Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పెళ్లయిన వాళ్లకు జలుబు చేస్తే.. ఇంతకు మించిన ట్రీట్ మెంట్ మరోటి ఉండదు, ఏం చేయాలో తెలుసా?
జలుబు.. ఇది చాలా చిన్న విషయమే. కానీ దీని ద్వార పడిశం, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఇలా చాలానే వస్తాయి. అయితే ఇదే జలుబు చిన్న పిల్లలకు వస్తే జ్వరం రావడం ఖాయం. వెంటనే వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. కానీ పెళ్లయిన వాళ్లకు జలుబు వస్తే అసలు పట్టించుకోరు.
పెద్ద వాళ్లమే కదా ఓ మాత్రం వేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. అది కూడా నిజమే. అయితే మాత్రలో కంటే కూడా మరో పని చేస్తే జలుబు నుంచి త్వరగా విముక్తి పొందొచ్చు. అదేంటీ అనుకుంటున్నారా..!

శృంగారంతో జలుబు మాయం!
ఏం లేదండి. మీకు ఇష్టమైన పనే. అదే మీ భార్య లేదా భర్తతో శృంగారం. శృంగారం చేయడం వల్ల సంతోషం, ప్రేమ వస్తాయనే విషయం అందరికీ తెలుసు. మానసిక ఒత్తిడి తగ్గడం, తెలివితేటలు పెరగడం కూడా అందరికీ తెలిసిందే. కానీ మరో కొత్త అధ్యయనం ప్రకారం.. జబులు అయిన వారు సెక్స్ లో పాల్గొంటే జబులు తగ్గుతుందని తెలుస్తోంది. అంతే కాదు జలుబు వచ్చే ఛాన్స్ ఉన్నా.. రాకుండా చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
సెక్స్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుందట!
వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో.. జలుబుతో పోరాడే యాంటీ బాడీలు పెద్ద మొత్తంలో ఉంటాయట. కాబట్టి సెక్స్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొనడం వల్ల కేవలం జబులు మాత్రమే తగ్గకుండా బ్రెయిన్ కు ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుందని పేర్కొంటున్నారు. అలాగే ఒంట్లో కొవ్వు తగ్గుతుందని.. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదం చేస్తుందని పలు అధ్యనాలు గతంలో తెలిపాయి.
గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుంది:
శృంగారం చేయడం వల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. పలు వైరస్ ల బారి నుంచి ఎదుర్కోవడానికి సెక్స్ సహకరిస్తుందని... పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. వారంలో ఒకసారి లేదా రెండు సార్లు సెక్స్ చేసుకునే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని హెల్తీగా ఉండాలంటే సెక్స్ తప్పనిసరి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications