Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
భర్త ఈ సింపుల్ పనులు చేస్తే భార్య ఎక్కువ ప్రేమిస్తుంది.. మీరే లోకం అయిపోతారు!
భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఇద్దరిలో ఒకరు నెగ్లెట్ చేసినా కచ్చితంగా వారి బంధంలో గొడవలు, సమస్యలు మొదలవుతాయి. భార్య భర్తల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం కచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ ప్రేమ వికటిస్తుంది. భార్య భార్యలిద్దరూ వేరే వ్యక్తుల మాయలో పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే భర్తలు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ పాటించడం వల్ల కచ్చితంగా భార్య భార్యల మధ్య ప్రేమ బలపడుతుంది. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటి పనుల్లో సహాయం చేయడం
చాలా మంది మహిళలు ఇంటి పనులకే మరిమితం అవుతుంటారు. భర్తలు ఆఫీసు పనులన్నిటినీ చూసుకుంటూ ఉంటారు. దీని వల్ల భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ పోవాలంటే భర్తలు భార్యల ఇంటి పనుల్లో సహకారం అందించాలి. భార్య చేసే వంటలో లేదా ఇంటిని క్లీన్ చేయడంలో నైనా వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేయడంలోనైనా సహాయం చేయడం వల్ల భార్య, భర్తల మధ్య ప్రేమ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల భార్య, భర్తల మధ్య ప్రేమ డబల్ అవడంతో పాటు, శరీరక సంబంధంలోనూ వారి బంధం బలపడుతుందని చెబుతున్నారు. ఇంటి పనుల్లో భర్త భాగస్వామ్యం పెరిగితే భార్య భర్త కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందని, భర్తకు కావాల్సినవన్నీ ఇస్తుందని పేర్కొన్నారు.
భావాలను అర్ధం చేసుకోవాలి
మహిళలు ఎక్కువగా ఇంటి పనులకే పరిమితం అవుతుంటారు. అందుకే వారి మానసిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకే వారి మానసిక భావాలను అర్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి కృషిని ప్రశంసించడం, వారిని అభినందించడం వంటివి చేయాలి. అప్పుడే భార్యకు మీపై గౌరవంతో పాటు ప్రేమ కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. వారి భావాలను అర్ధం చేసుకొని వారి చిన్న చిన్న కోరికలను తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే వారి అవసరాలను నెరవేర్చాలని పేర్కొంటున్నారు.
ప్రేమ చూపించండి
ఇంటి పనుల్లో సహాయం చేస్తూనే భార్యలపై మీ ప్రేమను చిన్న చిన్న రూపాల్లో చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పనులు చేస్తూనే వారిని హగ్ చేసుకోవడం, వారిని ముద్దు పెట్టుకోవడం, వారికి ఇష్టమైన వంట వండి పెట్టడం వంటివి చేయాలట. ఇలా చేయడం వల్ల భార్యకు తనపై ఎంత ప్రేమ ఉందొ అర్ధం అవుతుందట. ఇతర విషయాలను పట్టించుకోవడం మానేసి భర్తకోసం తన జీవితాన్ని పెట్టేయడానికి సిద్ధమవుతుందని పేర్కొంటున్నారు.
సమయం ఇవ్వాలి
ఏ బంధంలోనైనా ఒకరిని మరొకరు అర్ధం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఒకరి కోసం ఇంకొకరు సమయం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మీ భార్యతో ప్రతిరోజూ గడపాలి. వారి బాధలను అర్ధం చేసుకోవాలి. వారికి కావాల్సింది సమకూర్చాలి. వారితో మంచి చెడు షేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. ప్రేమ చిగురిస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల కచ్చితంగా భర్తపైన భార్య ప్రేమ ఇంప్రూవ్ అవుతుంది.



Click it and Unblock the Notifications