారిని ఆరాధించే రోజులు కూడా ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రేమకు చిరునామాలుగా మారాయి. కానీ కాలం మారింది.
టెక్నాలజీ మన జీవితాల్లోకి వేగంగా దూసుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ముఖాముఖి పరిచయాల కంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోని డేటింగ్ యాప్స్ ప్రేమను, స్నేహాన్ని, ఒక్కోసారి అంతకు మించిన బంధాలను వెతికిపెట్టే పనిముట్లుగా మారాయి.టిండర్ లాంటి డేటింగ్ యాప్స్ లో లక్షల మంది ఒంటరి హృదయాలు ప్రేమ కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని యాప్ లు మాత్రం ఇంకో అడుగు ముందుకేసి,పెళ్లయిన వారికి కూడా తమ జీవిత భాగస్వాములు కాకుండా ఇతరులతో ప్రేమాయణం నడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలాంటి యాప్ లలో "గ్లీడెన్" ఒకటి. తాజాగా ఈ యాప్ భారతదేశంలో వివాహితులు ఎక్కువగా వివాహేతర సంబంధాలు నెరుపుతున్న 5 నగరాల జాబితాను రిలీజ్ చేసింది.

వివాహేతర సంబంధాలు ఎక్కువ ఉండే 5 భారతీయ నగరాలు
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరు సిటీలోనే వివాహేతర సంబంధాలు ఎక్కువట. ఈ నగరాల్లో నివసించే వివాహితులు తమ భాగస్వాములను కాదని కొత్త జోడీల కోసం గ్లీడెన్ యాప్ లో తెగ వెతికేస్తున్నారట. అంటే వివాహేతర సంబంధాలు బెంగళూరులో చాలా ఎక్కువగా ఉన్నాయని గ్లీడెన్ డేటా చెబుతోంది. ఇక, ఈ జాబితాలో రెండో ప్లేస్ లో మనదేశ ఆర్థిక రాజధాని ముంబై ఉండగా 3వ ప్లేస్ లో కోల్ కతా సిటీ, 4వ ప్లేస్ లో ఢిల్లీ, 5వ ప్లేస్ లో పూణే ఉంది. ఈ నగరాల్లో నివిసించే వ్యక్తులు జీవిత భాగస్వామి ఉండగానే మరొకరితో ఎఫైర్ పెట్టుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
చిన్న నగరాల్లోనూ ఇదే ట్రెండ్
ఈ ఐదు నగరాలు మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో ఉంటే గ్లీడెన్ జాబితా టైర్ 2, టైర్ 3 నగరాల లెక్కలను కూడా బయటపెట్టింది. ఆశ్చర్యకరంగా ఈ చిన్న పట్టణాల్లో కూడా ప్రజలు ఇప్పుడు వివాహేతర సంబంధాల వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్లీడెన్ యాప్ డేటా ప్రకారం మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న నగరాల్లో వివాహేతర సంబంధాల సంఖ్య మూడు రెట్లు వేగంగా పెరుగుతోందట. దీనికి గల కారణాన్ని కూడా గ్లీడెన్ వివరించింది. ఈ జాబితాలో జైపూర్ అగ్రస్థానంలో ఉండగా, చండీగఢ్, లక్నో, పాట్నా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ చిన్న పట్టణాల్లో చాలా మంది ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తుంటారు. దీనివల్ల వారిపై అనేక ఆంక్షలు, కట్టుబాట్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి కాస్త అవకాశం దొరికితే చాలు బయట తమకు నచ్చిన భాగస్వామి కోసం వెతకడం ప్రారంభిస్తున్నారట.



Click it and Unblock the Notifications