Latest Updates
-
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా?
ప్రేమ పేరుతో నరకం అనుభవిస్తున్నారా? బయటపడటం ఇలా!
ఎవరిమీద నైనా ప్రేమ కలిగినప్పుడు అదొక అద్భుతమైన కలలా అనిపిస్తుంది. నా ప్రపంచమే నువ్వు అన్నట్టుగా సాగే ఆ ప్రయాణం, కాలక్రమేణా దారి తప్పితే? మొదట్లో ఉన్న గౌరవం తగ్గిపోయి, శ్రద్ధ స్థానంలో నిర్లక్ష్యం చేరితే? చిన్న విషయాలకే గొడవలు, అనుమానాలు, అశాంతి మీ దైనందిన జీవితంలో భాగమైతే మీరు ఒక విషపూరిత సంబంధంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.
అలాంటి బంధం మానసికంగా మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. అందులో నుంచి బయటపడటం నరకంలా అనిపించవచ్చు కానీ అది అసాధ్యం మాత్రం కాదు. ఆ బాధ నుంచి కోలుకుని, మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఈ 5 మంత్రాలు మీకు అండగా నిలుస్తాయి.

మిమ్మల్ని మీరు క్షమించుకోండి
ఒక బంధం ముగిసిపోగానే చాలామంది చేసే మొదటి తప్పు తమని తాము నిందించుకోవడం. నేను అలా చేసి ఉండకూడదేమో, నేను సర్దుకుపోవాల్సింది అని పదే పదే మధనపడతారు.
బంధం చెడిపోవడానికి ఇద్దరి బాధ్యతా ఉంటుంది. జరిగిన దానికి మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం మానేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోలుకోవడానికి వేసే మొదటి అడుగు.
నో కాంటాక్ట్ రూల్ పాటించండి
గాయం మానాలంటే దాన్ని పదే పదే తాకకూడదు. విడిపోయిన తర్వాత కూడా వారికి కాల్ చేయడం, మెసేజ్‌లు చూడటం, సోషల్ మీడియాలో వారిని చూడటం వంటివి చేయడం వల్ల పాత గాయాలు రేగుతాయి.
మీరు నిజంగా ముందుకు సాగాలనుకుంటే కఠిన నిర్ణయం తీసుకోండి. వారిని అన్ని ప్లాట్ ఫామ్స్ లో బ్లాక్ చేయండి లేదా కాంటాక్ట్ పూర్తిగా తగ్గించండి. కనీసం కొన్ని నెలల పాటు వారి గురించి తెలియకుండా ఉంటేనే మీ మెదడు వారి జ్ఞాపకాల నుంచి బయటపడగలదు.
భావోద్వేగాలను దాచుకోవద్దు
బలంగా కనిపించాలనే ప్రయత్నంలో కన్నీళ్లను ఆపుకోవద్దు. విచారం, కోపం, శూన్యత కలగడం సహజం. ఆ భావాలను బయటకు రానివ్వండి.
మీ నమ్మకమైన ఫ్రెండ్ తో మనసు విప్పి మాట్లాడండి, లేదా డైరీలో మీ బాధను రాసుకోండి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోండి. మనసులో ఉన్న భారం దిగిపోతేనే మీరు తేలికగా ఊపిరి పీల్చుకోగలరు.
మీ కోసం మీరు బతకడం మొదలుపెట్టండి
విషపూరిత బంధంలో ఉన్నంతకాలం మీ ఇష్టాలను, సంతోషాలను పక్కన పెట్టి ఉంటారు. ఇప్పుడు సమయం మీది. మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయండి. కొత్త హాబీని నేర్చుకోండి, జిమ్ కి వెళ్లండి, సోలో ట్రిప్ ప్లాన్ చేయండి లేదా కెరీర్ పై దృష్టి పెట్టండి. మీరు మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెడితే, పాత జ్ఞాపకాలు వాటంతట అవే మసకబారుతాయి.
ఒంటరితనం శాపం కాదు
చాలామంది ఒంటరిగా మిగిలిపోతామేమో అనే భయంతోనే చెడు సంబంధాలను భరిస్తుంటారు. కానీ మనశ్శాంతి లేని బంధం కంటే ఒంటరితనమే వెయ్యి రెట్లు నయం. ఈ ఏకాంతాన్ని ఒక అవకాశంగా మలుచుకోండి.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ బలాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ ఒంటరితనమే భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైన బంధానికి పునాది వేస్తుంది.



Click it and Unblock the Notifications











