Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ భార్యతో గొడవ అయ్యేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిపోతుంది!
వివాహ బంధంలో సాధారణంగానే గొడవలు జరుగుతుంటాయి. సమస్య ఎవరిదైనా, ఎలాంటిదైనా దంపతుల మధ్య సాధారణంగానే గొడవలు జరుగుతుంటాయి. గొడవలు, ఘర్షణలు చిన్నవే అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాల వల్ల బంధం నిలబడొచ్చు లేదా కూలిపోవచ్చు కూడా. అంతటి ప్రమాదకరమైన రోజులు కూడా ఉన్నాయి.
అయితే మీ భాగస్వామితో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక అయిదు సెకన్ల పాటు ఆలోచిస్తే ఫలితం ఉంటుందని, తద్వారా గొడవ సద్దుమనుగడంతో పాటు, గొడవను పరిష్కరించుకునేందుకు సంబంధించిన పరిష్కార మార్గం కూడా దొరుకుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే గొడవలు జరిగేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?, అయిదు సెంకండ్ల పాటు ఆగితే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గడవ పెద్దది కాకుండా..
సాధారణంగా గొడవ అనేది చిన్నడిగానే మొదలై పెద్దదిగా ముగుస్తుంది. ఈ మధ్యలో బంధాలు విచ్చిన్నమైనా మనం ఆశ్చర్యపోయినక్కరలేదు. అయితే ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు జరిగే విషయంలో ఒక అయిదు సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల గొడవ సద్దుమణిగే అవకాశం ఉంటుంది. అలాగే గొడవ పెద్దదిగా అయ్యే అవకాశం ఉండదు. గొడవ పెద్దదిగా అవ్వాలన్నా, పరిష్కారమవ్వాలన్నా భాగోద్వేగాలనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే గొడవయ్యేటప్పుడు ఒక అయిదు నిమిషాల పాటు ఆగి నిర్ణయం తీసుకునే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందట.
అధ్యయనంలో ఏం తేలిందంటే?
ఈ 5 సెకన్ల గ్యాప్ విషయంపై 81 జంటలపై జరిపిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడిలోకి వచ్చాయి. గొడవ పెద్దదిగా కాకుండా ఉండేందుకు ఈ అయిదు సెకన్ల సమయం ఉపయోగపడుతుందా అనే విషయంపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎప్పుడైతే గొడవ పెద్దదిగా అవుతుందని అనిపిస్తుందో అలాంటి సమయంలో అయిదు సెకన్ల గ్యాప్ తీసుకుంటే చాలా వరకు సమస్య తీరుతుందట.
సాధారణంగా కోపంతోనే కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అనూహ్యమైన నిర్ణయాలను తీసుకోకుండా ఉండేందుకు, అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేయకుండా ఉండేందుకు ఈ అయిదు సెకన్ల సమయం గ్యాప్ తీసుకోవాలట. ఇలా అయిదు సెకన్ల సమయం గ్యాప్ తీసుకుంటే ఆ నిర్ణయాలు బంధాన్ని ఎలాంటి ప్రభావానికి గురి చేయవని చెప్తున్నారు.
అయిదు సెకన్లలో ఏం చేయొచ్చు?
ఇంతటి గొప్ప ఉపయోగాలు ఉన్న ఈ అయిదు సెకన్లలో ఏం చేయొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అయిదు సెకన్ల సమయంలో గట్టిగా ఒక ఊపిరి తీసుకోవచ్చు. ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా గొడవ ఎక్కడ మొదలయ్యింది ఎందుకు మొదలయ్యింది అనే విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ అయిదు సెకన్ల సమయంలో ఎలాంటి బూతులు రాకుండా మన నోటిని మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు.
అలాగే.. సమస్యను మొగ్గలోనే తుంచేయడానికి, గొడవకు గల కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టు వ్యూహాన్ని అమలుపరిచేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఎప్పుడైనా మీ భాగస్వామితో మీకు గొడవ అయితే ఈ అయిదు సెకన్ల సమయాన్ని మీరూ ట్రై చేయండి, అలాగే మీ భాగస్వామితో కూడా ప్రయత్తింపజేయండి. ఇది మీకు కచ్చితంగా సహాయకరంగా ఉంటుంది.
ఇది ముఖ్యమైన విషయం..
గొడవ పడినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది ఇదే. గొడవ పడేటప్పుడు ఎప్పుడూ మనదే పై చేయి అని అనుకోవద్దు. ఎదుటివారి సమస్య, ఎదుటివారి మాటలకు కూడా విలువనివ్వాలి. వారి స్థానంలో ఉంది ఆలోచించి ఏది మంచి నిర్ణయమో అర్ధం చేసుకోవాలి. గొడవను సమస్య కోణం చూస్తే సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. దీంతో గొడవ సద్దుమణుగుతుంది. ఇకపై మీ భాగస్వామితో గొడవ అయ్యేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.



Click it and Unblock the Notifications